Eid Al Fitr: రంజాన్‌కు వరుసగా 4రోజులు సెలవులు.. మోత మోగనున్న విమాన ఛార్జీలు!

ABN , First Publish Date - 2023-03-10T13:42:12+05:30 IST

రంజాన్ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (United Arab Emirates) నివాసితులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. Four Day Holiday for Eid Al Fitr in UAE Airfares rises rams spl

Eid Al Fitr: రంజాన్‌కు వరుసగా 4రోజులు సెలవులు.. మోత మోగనున్న విమాన ఛార్జీలు!

అబుదాబి: రంజాన్ సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని (United Arab Emirates) నివాసితులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి. ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం ఈద్ అల్ ఫితర్ (Eid Al Fitr) మొదటి రోజు ఏప్రిల్ 21 (ఫ్రైడే) ఉండనుంది. దీంతో రెసిడెన్స్‌ను ఏప్రిల్ 20వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 4రోజుల పాటు వరుస సెలవులు లభిస్తాయి. ఈ నేపథ్యంలో యూఏఈ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు నివాసితులు, ప్రవాసులు భారీగా ప్లాన్ చేసుకుంటున్నార. దాంతో వివిధ గమ్యస్థానాలకు విమాన ఛార్జీల మోత మోగడం ఖాయమని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పటికే సుమారు 15శాతం మేర ఛార్జీలు పెరిగాయని తెలిపారు.

ఇక రంజాన్ సందర్భంగా విద్యా సంస్థలకు భారీగానే సెలవులు (Holidays) ఉంటాయి. దాంతో ప్రవాసులు స్వదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతారు. ఈ నేపథ్యంలోనే విమాన ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రావెల్ ఏజెంట్లు చెబుతున్న మాట. ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ musafir.com ప్రకారం ట్రావెల్ ప్యాకేజీల కోసం 30 శాతం డిమాండ్ ఉందని పేర్కొంది. ఎక్కువగా అజర్‌బైజాన్, జార్జీయా, అర్మేనియా, సింగపూర్, కెన్యా, థాయిలాండ్, మలేషియా, కజికిస్థాన్, కిర్గిజ్‌స్థాన్ వంటి గమ్యస్థానాలకు భారీ డిమాండ్ ఉందని ఏజెన్సీ మేనేజింగ్ పార్ట్‌నర్ భరత్ ఐదాసానీ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద లాటరీ.. 16వేల కోట్లు గెలిచిన అమెరికన్.. ప్రైజ్‌మనీతో ఏం చేస్తున్నాడో తెలిస్తే..!

Updated Date - 2023-03-10T13:42:12+05:30 IST