Donald Trump: అగ్రరాజ్యం రాజకీయ చరిత్రలో పెను సంచలనం.. ట్రంప్ అరెస్ట్.. అసలు హష్‌మనీ అంటే ఏంటి?

ABN , First Publish Date - 2023-04-05T09:55:12+05:30 IST

అమెరికా రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని పెను సంచలనం నమోదైంది.

Donald Trump: అగ్రరాజ్యం రాజకీయ చరిత్రలో పెను సంచలనం.. ట్రంప్ అరెస్ట్..  అసలు హష్‌మనీ అంటే ఏంటి?

Donald Trump Arrest: అమెరికా రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని పెను సంచలనం నమోదైంది. హష్‌మనీ (hush money) కేసులో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కావడం. అయితే, కోర్టులో విచారణ అనంతరం ఆయన విడుదల అయ్యారు. 2016 నాటి హష్‌మనీ కేసులో ఆయనపై మన్‌హటన్‌ కోర్టులో 30 అభియోగాలు నమోదవ్వగా.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన కోర్టులో లొంగిపోయారు. ఆయన కోర్టు హాలుకు చేరుకోగానే పోలీసులు ట్రంప్‌ను తమ కస్టడీలోకి తీసుకుని, న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. పోర్న్‌ స్టార్‌ స్ట్రామీ డేనియల్స్‌కు అక్రమ చెల్లింపుల కేసులో ట్రంప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. 2016 అధ్యక్ష ఎన్నికలకు ముందు డేనియల్స్‌కు జరిపిన సీక్రెట్ డబ్బు చెల్లింపుల కేసులో ట్రంప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా అమెరికా చరిత్రలోనే ఇలా క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు.

అసలేం జరిగిందంటే..

2006లో డొనాల్డ్ ట్రంప్.. తాను ఓ ఈవెంట్‌లో కలుసుకున్నామని.. ఆ తర్వాత హోటల్‌లో శృంగారంలో పాల్గొన్నామని పోర్న్ స్టార్ డేనియల్స్ ఆరోపించింది. ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచేందుకు ట్రంప్‌ వ్యక్తిగత అడ్వొకేట్‌ మైకేల్ కోహెన్ 2016 అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు డేనియల్స్‌కు డబ్బు ముట్టజెప్పారన్నది ట్రంప్‌పై ప్రధాన ఆరోపణ. ఆ తర్వాత ఇది నిజమేనని ఒప్పుకుంటూ కోహెన్.. ట్రంప్‌ పరువును బజారుకీడ్చాడు. డేనియల్స్‌కు 1.30 లక్షల అమెరికా డాలర్లు ముట్టజెప్పినట్లు అంగీకరించాడు. దీంతో ఈ కేసులో ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని గ్రాండ్ జ్యూరీ నిర్ణయించింది. ఇక ఈ కేసును విచారించిన న్యూయార్క్‌ కోర్టు గత మంగళవారం ట్రంప్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో మన్‌హటన్‌ కోర్టులో 30 అభియోగాలు నమోదవ్వగా.. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆయన కోర్టులో లొంగిపోయారు. మరోవైపు ఈ కేసులో తానే తప్పు చేయలేదని ట్రంప్‌ వాదిస్తున్నారు. అంతేగాక వచ్చే ఎన్నికల్లో తనను పోటీ చేకుండా నిలువరించేందుకు జరుగుతున్న కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు. అలాగే డబ్బు గుంజేందుకు పోర్న్‌ స్టార్‌ ఆడుతున్న నాటకంగా దీన్ని ట్రంప్‌ తరపు న్యాయవాదులు చెబుతున్నారు.

Kuwait: ప్రవాసుల వీసా రెన్యువల్.. గతేడాది కువైత్‌కు ఎంత ఆదాయం వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు..!


అసలు హష్‌మనీ అంటే ఏంటి?

ఎవరైనా తమ వ్యక్తిగత సమాచారాన్ని రహస్యంగా ఉంచడానికి చేసే చెల్లింపులు. ఏదైనా చేయకూడని పనిచేసి దొరికిపోయినప్పుడు మూడో వ్యక్తికి ఆ సమాచారాన్ని చెప్పకుండా సీక్రెట్‌గా ఉంచేందుకు చేసే చెల్లింపు అన్నమాట. ఇప్పుడు ట్రంప్ విషయంలో ఇదే జరిగింది. పోర్న్‌ స్టార్‌ స్ట్రామీ డేనియల్స్‌‌తో తాను నెరిపిన వ్యవహారాన్ని బయట పెట్టకుండా ఆమెకు తన అడ్వొకేట్‌ మైకేల్ కోహెన్ ద్వారా రహస్యంగా భారీ మొత్తం అప్పగించారు. చివరకు కోహెన్ ఇది నిజమని ఒప్పుకోవడంతో ఇప్పుడు ట్రంప్ అరెస్ట్ అయ్యే వరకు వెళ్లారు.

Updated Date - 2023-04-05T09:55:12+05:30 IST