Share News

CBN Case : కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై సీఐడీ కౌంటర్‌.. ఏం చెప్పిందో చూడండి!

ABN , First Publish Date - 2023-10-26T16:25:23+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Case) సీఐడీ అరెస్ట్ (CID Arrest) చేసిన సంగతి తెలిసిందే. 48 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Jail) బాబు ఉంటున్నారు. అయితే..

CBN Case : కాల్ డేటా రికార్డు పిటిషన్‌పై సీఐడీ కౌంటర్‌.. ఏం చెప్పిందో చూడండి!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును (Chandrababu) స్కిల్ అక్రమ కేసులో (Skill Case) సీఐడీ అరెస్ట్ (CID Arrest) చేసిన సంగతి తెలిసిందే. 48 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో (Rajahmundry Jail) బాబు ఉంటున్నారు. అయితే.. బాబు అరెస్టుపై (CBN Arrest) నాటి నుంచి నేటి వరకూ అన్నీ అనుమానాలే. మిలియన్ డాలర్ల ప్రశ్నలకూ ఇంతవరకూ సమాధానం దొరకలేదు. దీంతో అరెస్ట్ సమయంలో సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌లు (CID Officers Call Data) కావాలని.. అప్పుడే అసలు విషయాలు తెలుస్తాయని చంద్రబాబు తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ లాయర్లను ఏసీబీ కోర్టు (ACB Court) న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో గురువారం నాడు సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు.


CBN-Arrest.jpg

కౌంటర్ ఇదీ..!

అధికారుల కాల్ డేటా ఇస్తే వారి స్వేచ్ఛకు భంగం కలుగుతుందని సీఐడీ తరఫు న్యాయవాదులు కౌంటర్‌లో వివరించారు. అంతేకాదు.. అధికారుల భద్రతకు నష్టం ఉంటుందని కూడా సీఐడీ పేర్కొంది. గురువారం నాడు సుమారు రెండు గంటల పాటు విచారణ జరగ్గా అనంతరం శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఏసీబీ కోర్టు తెలిపింది. అటు పిటిషన్.. ఇటు కౌంటర్‌పై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుంది..? చంద్రబాబు తరఫు లాయర్ల వాదనలతో ఏకీభవిస్తుందా..? లేకుంటే అధికారుల స్వేచ్ఛ, భద్రత గురించి మాట్లాడుతున్న సీఐడీ తరఫు లాయర్ల వాదనలను అంగీకరిస్తుందా..? అనేది శుక్రవారం తేలిపోనుంది. కోర్టు తీర్పుపై టీడీపీ శ్రేణులు, సీఐడీ వర్గాల్లో సర్వత్రా టెన్షన్ నెలకొన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.

ACB.jpg

ఇప్పటి వరకూ ఏం జరిగింది..?

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కేసులో సెప్టెంబర్-08న అర్ధరాత్రి దాటాక చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో ఉన్న సీఐడీ అధికారుల సీడీఆర్‌(కాల్‌ డేటా రికార్డ్‌) కోరుతూ దాఖలైన పిటిషన్‌పై దాఖలు చేసింది. దీనిపై ఇప్పటికే విచారణ జరిపిన ఏసీబీ కోర్టు 26వ తేదీకి వాయిదా వేసింది. బాబును అరెస్టు చేసినప్పుడు 200 మంది వరకు సీఐడీ అధికారులు ఉన్నారని, వారి కాల్‌డేటాను కోర్టు అధీనంలో సంరక్షణలో ఉంచాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌(పీపీ)ను న్యాయాధికారి హిమబిందు ఆదేశించారు. కౌంటర్‌ దాఖలుకు పీపీ ఈనెల 26 వరకు గడువు కోరడంతో అదే తేదీకి విచారణను వాయిదా వేశారు. ఇవాళ విచారణ జరగ్గా.. సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కౌంటర్‌ను పరిశీలించడానికిగాను తదుపరి విచారణను శుుక్రవారం నాటికి వాయిదా పడింది.

ACB-Court-Judge.jpg

CBN Health : చంద్రబాబు ఆరోగ్యంపై షాకింగ్ రిపోర్ట్.. ఇన్నాళ్లూ ఎందుకీ గోప్యత..!?


Updated Date - 2023-10-26T16:32:51+05:30 IST