TACA: కెనడాలో అంగరంగ వైభవంగా 'తాకా' వారి శ్రీ సీతారాముల కళ్యాణం

ABN , First Publish Date - 2023-04-04T09:12:37+05:30 IST

తెలుగు అలయెన్స్ ఆఫ్ కెనడా (తాకా) వారు శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

TACA: కెనడాలో అంగరంగ వైభవంగా 'తాకా' వారి శ్రీ సీతారాముల కళ్యాణం

ఎన్నారై డెస్క్: తెలుగు అలయెన్స్ ఆఫ్ కెనడా (తాకా) వారు శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. టొరంటోలోని శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ ఆడిటోరియంలో దాదాపు 600 మందికి పైగా భక్తులు హాజరవ్వగా మేళతాళాలు, కూచిపూడి నాట్యము, పాటలు, భజనలతో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగింది. శనివారం(ఏప్రిల్ 1) ఉదయం 8 గంటలకు కల్యాణోత్సవాలు ప్రారంభమయ్యాయి. తాకా అధ్యక్షులు కల్పన మోటూరి, కార్యవర్గ సభ్యులు, ట్రస్టీలు, వ్యవస్థాపక సభ్యులు ఉదయం 6 గంటలకు వేడుక వద్దకు చేరుకొని పానకము, వడపప్పు తయారు చేశారు. తాకా యువ కార్యకర్తలు స్వామి వారి పెళ్లి మందిరమును సిద్ధం చేయడం జరిగింది.

T.jpg

టొరంటోలోని ప్రముఖ అర్చకులు మంజునాథ్ సిద్ధాంతి, వారి శిష్య బృందంతో సుప్రభాత సేవ, అభిషేకం, షోడశోపచార పూజలతో స్వామి వారి కల్యాణాన్ని మొదలు పెట్టారు. అనంతరం కలశ స్థాపన, పుణ్యావచనం, ప్రవర, జిలకర బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర క్రతువులతో కార్యక్రమాన్ని జరిపించారు. సర్వోపచార సేవలు నృత్యం, గీతం, భజనలు, మంగళ వాయిద్యాలతో భక్తులు మైమరిచిపోయారు.

TTT.jpg

ఈ కార్యక్రమంలో అలంకృత ఎలమర్తి (సుప్రభాతం), రోహన్ మూటుపూరు, శ్రీరామ్ గోర్తీ, సాయిశ్రీ ద్రువిక పాటలు పాడగా.. పూష్ణే కోట్ల, ధన్య కిరణి, ఆద్య కిరణి, మేధా ప్రసాద్ నృత్యాలతో సర్వోపచారములలో భాగంగా కల్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తుల అభినందనలు పొందారు.

TTTT.jpg

టొరంటోలో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు వంద మంది జంటలు కల్యాణానికి కూర్చొన్నారు. వందల మంది సంకల్పం తీసుకున్నారు. దాదాపు 5 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం చివరగా మంగళ హారతులు పాడి, తీర్థ ప్రసాదాలను భక్తులందరికి అందజేశారు.

TTTTT.jpg

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ఉపాధ్యక్షులు నాగేంద్ర హంసల, కార్యదర్శి ప్రసన్న తిరుచిరాపల్లి, కోశాధికారి మల్లికార్జున చారి పదిర, సాంస్కృతిక కార్యదర్శి అనిత సజ్జ, డైరెక్టర్లు గణేష్ తెరాల, రాణి మద్దెల, శృతి ఏలూరి, ప్రదీప్ రెడ్డి ఏలూరు, యూత్ డైరెక్టర్ విద్య భవనం.. ఆడియో, వీడియో విభాగంలో ఆదిత్య వర్మను, బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ మునాఫ్ అబ్దుల్, సభ్యులు రాఘవ అల్లం, సురేష్ కూన, వాణి జయంతి, ప్రవీణ్ పెనుబాక, తాకా వ్యవస్థాపక చైర్మన్ రవి వారణాసి, సభ్యులు చారి సామంతపూడి, అరుణ్ లయం, లోకేష్ చిల్లకూరు, రమేష్ మునుకుంట్ల, రాకేష్ గరికపాటి, శ్రీనాథ్ కుందూరు, రామచంద్ర రావు దుగ్గిన, అందరి వాలంటీర్లను తాకా అధ్యక్షులు కల్పన మోటూరి అభినందించారు.

TTTTTT.jpg

TTTTTTT.jpg

Updated Date - 2023-04-04T09:12:37+05:30 IST