Share News

TS Elections : ఎన్నికల ముందు మాజీ మంత్రి రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్

ABN , First Publish Date - 2023-11-06T16:20:03+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించి, పార్టీ్ల్లో అసంతృప్తిగా ఉన్న నేతలంతా వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress).. కాంగ్రెస్ నుంచి కారెక్కడం.. కమలం (BJP) కండువా తీసేసి హస్తం గూటికి చేరడం ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి...

TS Elections : ఎన్నికల ముందు మాజీ మంత్రి రాజీనామా.. బీఆర్ఎస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) ముందు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్లు ఆశించి, పార్టీ్ల్లో అసంతృప్తిగా ఉన్న నేతలంతా వేరే పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్‌లోకి (Congress).. కాంగ్రెస్ నుంచి కారెక్కడం.. కమలం (BJP) కండువా తీసేసి హస్తం గూటికి చేరడం ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి. కాంగ్రెస్‌లోకి వలసల వర్షం కురుస్తోందనుకున్న సమయంలో ఆ పార్టీకి సీనియర్లు ఒక్కొక్కరుగా వీడుతున్న పరిస్థితి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోగా.. తాజాగా సీనియర్ నేత, మాజీ మంత్రి బోడ జనార్ధన్ (Boda Janardhan) కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (TPCC Chief Revanth Reddy) ఫ్యాక్స్ చేశారు.


Boda-Janardhan.jpg

రాజీనామా ఎందుకు..?

ఇటీవల సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి (Vivek VenkataSwamy) , ఆయన కుమారుడు వంశీ (Vamsi) కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరికీ కూడా కాంగ్రెస్ దాదాపు టికెట్లు ఫిక్స్ చేసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చెన్నూరు ఎమ్మెల్యే టికెట్ వంశీకి.. పెద్దపల్లి ఎంపీ టికెట్ వివేక్‌కు ఇవ్వబోతున్నారని.. ఇక అధికారిక ప్రకటనే తరువాయి అని తెలిసింది. దీంతో చెన్నూరు (Chennur) టికెట్ ఆశించిన బోడ జనార్ధన్ తీవ్ర అసంతృప్తికి లోనై రాజీనామా చేశారు. మంగళవారం నాడు సీఎం కేసీఆర్ సమక్షంలో (CM KCR) జనార్ధన్ గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. మందమర్రి బీఆర్ఎస్ సభలో ఈ చేరిక కార్యక్రమం జరగనుంది.

cong telangana.jpeg

ఓడిస్తా..!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో సభ్యత్వం లేని మాజీ ఎంపీ వివేక్‌ను తెరపైకి తేవడం అన్యాయమన్నారు. కాంగ్రెస్‌లో కోట్ల రూపాయలకు టికెట్లు అమ్ముకుంటున్నారని.. ఒకే కుటుంబానికి ఎన్ని టికెట్లు ఇస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. వివేక్‌తో పాటు ఆయన సోదరుడు వినోద్‌ను.. ఆ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా కచ్చితంగా ఓడిస్తామని బోడ జనార్దన్ శపథం చేశారు. మరోవైపు.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, పీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నేత సంజీవ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన ఎన్ఆర్ఐ శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై ఈ నేతలంతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెబల్‌గా పోటీలో ఉండి శ్రీనివాస్ రెడ్డిని ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అన్ని పార్టీల్లో కామన్‌గా జంపింగ్‌లు, చేరికలు కనిపిస్తుంటాయ్. బీఆర్ఎస్‌లో బోడె పరిస్థితేంటి..? ఇప్పటికిప్పుడు టికెట్ ఇవ్వలేకపోయినా.. రేపొద్దున్న ఈయనకు పార్టీ ఏ మాత్రం ప్రాధాన్యత ఇస్తుందో లేదో చూడాలి మరి.

BRS-CONGRESS-3-4.jpg

Updated Date - 2023-11-06T16:35:14+05:30 IST