Saudi Arabia: ప్రవాసులు బీకేర్‌ఫుల్.. సౌదీలో డ్రైవింగ్ చేసేటప్పుడు యాక్సిడెంట్ చేశారో.. అంతే సంగతులు!
ABN , First Publish Date - 2023-11-18T09:21:30+05:30 IST
రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా సౌదీ అరేబియా (Saudi Arabia) కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఈ మేరకు సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (Public Prosecution) ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా సంభవించే రోడ్డు ప్రమాదాలపై తాజాగా కీలక ప్రకటన చేసింది.
రియాద్: రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా సౌదీ అరేబియా (Saudi Arabia) కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఈ మేరకు సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ (Public Prosecution) ట్రాఫిక్ ఉల్లంఘనల కారణంగా సంభవించే రోడ్డు ప్రమాదాలపై తాజాగా కీలక ప్రకటన చేసింది. రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వాహనదారులకు ఇకపై భారీ పెనాల్టీతో పాటు జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎవరైనా చనిపోతే.. ఆ రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనదారుడికి నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.44.41లక్షల జరిమానా ఉంటుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ స్పష్టం చేసింది. అతివేగం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం, ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ ఇలా పలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు వేర్వేరు పెనాల్టీలు, జైలు శిక్షలు ఉంటాయని వివరించింది.
Mahzooz raffle draw: అదృష్టం అంటే మనోడిదే.. రాత్రికి రాత్రే ఖాతాలోకి రూ.45కోట్లు!
ఇదిలాఉంటే.. అధికారిక గణాంకాల ప్రకారం సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాదాలు 2022లో 6.8 శాతం తగ్గాయి. 2021లో సౌదీ వ్యాప్తంగా 18వేల ప్రమాదాలు నమోదు కాగా, 2022లో ఈ సంఖ్య 17వేలకు తగ్గింది. అటు ప్రమాదాల వల్ల మరణాలు 2.1 శాతం తగ్గిందని ట్రాఫిక్ భద్రత మంత్రివర్గ కమిటీ తెలిపింది. అలాగే ప్రమాదాలలో గాయపడే వారి సంఖ్య కూడా 2.7 శాతానికి తగ్గింది. 2022లో దేశవ్యాప్తంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) గాయపడిన వారు 24వేలు ఉంటే.. 2021లో ఈ సంఖ్య 25వేలుగా ఉంది. గతేడాది తీసుకుచ్చిన కఠిన నిబంధనల కారణంగానే ఇది సాధ్యమైందని ఈ సందర్భంగా సౌదీ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నట్లు చెప్పుకొచ్చింది. నివాసితులు, ప్రవాసులు డ్రైవింగ్ చేసే సమయంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను పాటించాలని కోరింది. లేనిపక్షంలో భారీ జరిమానాలతో పాటు జైలు జీవితం గడపాల్సి ఉంటుందని హెచ్చరించింది.