Home » TANA
గచ్చిబౌలిలో 'తానా ఫౌండేషన్', 'స్వేచ్ఛ' సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 600 మందికి ఉచితంగా వైద్యసేవలు అందించారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) విజయోత్సవ వేడుకలు శనివారం నాడు వాషింగ్టన్ డిసిలో జరిగాయి. డాకర్ట్ నరేన్ కొడాలి వర్గం, తానా సభ్యులు, శ్రేయోభిలాషులు 600 మంది పాల్గొన్నారు. తానా ఎన్నికలు జనవరి 24వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అన్ని పదవుల్లో నరేన్ కొడాలి వర్గం విజయం సాధించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మరో వర్గం కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిగి, తానా ఎన్నికను కోర్టు ఆమోదించింది. దాంతో మార్చి 23వ తేదీన తానా సభ్యులు బాధ్యతలు చేపట్టి, విజయోత్సవ సభ నిర్వహించారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం బోర్డు చైర్మన్ పదవి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు సమావేశంలో చైర్మన్, కార్యదర్శి, కోశాధికారిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు కార్యదర్శిగా శ్రీమతి లక్ష్మి దేవినేని, కోశాధికారిగా శ్రీ జనార్దన్ (జానీ ) నిమ్మలపూడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కొత్త కార్యవర్గం ఏర్పడింది. తానా ఫౌండేషన్ చైర్మన్‌గా శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్ గారపాటి, ట్రెజరర్‌గా వినయ్ మద్దినేని, జాయింట్ ట్రెజరర్‌గా కిరణ్ గోగినేని ఎన్నికయ్యారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)లో కొత్త సభ్యుల ఎన్నికపై ప్రతిష్ఠంభన వీడింది. కొత్త సభ్యుల ఎన్నికకు బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఎన్నికపై నెలకొన్న వివాదం సమసిపోయింది.
అనూహ్య మలుపులతో రెండేళ్లపాటు కొనసాగిన "తానా" ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. జనవరి 18న ప్రకటించిన ఎన్నికల ఫలితాల ప్రకారం మొత్తం అన్ని జాతీయ పదవులను గెలుచుకొన్న టీం కొడాలి.. డాక్టర్ నరేన్ కొడాలి సారథ్యంలో విజయం సాధించింది.
తానా మాజీ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు ప్రస్తుతం జరుగుతున్న తానా ఎన్నికలలో తన సంపూర్ణ మద్దతు నరేన్ కొడాలి ప్యానెల్‌కేనని తెలిపారు.
ఉత్తరఅమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్యవిభాగం – ‘తానా ప్రపంచసాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రముఖ సినీకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్రసాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబ సభ్యుల సహకారంతో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా అందించిన సంగతి విదితమే.
2023-25 కాలానికి గానూ 'తానా' తరఫున డెట్రాయిట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా బేతంచర్ల ప్రసాద్ నియమితులయ్యారు.
అమెరికాలోని పేదవాళ్ళకు సహాయం చేసేందుకు వీలుగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మాజీ అధ్యక్షుడు డా. నవనీత కృష్ణ గొర్రెపాటి ప్రవేశపెట్టిన 'తానా బ్యాక్ ప్యాక్' పథకంలో భాగంగా డెట్రాయిట్‌లోని మౌండ్ పార్క్ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లను పంపిణీ చేశారు.