Mississippi Mass Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. ఆరుగురు మృతి!

ABN , First Publish Date - 2023-02-18T09:11:40+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో (America) మళ్లీ తూటా పేలింది. శుక్రవారం మిస్సిస్సిప్పీలోని (Mississippi) పలు ప్రాంతాల్లో ఓ ఉన్మాది జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి.

Mississippi Mass Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. ఆరుగురు మృతి!

మిస్సిస్సిప్పీ: అగ్రరాజ్యం అమెరికాలో (America) మళ్లీ తూటా పేలింది. శుక్రవారం మిస్సిస్సిప్పీలోని (Mississippi) పలు ప్రాంతాల్లో ఓ ఉన్మాది జరిపిన కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. మిస్సిస్సిప్పీలోని టెన్నెస్సీ స్టేట్ లైన్‌లో దుండగుడు తుపాకీతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. మొదట టేట్‌ కౌంటీలోని అర్కబుట్ల రోడ్డులో ఉన్న ఓ షాప్‌లోకి తుపాకీతో చొరబడిన దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు చనిపోయారు. అనంతరం సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లిన సాయుధుడు అక్కడ ఇద్దరిని కాల్చి చంపాడు. ఆ తర్వాత మరో ఇద్దరిని అర్కబుట్ల డ్యామ్‌ వద్ద కాల్చేశాడు. ఇలా వరుస కాల్పుల్లో మొత్తం ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

కాగా, కాల్పుల అనంతరం నిందితుడు కారులో పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నామని అధికారులు చెప్పారు. ఇక ఈ ఘటనపై మిస్సిస్సిప్పీ గవర్నర్ టేట్ రీవ్స్ విచారం వ్యక్తం చేశారు. "టేట్ కౌంటీ వరుస కాల్పులు బాధకరం. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. ఈ కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియలేదు. ఏ ఉద్దేశంతో అతడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడో తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై విచారణకు మిస్సిస్సిప్పీ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ సహాయం కూడా తీసుకుంటున్నాం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి" అని గవర్నర్ ట్వీట్ చేశారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో తీసుకున్న విడాకులు.. భారత్‌లో చెల్లుతాయా..? అగ్రరాజ్యంలో ఓ భర్త తన భార్యకు విడాకులు ఇస్తే..!

ఇదిలాఉంటే.. ఈనెల 16న టెక్సాస్‌లోని సీలో విస్టా షాపింగ్‌ మాల్‌ (Cielo Vista Mall )లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఒకరు చనిపోగా, మరో ముగ్గురు గాయపడ్డారు. అంతకు మూడు రోజుల ముందు 13న (సోమవారం) కూడా మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌లో (Michigan State University Campus) ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడ్డ విషయం తెలసిందే. ఓ సాయుధుడు యూనివర్శిటీ క్యాంపస్‌లోకి చోరబడి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఇక ఈ సంఘటన జరిగిన నాలుగు గంటల తర్వాత దుండుగుడు తనను తాను కాల్చుకుని, ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఇన్‌స్టా రీల్స్ కోసం ఈ యువతి వెరైటీగా ట్రై చేద్దామనుకుంది కానీ.. ఒక్క క్షణంలోనే సీన్ ఇలా రివర్స్ అయిపోయింది..!

Updated Date - 2023-02-18T09:18:51+05:30 IST