TS Assembly Polls : అంచనాలు అట్టర్‌ప్లాప్.. కాంగ్రెస్‌పైనే కోటీ ఆశలు పెట్టుకున్న బీజేపీ..!
ABN , First Publish Date - 2023-09-08T21:22:37+05:30 IST
అవును.. మీరు వింటున్నది నిజమే.. బీజేపీ (Telangana BJP) అంచనాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి..! ఇప్పుడు పరిస్థితున్నీ మారిపోయాయి..! దీంతో చేసేదేమీ లేక కాంగ్రెస్(Congress) పైనే కమలం కోటి ఆశలు పెట్టుకుంది.!..
అవును.. మీరు వింటున్నది నిజమే.. బీజేపీ (Telangana BJP) అంచనాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి..! ఇప్పుడు పరిస్థితున్నీ మారిపోయాయి..! దీంతో చేసేదేమీ లేక కాంగ్రెస్(Congress) పైనే కమలం కోటి ఆశలు పెట్టుకుంది.! ఇటు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) .. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) వ్యూహాలతో కమలనాథులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏదో కాస్తో కూస్తో ఉందనుకున్న పార్టీ మొత్తం ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఇంతకీ కాంగ్రెస్‌పై బీజేపీ పెట్టుకున్న ఆశలేంటి..? తెలంగాణ రాజకీయాల్లో అసలేం జరుగుతోందనే ఇంట్రెస్టింగ్ విషయాలపై ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనం..
ఎందుకీ పరిస్థితి..?
బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ (Bandi Sanjay) ఉన్నప్పుడు కమలం ఏ రేంజ్‌లో వికసించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎక్కడో అట్టడుగున ఉన్న పార్టీని బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌కు తీసుకొచ్చారు సంజయ్. ఈయన ఆధ్వర్యంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు, ఉప ఎన్నికల్లో బీజేపీ పరుగులు పెట్టింది. అయితే.. ఏ క్షణాన కర్ణాటకలో కాంగ్రెస్ (Karnataka Congress) ఘన విజయం సాధించిందో ఆనాడే బీజేపీ అట్లర్ ప్లాప్ అయిపోయింది.! నూటికి వెయ్యి శాతం గెలుస్తామన్న ధీమా నుంచి అసలు అడ్రస్సే లేని పరిస్థితికి వచ్చి పడింది బీజేపీ. దీంతో క్యాడర్ ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఆ దెబ్బ నుంచి కోలుకోక మునుపే అధ్యక్షుడిగా బండిని పక్కనెట్టి కిషన్ రెడ్డిని నియమించారో అప్పుడిక బీజేపీ పరిస్థితి మరింత దిగజారిందనేది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అప్పట్నుంచే బీజేపీ పతనం ప్రారంభం అయ్యింది. అప్పటి వరకూ బీజేపీలో చేరాలని బీఆర్ఎస్ ముఖ్యనేతలు (BRS Key Leaders) ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకోవడం తీరా చూస్తే కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. కమలం గూటికి చేరాల్సిన నేతలంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ గెలుపుతో కాంగ్రెస్‌లో మునుపెన్నడూలేని నూతనోత్సాహం వచ్చింది. ఇక బీజేపీ నుంచి ముఖ్య నాయకులు సైతం ఒక్కొక్కరుగా కమలం పార్టీకి గుడ్ బై చెప్పేస్తుండటంతో పరిస్థితి దారుణం అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పటి వరకూ కమలనాథులు ఏదోదే ఊహించుకున్నారు.. అంతకుమించి కలలు కన్నారు.. కానీ సీన్ కట్ కట్ చేస్తే అంచనాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి.
ఇదీ అసలు కథ..
బీజేపీలో ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి తన సీనియార్టీని ప్రయోగిస్తున్నారు కిషన్ రెడ్డి. అందుకే ఎన్నికల సమయానికి పార్టీకి పునర్‌వైభవం తీసుకురావాలని చేరికలపైనే స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలియవచ్చింది. ఎలాగంటే..119 నియోజకవర్గాల్లో ఒకసారి 115 మంది అభ్యర్థులను గులాబీ బాస్ ప్రకటించేశారు. ఇక మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో టికెట్ల కోసం రచ్చ జరుగుతుండటంతో ఈనెలలో ఎప్పుడైనా ప్రకటించే అవకాశముంది. ఇందుకు మంత్రి కేటీఆర్ కసరత్తులు కూడా చేస్తున్నారు. ఇప్పటికే టికెట్లు రాని వారు, ఆశించి భంగపడిన ఆశావాహులు, సిట్టింగులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. మరికొందరు ఈనెల 17న సోనియా గాంధీ (Sonia Gandhi) సమక్షంలో కండువాలు కప్పుకోబోతున్నారు. ఇందులో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఉండటం గమనార్హం. సో.. ఇప్పట్లో బీఆర్ఎస్ నుంచి ఎవరెళ్లినా కాంగ్రెస్ వైపే అడుగులేస్తారనే కానీ బీజేపీలో చేరే పరిస్థితి అయితే లేదు. అంతేకాదు.. బీజేపీలోని కొందరు సీనియర్లు, కీలక నేతలు సైతం హస్తం గూటికెళ్తున్నారు. దీంతో కాంగ్రెస్ దాదాపు హౌస్‌ఫుల్ అయిపోయింది. చేరికలు రోజురోజుకూ ఎక్కువవుతుండటం, ఇంకా చేరాల్సిన జాబితా చాలానే ఉండటంతో.. అభ్యర్థులను ప్రకటించడానికి ఆలస్యం అవుతోంది. మార్పులు, చేర్పులు చేశాక ఒకేసారి 119 మంది అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ పెద్దలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. సీటు ఆశించి రాని కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీ నుంచి వచ్చిన వలస నేతలు.. పెద్ద ఎత్తున బీజేపీలో చేరతారని కోటి ఆశలు పెట్టుకున్నారు కమలనాథులు. వాస్తవానికి బీజేపీకి 119కి 119 స్థానాల్లో పోటీచేసేందుకు బలమైన నేతలు లేరన్న విషయం జగమెరిగిన సత్యమే.
మొత్తానికి చూస్తే.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరే పరిస్థితులు అస్సలే లేకపోవడంతో ఇక మిగిలిందల్లా కాంగ్రెస్ ఒక్కటే. కాంగ్రెస్ అభ్యర్థులను ఎప్పుడెప్పుడు ప్రకటిస్తుందా అని వేయి కళ్లతో కమలనాథులు ఎదురు చూస్తున్నారన్నమాట. జాబితా ప్రకటిస్తే కచ్చితంగా టికెట్ రాని నేతలు గొడవ పడతారని.. ఆ సీన్ ఎప్పుడు జరుగుతుందా అని బీజేపీ ఎదురుచూస్తోందట. చూశారుగా బీజేపీ పరిస్థితి ఎక్కడ్నుంచి ఎక్కడికొచ్చి పడిందో.. మరి కమలనాథుల కోటి ఆశలు ఏ మాత్రం ఫలిస్తాయో కాంగ్రెస్ జాబితా వచ్చే వరకు వేచి చూడాల్సిందే మరి. అయితే కాంగ్రెస్‌లో టికెట్లు రాని వారు బీఆర్ఎస్‌లో చేరడానికే ప్రయత్నిస్తారు కానీ.. బీజేపీలో చేరాల్సిన అవసరం వాళ్లకేంటి..? అనేది కూడా పెద్ద ప్రశ్నార్థకమే. ఏం జరుగుతుందో చూడాలి మరి.