Donald Trump: రచయిత్రిని ట్రంప్‌ లైంగికంగా వేధించారు.. ఆమెకు రూ.40 కోట్ల పరిహారం చెల్లించాల్సిందే..!

ABN , First Publish Date - 2023-05-11T07:21:31+05:30 IST

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై రచయిత్రి జీన్‌ కారోల్‌ (79) చేసిన రేప్‌, పరువు నష్టం ఆరోపణలపై విచారణలో మాన్‌హటన్‌ న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పును వెలువరించింది.

Donald Trump: రచయిత్రిని ట్రంప్‌ లైంగికంగా వేధించారు.. ఆమెకు రూ.40 కోట్ల పరిహారం చెల్లించాల్సిందే..!

జీన్‌ కారోల్‌ను ట్రంప్‌ వేధించారు

ఆమె పరువు తీసేందుకు యత్నించారు

అమెరికా మాజీ అధ్యక్షుడిపై కారోల్‌

వేసిన కేసులో మాన్‌హటన్‌ కోర్టు తీర్పు

న్యూయార్క్‌, మే 10: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై రచయిత్రి జీన్‌ కారోల్‌ (79) చేసిన రేప్‌, పరువు నష్టం ఆరోపణలపై విచారణలో మాన్‌హటన్‌ న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ట్రంప్‌ ఆమెను లైంగికంగా వేధించడమే కాక ఆమె పరువును తీసేందుకు యత్నించారని కోర్టు స్పష్టం చేసింది. రూ. 40 కోట్ల మేర పరిహారాన్ని ఆమెకు చెల్లించాలని తేల్చిచెప్పింది. 9మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం కేవలం 3గంటల విచారణలోనే తీర్పును వెలువరించింది. ఈ తీర్పుపై జీన్‌ కారోల్‌ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు కోర్టు తీర్పును ట్రంప్‌ తప్పుపట్టారు. దీనిపై తిరిగి అప్పీలు చేస్తానన్నారు.

Updated Date - 2023-05-11T07:21:31+05:30 IST