Indians in UK: బ్రిటన్ ఆరోగ్య రంగంలో భారతీయులదే హవా.. వెలుగులోకి సంచలన నివేదిక..!

ABN , First Publish Date - 2023-08-09T10:01:33+05:30 IST

గతేడాది బ్రిటన్‌లో (Britain) స్కిల్డ్ వర్క్ వీసాల (Skilled Work Visas) కింద స్పాన్సర్ చేయబడ్డ మెజారిటీ హెల్త్ కేర్ వర్కర్లు (Health Care Workers) యూరోపియన్ యూనియన్ యేతర దేశాల నుంచి వచ్చినట్లు తాజాగా వెలువడిన ఓ నివేదిక వెల్లడించింది.

Indians in UK: బ్రిటన్ ఆరోగ్య రంగంలో భారతీయులదే హవా.. వెలుగులోకి సంచలన నివేదిక..!

ఎన్నారై డెస్క్: గతేడాది బ్రిటన్‌లో (Britain) స్కిల్డ్ వర్క్ వీసాల (Skilled Work Visas) కింద స్పాన్సర్ చేయబడ్డ మెజారిటీ హెల్త్ కేర్ వర్కర్లు (Health Care Workers) యూరోపియన్ యూనియన్ యేతర దేశాల నుంచి వచ్చినట్లు తాజాగా వెలువడిన ఓ నివేదిక వెల్లడించింది. వీరిలో సింహాభాగం భారత్ నుంచి వస్తే, కేవలం ఒకే ఒక్క శాతం మాత్రమే ఈయూ దేశాలకు (EU countries) చెందిన వారని రిపోర్ట్ పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లోని (University of Oxford) మైగ్రేషన్ అబ్జర్వేటరీ (Migration Observatory) ఈ నివేదికను తయారు చేసింది. యూకే ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ 2022-23 ఆర్ధిక సంవత్సరంలో విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను హెల్త్ అండ్ కేర్ వర్క్ ఫోర్స్‌లోకి తీసుకొచ్చిందని నివేదిక తెలిపింది.

ఇక కొత్తగా రిక్రూట్ అయిన విదేశీ వైద్యులు (20 శాతం), నర్సులు (46 శాతం) తో జాతీయతపరంగా భారత్ (India) అగ్రస్థానంలో ఉందని నివేదిక తెలియజేసింది. నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నట్లు వెల్లడించింది. 2022లో సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్‌షిప్ (Certificates of Sponsorship)ని ఉపయోగించే కార్మికులకు పౌరసత్వం విషయంలోనూ భారతదేశం (33 శాతం) అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో జింబాబ్వే, నైజీరియా ఉన్నాయి. కాగా, 2017 నుంచి సిబ్బంది కొరత నేపథ్యంలో హెల్త్ అండ్ హెల్త్ కేర్ సెక్టార్‌లో నైపుణ్యం కలిగిన ఉద్యోగ వీసాలపై ఈయూ యేతర పౌరుల రిక్రూట్‌మెంట్ బాగా పెరిగింది.

UAE: ప్రవాసులు జర జాగ్రత్త.. ఇకపై అలా చేశారో రోజుకు రూ.1100 జరిమానా..!


యూకే నేషనల్ స్టాటిస్టిక్స్ కార్యాలయం (UK National Statistic Office) ప్రకారం 2021-2022లో ఈ విషయంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. యూకే ఇమ్మిగ్రేషన్ సిస్టమ్ (UK Immigration System) మార్చి 2023తో ముగిసే ఆర్ధిక సంవత్సరంలో భారీ సంఖ్యలో విదేశీ హెల్త్, హెల్త్ అండ్ కేర్ కార్మికులను నియమించుకుంది. దాదాపు 57,700 మంది హెల్త్ కేర్ వర్కర్లు స్కిల్డ్ వర్క్ వీసాలు పొందారు. ఇక గతేడాది బ్రిటన్‌కి మొత్తం వలసలు 6,06,000కు చేరుకున్నాయి. ఇవి గతేడాదితో పోలిస్తే 24 శాతం అధికం.

Expats: 100 మంది ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టిన కువైత్.. కారణమిదే..!

Updated Date - 2023-08-09T10:01:33+05:30 IST