TANA: డెట్రాయిట్‌లో పేద విద్యార్థులకు 'తానా' బ్యాగుల పంపిణీ
ABN , First Publish Date - 2023-10-22T09:51:28+05:30 IST
అమెరికాలోని పేదవాళ్ళకు సహాయం చేసేందుకు వీలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు డా. నవనీత కృష్ణ గొర్రెపాటి ప్రవేశపెట్టిన 'తానా బ్యాక్ ప్యాక్' పథకంలో భాగంగా డెట్రాయిట్‌లోని మౌండ్ పార్క్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు.
TANA: అమెరికాలోని పేదవాళ్ళకు సహాయం చేసేందుకు వీలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు డా. నవనీత కృష్ణ గొర్రెపాటి ప్రవేశపెట్టిన 'తానా బ్యాక్ ప్యాక్' పథకంలో భాగంగా డెట్రాయిట్‌లోని మౌండ్ పార్క్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు. డీటీఏ మాజీ ప్రెసిడెంట్ నీలిమ మన్నె, తానా నాయకులు సునీల్ పంట్ర, జేఆర్. శ్రీనివాస్ గోగినేని సహాయంతో దాదాపు 400 మంది విద్యార్థులకు ఈ బ్యాగ్‌లను అందించారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ నాయకులు వెంకట్ ఎక్కా, వినోద్ కుకునూర్, రాంప్రసాద్ చిలుకూరు, కిరణ్ దుగ్గిరాల, సుబ్రత గడ్డం, సుధీర్ కట్ట, జోగేశ్వరరావు పెద్దిబోయిన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బ్యాగ్‌లను పంపిణీ చేసిన దాతలకు స్కూల్ నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేశారు.