YS Jagan : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో సీఎం జగన్ సడన్‌గా.. ఏపీ రాజకీయాల్లో ఓ రేంజ్‌లో చర్చ
ABN , First Publish Date - 2023-04-16T12:33:45+05:30 IST
వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి హత్యకేసులో (YS Vivekananda Reddy) ప్రధాన సూత్రదారిగా వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy) గత కొన్నిరోజులుగా అనుమానాలు వ్యక్తం చేసిన సీబీఐ..
వైఎస్ వివేకానందరెడ్డి రెడ్డి హత్యకేసులో (YS Vivekananda Reddy) ప్రధాన సూత్రదారిగా వైఎస్ భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy) గత కొన్నిరోజులుగా అనుమానాలు వ్యక్తం చేసిన సీబీఐ.. ఆదివారం నాడు అరెస్ట్ చేసింది. ఇవాళ తెల్లవారుజామునే పులివెందులకు వెళ్లిన సీబీఐ (CBI) అధికారులు మొదట భాస్కర్ రెడ్డి ఇంట్లో సోదాలు.. ఇంట్లోనే అరెస్ట్ మెమో రెడీ చేయడం.. నిమిషాల వ్యవధిలోనే అరెస్ట్ చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో ఒక్కసారిగా వైసీపీలో ఉలిక్కిపడింది. భాస్కర్ రెడ్డి.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) తండ్రి, వైఎస్ భారతి (Y S Bharati) మేనమామ కావడంతో ఇది పెను సంచలనమే అయ్యింది. అరెస్ట్ తర్వాత అటు పులివెందులలో.. ఇటు వైసీపీలో పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. అంతేకాదు.. ఈ అరెస్ట్ ఎఫెక్ట్‌తో ఆఖరికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తన పర్యటనలను కూడా రద్దు చేసుకున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి,
అటు అరెస్ట్.. ఇటు రద్దు..!
సోమవారం నాడు సీఎం జగన్ అనంతపురం (Ananthapuram) జిల్లాలో పర్యటించాల్సి ఉంది. జిల్లాలోని నార్పలలో ‘జగనన్న వసతి దీవెన’ (Jagananna Vasathi Deevena) కార్యక్రమంలో జగన్ పాల్గొనాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వలన సీఎం టూర్ (CM Jagan Tour) రద్దయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26కు వాయిదా వేస్తున్నట్లు సీఎంవో (AP CMO) తెలిపింది. జగన్ పర్యటన కోసం అనంతపురం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అటు ట్రాఫిక్ అధికారులు.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించారు. అంతేకాదు.. జగన్ రాకతో అనంతపై వరాల జల్లు కురిపిస్తారని జిల్లా ప్రజలు, వైసీపీ కార్యకర్తలు ఎన్నెన్నో అనుకున్నారు.. అయితే సడన్‌గా టూర్ రద్దు కావడంతో జిల్లా ప్రజానికం నిరాశకు లోనైంది. భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఎఫెక్ట్‌తోనే సీఎం ఇలా సడన్‌గా అనంత టూర్‌ను రద్దు చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
హస్తిన పర్యటనలతో..!
గత నెలలో వైఎస్ జగన్‌లో వరుసగా ఢిల్లీ పర్యటనకు (CMJagan Delhi Tour) వెళ్లిన సంగతి తెలిసిందే. ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేస్తుందన్న ప్రచారంతో అసెంబ్లీ నడుస్తున్నా అకస్మాత్తుగా జగన్ ఢిల్లీ వెళ్లొచ్చారు. జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత సీబీఐ విచారణ వేగం మందగించిందనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఆ తర్వాతే సుప్రీంకోర్టు సీబీఐ అధికారిని మార్చడం, దర్యాప్తునకు డెడ్‌లైన్ విధించడంతో సీబీఐ దూకుడు పెంచింది. మరోవైపు.. భాస్కర్ రెడ్డి తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. దీంతో మరోసారి తప్పకుండా జగన్ హస్తిన టూర్‌కు వెళ్తారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి.
మొత్తానికి చూస్తే.. భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో వైసీపీలో టెన్షన్ మొదలైందని ఈ వ్యవహారంపై ఎలా ముందుకెళ్లాలని సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది ఒక రకంగా వైసీపీకి చేదు అంశమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా సొంత ఇంటి వారినే సీబీఐ అదుపులోకి తీసుకోవడం జగన్‌ను ఇరకాటంలో పడేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇన్ని రోజులు తమ ఇంటి వారు కాదని వారించిన జగన్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారా..? అని ఏపీ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంతవరకూ వైసీపీ నుంచి గానీ.. కనీసం అవినాష్ రెడ్డి నుంచి కానీ ఎలా స్పందన రాలేదు.