MLC Election Results : శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేశారని ఎలా నిర్ధారించారో వివరంగా చెప్పిన ఏపీ హోం మంత్రి..

ABN , First Publish Date - 2023-03-26T22:36:41+05:30 IST

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని షాక్ తగిలిన విషయం విదితమే. అసలు అభ్యర్థే నిలబడరన్న స్థాయి నుంచి..

MLC Election Results : శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేశారని ఎలా నిర్ధారించారో వివరంగా  చెప్పిన ఏపీ హోం మంత్రి..

ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీకి (YSR Congress) ఊహించని షాక్ తగిలిన విషయం విదితమే. అసలు అభ్యర్థే నిలబడరన్న స్థాయి నుంచి.. పంచుమర్తి అనురాధను (Panchumarthi Anuradha) అభ్యర్థిగా బరిలోకి దింపి, పక్కా వ్యూహాలు రచించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు (TDP Chief Chandrababu) గెలిపించుకున్నారు. బహుశా ఇలా జరుగుతుందని కానీ.. అధికారంలో ఉండి క్రాస్ ఓట్లు పడతాయని కానీ వైసీపీ పెద్దలు ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) కలలో కూడా ఊహించి ఉండరేమో. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఎం జగన్.. క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను వెంటనే పార్టీ నుంచి సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అసలు క్రాస్ ఓటింగ్ ఎలా వేశారు..? అన్నీ వివరంగా ఎమ్మెల్యేలకు చెప్పినప్పటికీ ఎందుకిలా చేశారు..? టీడీపీ అభ్యర్థికి ఎందుకు ఓటేశారు..? అసలు ఆ నలుగురు ఎమ్మెల్యేలు వ్యూహమేంటి..? అనేది వైసీపీ పెద్దలకు అర్థం కావట్లేదు.

ఇప్పటికే తాను ఎవరికి ఓటేశాననే విషయాన్ని పూసగుచ్చినట్లుగా ఉండవల్లి శ్రీదేవి (Vundavalli Sridevi) మీడియాకు వివరించారు. ఆదివారం నాడు ప్రత్యేకించి హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. జగన్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. అంతేకాదు.. అమరావతే రాజధానిగా ఉండేందుకు తాను పోరాటం చేస్తానని కూడా చెప్పేశారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే జగన్ కేబినెట్‌లోని కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా.. తాజాగా హోం మంత్రి తానేటి వనిత (Taneti Vanitha) స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలే చేశారు.

క్రాస్ ఓటింగ్ ఎలా నిర్ధారణ ఇలా..!

క్రాస్ ఓటింగ్ నిర్థారణ కోసం ఒక కోడింగ్ పెట్టుకోవటం జరిగింది. ఇబ్బందికరంగా ఉన్న ఎమ్మెల్యేలకు కోడ్ నిర్ధారించిన తర్వాతే క్రాస్ ఓటింగ్ నిర్థారిచుకున్నాం. టికెట్ ఇచ్చిన సీఎం జగన్ గారిని మరిచిపోయి.. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం దారుణం. పూర్తి పరిశీలన తర్వాతే శ్రీదేవిని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. బయటికి వెళ్లి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం సరికాదు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను శ్రీదేవి చదివినట్లున్నారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అమరావతే రాజధాని కావాలని పోరాటం చేసిన రైతులే టెంట్‌లు ఎత్తివేశారు. అమరావతి కోసం శ్రీదేవి పోరాటం చేస్తాననటం మీడియా మిత్రులు వినటానికి, యూట్యూబ్ చానెల్స్‌‌లో ట్రోల్ చేయటానికి మాత్రమే పనికొస్తోంది అని హోం మంత్రి చెప్పుకొచ్చారు.

ఇంతకీ శ్రీదేవి ఏమన్నారు..?

నాలుగేళ్ళ పాటు నన్ను వాడుకుని పిచ్చికుక్క మాదిరి ముద్రవేసి బలి చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డితో నాకు ప్రాణహానీ ఉంది. సజ్జలపై నేషనల్ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాను. నన్ను వైసీపీ గూండాలు వేధిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో నేను లేకుండా చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. బ్రదర్‌గా అన్నీ చూసుకుంటానన్న జగన్ విలువలను తుంగలో తొక్కారు. సీక్రెట్ ఓటింగ్‌లో వాస్తవాలు తెలుసుకోకుండానే నన్ను బలిచేశారు. ప్రాణం పోయినా సరే.. రాజధాని అమరావతి కోసం‌ పోరాటం చేస్తాను. అమరావతి ప్రాంతంలో రైతుల పక్షాన స్వతంత్ర ఎమ్మెల్యేగా పోరాడుతాను. జగనన్న ఇళ్ళ పథకం అతి పెద్ద స్కాం. అమరావతి మట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నా.. ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోలేదు. దోచుకో.. పంచుకో అనేదే వైసీపీ ప్రభుత్వం సిద్ధాంతం. నా ఇంట్లో గంజాయి పెట్టి నన్ను ఇరికించాలని చూస్తున్నారు. మహిళా ఎమ్మెల్యేకు రక్షణలేని పరిస్థితులు ఏపీలో ఉన్నాయి. జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తా. NHRC హామీ ఇస్తే ఏపీలో అడుగుపెడతా. నాపై ఆరోపణలు చేసినవారికి త్వరలో రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తా. జగన్‌ కొట్టిన దెబ్బకు నా మైండ్‌ బ్లాంక్‌ అయింది. ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరాలనే ఆలోచన లేదు. ఈరోజు నేను ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేని. నియోజకవర్గ ప్రజలు వస్తే సమస్యలపై పోరాడదాంఅని శ్రీదేవి చెప్పుకొచ్చారు.

****************************

ఇవి కూడా చదవండి

******************************

YSRCP : ఉండవల్లి శ్రీదేవి ఏ పార్టీలో చేరబోతున్నారు.. తాడికొండ నుంచి బరిలోకి దింపడానికి జగన్‌ ఎవరెవర్ని పరిశీలిస్తున్నారు.. వైఎస్ సన్నిహితుడికేనా..!?

******************************

MLA Rapaka : టీడీపీ నుంచి 10 కోట్ల డీల్ వచ్చిందన్న వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాపాక యూటర్న్.. ఇంతకీ ఎవరా 10 మంది ఎమ్మెల్యేలు..!

******************************

MLC Kavitha ED Enquiry : కవిత మీడియాకు చూపించిన మొబైల్ ఫోన్లను కాస్త జూమ్ చేస్తే...!!

*****************************

YSRCP : ఓరి బాబోయ్.. సీఎం వైఎస్ జగన్ గురించి ఉండవల్లి శ్రీదేవి ఏమన్నారో చూడండి.. వీడియోలు నెట్టింట్లో వైరల్..

******************************

Kotam Reddy : వైఎస్ జగన్‌తో ఎక్కడ చెడింది.. 20 కోట్ల వ్యవహారమేంటి.. వైసీపీని వీడే ఎమ్మెల్యేల గురించి పూసగుచ్చినట్లుగా చెప్పిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..!

******************************

YSRCP : ఉండవల్లి, మేకపాటిపై వేటు వేసే పరిస్థితి ఎందుకొచ్చింది.. ఓటింగ్‌కు ముందు జగన్‌తో భేటీ.. ఆ అరగంటలో ఏం జరిగింది.. ఒక్క మాటతో..!

******************************

Updated Date - 2023-03-26T22:53:09+05:30 IST