Indian Origin: బ్రిటన్‌లో ముగ్గురు భారతీయుల నిర్వాకం.. 15 ఏళ్ల జైలు..!
ABN , First Publish Date - 2023-05-11T09:53:32+05:30 IST
గంజాయి అక్రమ రవాణా (Cannabis Smuggling ) కేసులో భారత సంతతికి (Indian Origin) చెందిన ముగ్గురు వ్యక్తులకు యూకే (UK) కోర్టు జైలు శిక్ష విధించింది.
లండన్: గంజాయి అక్రమ రవాణా (Cannabis Smuggling ) కేసులో భారత సంతతికి (Indian Origin) చెందిన ముగ్గురు వ్యక్తులకు యూకే (UK) కోర్టు జైలు శిక్ష విధించింది. నిందితులను కురాన్ గిల్ (Kuran Gill), జగ్ సింగ్ (Jag Singh), గోవింద్ బహియాలుగా (Govind Bahia) గుర్తించారు. 2021లో హీత్రూ విమానాశ్రంలో కంప్యూటర్ కేసింగ్ షిప్‌మెంట్‌లో బోర్డర్ ఫోర్స్ అధికారులు గంజాయిని కనుగొన్నారు. అలా పట్టుబడిన ఆ డ్రగ్స్ విలువ దాదాపు 1 మిలియన్ పౌండ్స్ (రూ. 10.34కోట్లు) అని అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్‌ను కెనడా నుంచి తీసుకువచ్చినట్లుగా గుర్తించారు. అంతేగాక వాటిని డార్ట్‌ఫోర్డ్‌లోని ఓ వ్యాపార సంస్థ చిరునామాకు డెలివరీ చేస్తున్నట్లుగా తేల్చారు.
కెంట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో అంతర్జాతీయ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు ఎన్‌క్రిప్టెడ్ మొబైల్ ఫోన్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా గంజాయిని దిగుమతి చేస్తున్న క్రిమినల్ నెట్‌వర్క్ గుట్టును రట్టు చేసింది. డిటెక్టివ్‌ల సహాయంతో ఈ గ్యాంగ్‌ను పట్టుకోగలిగామని చెప్పిన కెంట్ పోలీసులు.. ఎన్‌క్రోచాట్ మొబైల్ ఫోన్ ఫ్లాట్‌ఫామ్‌ను విశ్లేషించడం వల్ల ఎంతోమంది నేరస్థులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చట్టం ముందు నిలబెట్టామని తెలిపారు. గ్రేవ్‌సెండ్‌లోని సన్ మార్ష్ వేకు చెందిన కురాన్ గిల్‌పై గంజాయిని దిగుమతి చేసుకోవడం, పంపిణీ చేయడం వంటి అభియోగాలను నమోదు చేశారు. ఏప్రిల్ 2021లో అతనిని అరెస్ట్ చేసిన తర్వాత నిందితుడి ఇంటి నుంచి రూ.1కోటి వరకు నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. క్లాస్ బి డ్రగ్‌ని దిగుమతి చేసుకోవడం, కొకైన్ సరఫరా చేయడానికి కుట్ర వంటి నేరాలను అంగీకరించినందున గిల్‌కు న్యాయస్థానం 7ఏళ్ల జైలు శిక్ష విధించింది.
Eid Al Adha: వరుసగా ఆరు రోజులు సెలవులు.. లాంగ్ వీకెండ్‌ను భారీగా ప్లాన్ చేసుకుంటున్న ఉద్యోగులు
ఇక నైరుతి లండన్‌లోని బౌలేవార్డ్‌లో ఉండే జగ్ సింగ్ కూడా గంజాయిని దిగుమతి చేసుకోవడం, పంపిణీ చేయడం చేశాడు. రియల్ క్రోకోడైల్ చాట్ ద్వారా అతడు గిల్‌కు సందేశాలు పంపించాడు. ఆ సందేశాల్లో దేశంలోకి డ్రగ్స్ వెళ్లే మార్గాలు, వాటిని దాచే ప్రదేశాలు, ధర తదితర విషయాలను వారిద్దరూ చర్చించుకున్నట్లు కెంట్ పోలీసులు తెలిపారు. ఈ నేరాలకు గాను జగ్ సింగ్‌కు 4ఏళ్ల 9నెలల జైలు శిక్ష పడింది. అలాగే గ్రేవ్‌సెండ్‌లోని టెన్నిసన్ వాక్‌కు చెందిన గోవింద్ బహియా గంజాయి రకం, పరిమాణంపై గిల్‌కు సలహాలు ఇచ్చేవాడు. ఈ నేరాలకు గాను గోవింద్‌కు కోర్టు 3ఏళ్ల జైలు శిక్ష విధించింది.