NTR Coin : ఎన్టీఆర్ 100 నాణెం విడుదల వేడుకకు తారక్ వెళ్తున్నారా.. లేదా..!?
ABN , First Publish Date - 2023-08-27T21:56:56+05:30 IST
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు (Sr NTR) పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని (NTR Silver Coin) కేంద్రప్రభుత్వం ముద్రించిన విషయం తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ గౌరవార్థం.. శత జయంతిని పురస్కరించుకుని మోదీ సర్కార్ (Modi Govt) ఈ నాణేన్ని ముద్రించింది..
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు (Sr NTR) పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని (NTR Silver Coin) కేంద్రప్రభుత్వం ముద్రించిన విషయం తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ గౌరవార్థం.. శత జయంతిని పురస్కరించుకుని మోదీ సర్కార్ (Modi Govt) ఈ నాణేన్ని ముద్రించింది. సోమవారం నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) చేతుల మీదుగా ఈ నాణెంను విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులంతా (NTR Family) ఢిల్లీ పయనమై వెళ్లారు. సీనియర్ ఎన్టీఆర్ కుమారులు, కూతుళ్లు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనములు, మనమరాలు అందరూ వెళ్లారు. దీంతో పాటు ఎన్టీఆర్‌కు బాగా పరిచయస్తులు, ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లారు. ఆదివారం రాత్రే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) ఢిల్లీ చేరుకున్నారు. పనిలో పనిగా ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు వైసీపీ కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధమైంది. ఇవన్నీ అటుంచితే.. నాణెం విడుదల కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హాజరవుతారా..? లేదా..? అనేదానిపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు కల్యాణ్ రామ్ (Kalyan Ram) విషయంలో కూడా ఇదే పరిస్థితి.
బ్రదర్స్ వెళ్తారా..?
తెలుగు రాష్ట్రాల్లో అటు విజయవాడ (Vijayawada), ఇటు హైదరాబాద్ (Hyderabad) వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో (NTR Satha Jayanthi Celebrations) జూనియర్, కల్యాణ్ రామ్ ఎక్కడా కనిపించలేదు. జయంతి రోజు ఎన్టీఆర్ ఘాట్‌లో (NTR Ghat) కనిపించిన ఈ ఇద్దరూ ఆ తర్వాత పెద్ద పెద్ద కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో సోమవారం నాడు ఈ కార్యక్రమంలో అయినా పాల్గొంటారా..? లేదా అనేది ఇంతవరకూ తెలియరాలేదు. ఇప్పటికే నందమూరి, నారా కుటుంబ సభ్యులు (Nandamuri, Nara Family Members) దాదాపు అందరూ ఢిల్లీ చేరుకున్నారు. అయితే ఈ ఇద్దరి విషయంలో మాత్రం ఇంతవరకూ ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆఖరికి తనకు ఆహ్వానం అందలేదని.. లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) కూడా గత నాలుగైదు రోజులుగా పెద్ద రచ్చే చేస్తున్నారు. తాను ఎన్టీఆర్ భార్యనని (NTR Wife).. ఎందుకు ఆహ్వానించలేదని రాష్ట్రపతి భవన్ అధికారులను ప్రశ్నించారు కూడా. ఈ ఒక్కటే కాదు.. ఎన్టీఆర్‌కు సంబంధించి ఎలాంటి కార్యక్రమాల్లో అయినా సరే ఆయన భార్యగా తనకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని విన్నవించుకున్నారు లక్ష్మీ పార్వతి.
ఇందుకే వెళ్లట్లేదా..?
హైదరాబాద్‌లో గత కొన్నిరోజులుగా ‘దేవర’ సినిమా (Devara Cinema) షూటింగ్‌లో ఎన్టీఆర్ బిజిబిజీగా ఉంటున్నారు. బిజీ షెడ్యూల్ కావడంతో తారక్ ఢిల్లీ వెళ్లే అవకాశాలు లేనట్లేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఒక్కరోజు షూటింగ్‌కు ఏమవుతుంది..? వెళ్లిరండన్నా.. అని అభిమానులు, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా (Social Media) వేదికగా కోరుతున్నారు. ఇంకొందరేమో షూటింగ్ ఒక్కరోజు ఆపితే పోయేదేముంది..? వెళ్లి ఫ్యామిలీతో కార్యక్రమంలో పాలుపంచుకోండని సూచిస్తున్నారు. ఆఖరి నిమిషంలో అయినా సరే.. బుడ్డోడు కచ్చితంగా వెళ్తారని జూనియర్ వీరాభిమానులు (NTR Fans) ట్విట్టర్‌లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారని వార్తలు వస్తున్నాయి. తారక్‌తో పాటు కల్యాణ్ రామ్ కూడా వెళ్తారని సమాచారం. అయితే దీనిపై బ్రదర్స్ మేనేజర్ల నుంచి గానీ.. పీఆర్వోల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. వెళ్తారో లేదో అనేదానిపై సోమవారం ఉదయం క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
నాణెం ఎలా ఉంది..?
కాగా.. ఎన్టీఆర్ పేరిట నాణెం జారీ చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (Nirmala Sitharaman) విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం ఆదేశాల మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఎన్టీఆర్ నాణెన్ని (NTR Silver Coin) ముద్రించింది. 44 మిల్లీ మీటర్ల చుట్టుకొలతతో ఉండే ఈ వంద రూపాయిల నాణేన్ని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారు చేశారు. అలాగే ఈ నాణేనికి ఓ వైపు మూడు సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శతజయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఎన్టీఆర్ శతజయంతి ఈ ఏడాదితో ముగిసింది కనుక 1923- 2023 అని ముద్రితమై ఉంది. ఈ అక్షరాలు హిందీలో ముద్రించడం విశేషమని చెప్పుకోవచ్చు.