Share News

Saudi Arabia: డొమెస్టిక్ వర్క్ వీసాకు కొత్త కండిషన్ పెట్టిన సౌదీ.. ఇకపై..

ABN , First Publish Date - 2023-11-26T07:26:20+05:30 IST

కింగ్‌డమ్ ఆఫ్ సౌదీ అరేబియా (Kingdom of Saudi Arabia) డొమెస్టిక్ వర్క్ వీసా పొందేందుకు కొత్త కండీషన్ తీసుకొచ్చింది. పెళ్లికాని సౌదీ పౌరులు విదేశీ గృహ కార్మికులను నియమించుకోవాలంటే ఇకపై వర్క్ వీసా పొందాలంటే 24 ఏళ్లు నిండి ఉండాలనే షరతు విధించింది.

Saudi Arabia: డొమెస్టిక్ వర్క్ వీసాకు కొత్త కండిషన్ పెట్టిన సౌదీ.. ఇకపై..

రియాద్: కింగ్‌డమ్ ఆఫ్ సౌదీ అరేబియా (Kingdom of Saudi Arabia) డొమెస్టిక్ వర్క్ వీసా పొందేందుకు కొత్త కండీషన్ తీసుకొచ్చింది. పెళ్లికాని సౌదీ పౌరులు విదేశీ గృహ కార్మికులను నియమించుకోవాలంటే ఇకపై వర్క్ వీసా పొందాలంటే 24 ఏళ్లు నిండి ఉండాలనే షరతు విధించింది. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ (Ministry of Human Resources and Social Development) పరిధిలోని ముసానెడ్ ప్లాట్‌ఫారమ్‌ (Musaned platform) ద్వారా ఈ మేరకు కొత్త ప్రకటన చేసింది. కొత్త రూల్స్ ప్రకారం సౌదీలు, గల్ఫ్ దేశాల పౌరులు, దేశ పౌరుల భార్యలు, దేశ పౌరుల అమ్మలు, ప్రీమియం రెసిడెన్సీ కలిగిన వారు వారి ఆర్థిక స్థితిగతులను బట్టి డొమెస్టిక్ వర్క్ వీసాలు ఇవ్వొచ్చు.

Indian Nurse: యెమెన్‍లో భారతీయ నర్సుకు ఉరిశిక్ష.. ఎవరీ నిమిషా ప్రియా.. ఇంతకీ ఆమె చేసిన నేరమేంటి?


ఇక ఈ డొమెస్టిక్ వర్క్ వీసా (Domestic worker visa ) అర్హతలకు సంబంధించిన పూర్తి సమాచారం ముసానెడ్ ప్లాట్‌ఫారమ్‌లో ఉంటుందని మంత్రిత్వశాఖ తెలిపింది. కాగా, మొదటిసారి వీసా జారీ చేయాలంటే యజమాని కనీస నెలవారీ వేతనం 40వేల సౌదీ రియాల్స్ (రూ.8.88లక్షలు) ఉండాలి. ఇదిలాఉంటే.. కింగ్‌డమ్‌లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను మెరుగుపరచడం, వివాదాలను పరిష్కరించడం, కార్మికుడు మరియు యజమాని హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా గృహ సేవలతో పాటు గృహ ఉపాధి కార్యక్రమాల కోసం మంత్రిత్వశాఖ ముసానేడ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రారంభించింది.

Mahzooz raffle draw: అదృష్టం అంటే మనోడిదే.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.45కోట్లు!

Updated Date - 2023-11-26T07:33:26+05:30 IST