Rajyasabha : ఎన్నికల ముందు బీజేపీ వ్యూహాత్మక అడుగులు.. రాజ్యసభకు ‘తెలుగోడు’..!
ABN , First Publish Date - 2023-07-08T21:57:30+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పట్టు పెంచుకొని అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇందుకోసం ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశం మలుచుకుని ముందుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డాలు (JP Nadda) వరుస పర్యటనలు, బహిరంగ సభలతో బిజిబిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణలో (Telangana) , వచ్చే ఏడాది ఏపీలో (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇదే అదనుగా భావించిన బీజేపీ పెద్దలు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిని రాజ్యసభకు తీసుకోవాలని..
తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పట్టు పెంచుకొని అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఇందుకోసం ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా సరే సువర్ణావకాశం మలుచుకుని ముందుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డాలు (JP Nadda) వరుస పర్యటనలు, బహిరంగ సభలతో బిజిబిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరిలో తెలంగాణలో (Telangana) , వచ్చే ఏడాది ఏపీలో (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇదే అదనుగా భావించిన బీజేపీ పెద్దలు తెలుగు రాష్ట్రాల నుంచి ఒకరిని రాజ్యసభకు తీసుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శనివారం నాడు బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్.. 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. దీంతో పాటు మూడు రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కూడా చర్చించడం జరిగింది.
తెలుగోడి కోసం..!
ఇవాళ జరిగిన ఈ సుదీర్ఘ సమావేశంలో ‘రాజ్యసభకు తెలుగోడు’ని తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా.. గుజరాత్ నుంచి ముగ్గురు, బెంగాల్ నుంచి ఆరుగురు, గోవా నుంచి ఒకరు.. ఇలా అన్నీ కలిపి మొత్తం రాజ్యసభలో 10 స్థానాలకు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు జూలై-13 చివరి తేదీ. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం 5 సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈ రాష్ట్రాల నుంచి ఒక తెలుగు నేతకు రాజ్యసభ సీటు ఇవ్వవచ్చంటూ ఢిల్లీ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. శనివారం మధ్యాహ్నం నుంచి అటు ఢిల్లీలో.. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చే జరుగుతోంది.
ఎవరి దక్కే ఛాన్స్ ఉంది..?
తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఒక కేంద్ర మంత్రి కూడా ఉన్నారు కాబట్టి ఇప్పట్లో రాజ్యసభకు కూడా ఇక్కడ్నుంచే తీసుకునే ఛాన్స్ లేదు. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్.. ఇక్కడ్నుంచి ఒక్కరంటే ఒక్కరూ ఎమ్మెల్యే కానీ.. లోక్‌సభ ఎంపీగానీ లేరు. ఏపీ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్ ఉన్నప్పటికీ వారు టీడీపీ నుంచి బీజేపీలోకి రావడంతో పదవులు కంటిన్యూ అవుతున్నాయే తప్ప.. కమలం పార్టీ నుంచి ఎవర్నీ తీసుకోలేదు. పైగా ఈ ఇద్దరికీ త్వరలోనే పదవీకాలం ముగియనుంది. అయితే.. ఈ ఇద్దరిలో ఒకర్ని లేకుంటే కొత్త పార్టీకోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఓ పెద్ద తలకాయను రాజ్యసభకు తీసుకునే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధ్యక్ష పదవి ఆఖరి నిమిషంలో మిస్సవడంతో రాజ్యసభ సభ్యుడినయ్యే అవకాశం దక్కుతుందా..? అని సత్యకుమార్ ఎదురుచూస్తున్నారని తెలిసింది. పార్టీకోసం కష్టపడి పదవులు రానివాళ్లు, వేరే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్లు ఏపీలో చాలా మందే ఉన్నారు. అయితే రాజ్యసభకు తీసుకున్న వారిని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోవాలని ఆలోచన కూడా అగ్రనాయకత్వం చేస్తోందట. ఆ లక్కీ ఛాన్స్ ఎవరికొస్తుందో..? రాజ్యసభలో అడుగుపెట్టే సువర్ణావకాశం దక్కించుకునే ‘తెలుగోడు’ ఎవరో చూడాలి మరి.