Dubai Duty Free: దుబాయి లాటరీలో తెలుగు ప్రవాసుడికి జాక్‌పాట్.. ఎంత గెలుచుకున్నాడంటే..
ABN , First Publish Date - 2023-10-15T07:30:14+05:30 IST
దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ (Dubai Duty Free Millennium Millionaire) లో తెలుగు ప్రవాసుడికి జాక్‌పాట్ తగిలింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం డ్రా నిర్వహించారు.
Dubai Duty Free Raffle: దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ (Dubai Duty Free Millennium Millionaire) లో తెలుగు ప్రవాసుడికి జాక్‌పాట్ తగిలింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ కోసం డ్రా నిర్వహించారు. ఈ డ్రాలో ఓ తెలుగు ఎన్నారై 1మిలియన్ డాలర్లు(రూ. 8.22కోట్లు) గెలుచుకున్నాడు. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కర్ణయ్య మండోళ్లనే ఈ జాక్‌పాట్ కొట్టాడు. దీంతో అతడు రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అక్టోబర్ 5న ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కర్ణయ్యకు ఇలా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. కాగా, కొన్నేళ్లుగా అతడు దుబాయ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు. ఇప్పుడు లక్ కలిసి రావడంతో గ్రాండ్ ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు.
ఇక ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల కర్ణయ్య హర్షం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తాను గెలిచిన భారీ ప్రైజ్‌మనీలో కొంత మొత్తాన్ని తన పిల్లల చదువుల కోసం డబ్బు ఆదా చేస్తానని అన్నాడు. మరికొంత భాగం స్వచ్ఛంద కార్యక్రమాలకు వెచ్చిస్తానని చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే.. 1999లో ప్రారంభమైన దుబాయ్ డ్యూటీ ఫ్రీ రాఫెల్‌లో ఇప్పటివరకూ 1 మిలియన్ డాలర్లు గెలుచుకున్న భారతీయుల్లో కర్ణయ్య 217వ వ్యక్తి. కాగా, ఈ డ్యూటీ ఫ్రీ రాఫెల్ టికెట్ల కొనుగోలుదారుల్లో ఎక్కువ మంది భారతీయులేనని లాటరీ నిర్వాహకులు తెలియజేశారు.