Karnataka CM : డీకేపై సిద్ధా ఎలా నెగ్గారు.. ట్రబుల్‌షూటర్‌ను కాదని మరీ సీఎం సీటును కాంగ్రెస్ ఎందుకిచ్చిందంటే..!
ABN , First Publish Date - 2023-05-17T15:09:32+05:30 IST
అవును.. ముందుగా ఊహించినట్లే సిద్ధా రామయ్యకే (Sidda Ramaiah) సీఎం సీటు దక్కింది.. చివరి నిమిషంలో అయినా కాస్త అటు ఇటు అయ్యి పీఠం వరించకపోతుందా..?
అవును.. ముందుగా ఊహించినట్లే సిద్ధా రామయ్యకే (Sidda Ramaiah) సీఎం సీటు దక్కింది.. చివరి నిమిషంలో అయినా కాస్త అటు ఇటు అయ్యి పీఠం వరించకపోతుందా..? అని కోటి ఆశలతో ఎదురుచూసిన డీకే శివకుమార్ (DK Shiva Kumar) ఆశలన్నీ అడియాశలే అయ్యాయి. రెండ్రోజుల పాటు అటు ఢిల్లీలో (Delhi) ఇటు కన్నడనాట జరిగిన నాటకీయ పరిణామాలకు ఫుల్ స్టాప్ పడిపోయింది. సుదీర్ఘ మంతనాల తర్వాత సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. ఇక మిగిలింది అధికారిక ప్రకటన ఒక్కటే.. అన్నీ అనుకున్నట్లు జరిగితే సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం (Congress High Command) ప్రకటించే అవకాశముంది. అయితే అసలు సిద్ధాకే కాంగ్రెస్ పెద్దలు ఎందుకు ఓటేశారు..? ఈ మొత్తం వ్యవహారంలో సిద్ధా ఎలా నెగ్గారు..? సిద్ధాకు కలిసొచ్చిందేంటి..? అహర్నిశలు కష్టపడిన డీకేకు అధిష్టానం ఎందుకు హ్యాండిచ్చింది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కథనం..
సిద్ధాకు ఉన్న ప్లస్‌లు ఏంటి..!?
1. బలమైన ఓబీసీ నాయకుడు
2. మెజార్టీ ఎమ్మెల్యేల బలం
3. అవినీతిరహితుడిగా పేరు
4. మాస్ లీడర్‌గా మంచి గుర్తింపు
5. సీఎంగా సక్సెస్‌ఫుల్ గ్రాఫ్
6. వయసు రీత్యా పెద్దమనిషి, అన్నింటిలో ఆరితేరిన వ్యక్తి
7. సిద్ధూ ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ చర్చకు వస్తున్న పరిస్థితి
8. సిద్ధూ బలాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో వినియోగించుకోవాలని అధిష్టానం ప్లాన్
డీకేకు ఉన్న ప్లస్, మైనస్‌లు ఇవే..!
1. డీకేది అగ్రకులం అని అందుకే సీఎం సీటు దక్కలేదని కన్నడనాట టాక్
2. ఎమ్మెల్యేల మెజార్టీ తక్కువే.. 30 మందికి మించి లేని పరిస్థితి
3. డీకేపై బోలెడన్ని కేసులు, మనీలాండరింగ్ కేసుల్లో ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని రూమర్స్
4. ఇప్పుడు సీఎంను చేసినా మళ్లీ పరిస్థితులు మొదటికొస్తాయని భావించిన కాంగ్రెస్!
5. సిద్ధూతో పోలిస్తే మాస్ ఫాలోయింగ్ తక్కువ
6. కేవలం కేపీసీసీ చీఫ్‌గా మాత్రమే సక్సెస్
7. సిద్ధూతో పోలిస్తే వయస్సు, అనుభవమూ తక్కువే
8. పార్టీ వీర విధేయుడిగా పేరు
మొత్తానికి చూస్తే.. సీనియార్టీకే కాంగ్రెస్ అధిష్టానం ఓటేసిందని సిద్ధూ ఎంపికను బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా.. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు, ప్రజాస్వామ్య విధానాలకు అనుగుణంగా సీఎం ఎంపిక ఉండాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భావించడమే సిద్ధూకు కలిసొచ్చిన అంశంగా రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే రాజస్థాన్‌లో కూడా ఎన్నికల ముందు, ఆ తర్వాత సచిన్ ఫైలట్, గెహ్లాట్‌లు సీఎం సీటు కోసం పోటీపడ్డారు. చివరికి అనుభవం, సీనియార్టీకే ప్రాధాన్యత ఇస్తూ గెహ్లాట్‌కే అధిష్టానం ఓటేయడం.. ఇప్పుడు అదే పరిస్థితి కన్నడనాట కూడా రావడంతో అదే ఫార్ములానే ఇక్కడ ప్రయోగించి కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది. అయితే.. ఇంత జరిగిన తర్వాత డీకే శివకుమార్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు..? అధిష్టానం ఇచ్చినట్లుగా డిప్యూటీ సీఎం, రెండు కీలక శాఖలను తీసుకుని సైలెంట్‌గా ఉండిపోతారా..? అనేది తెలియాల్సి ఉంది.
బిగ్ ట్విస్ట్..
కర్ణాటకలో హైడ్రామాకు తెరపడిందన్న తరుణంలో కాంగ్రెస్ మరో బిగ్ ట్వి్స్ట్ ఇచ్చింది. సీఎం ఎవరనేది ఇంకా తేలలేదని.. అధికారికంగా అధ్యక్షుడు ప్రకటిస్తారని కర్ణాటక కాంగ్రెస్ ఇంచార్జ్ రణ్‌దీప్ సూర్జేవాలా ప్రకటించడంతో ఈ సస్పెన్స్‌కు ఇప్పట్లో తెరపడే పరిస్థితులు కనిపించట్లేదు. రానున్న 48 నుంచి 72 గంటల్లో కన్నడనాట కొత్త కేబినెట్ కొలువుదీరుతుందని ఆయన ప్రకటించారు. మరోవైపు కంఠీరవ స్టేడియంలో మాత్రం ప్రమాణ స్వీకార ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.