YSRCP : నందిగామ సురేష్‌కు ఎంపీ టికెట్ ఇవ్వనని వైఎస్ జగన్ చెప్పేశారా.. యువనేత స్థానంలో ఎవరంటే..!?
ABN , First Publish Date - 2023-07-24T17:27:52+05:30 IST
నందిగామ సురేష్ (Nandigam Suresh).. ఈ యంగ్ ఎంపీ (Young MP) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో ఈ యువనేతకు ఎంపీ టికెట్ వచ్చింది.! అప్పటి వరకూ సురేష్ అంటే ఎవరో కూడా కనీసం ఆ చుట్టు పక్కల ప్రాంతాలకే తెలియదు. బాపట్ల ఎంపీ (Bapatla MP) అభ్యర్థిగా యువనేతను వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) ప్రకటించడంతో పాటు.. సురేష్‌తోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లును కూడా చదివించారు అధినేత...
నందిగామ సురేష్ (Nandigam Suresh).. ఈ యంగ్ ఎంపీ (Young MP) గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని రీతిలో ఈ యువనేతకు ఎంపీ టికెట్ వచ్చింది.! అప్పటి వరకూ సురేష్ అంటే ఎవరో కూడా కనీసం ఆ చుట్టు పక్కల ప్రాంతాలకే తెలియదు. బాపట్ల ఎంపీ (Bapatla MP) అభ్యర్థిగా యువనేతను వైఎస్ జగన్ రెడ్డి (YS Jagan Reddy) ప్రకటించడంతో పాటు.. సురేష్‌తోనే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లును కూడా చదివించారు అధినేత. దీంతో సురేష్ ఎవరబ్బా అని గూగుల్‌లో తెగ వెతకడం మొదలెట్టారు. అసలు రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తికి ఎంపీ టికెట్ (MP Ticket) ఇచ్చిన జగన్ వేవ్‌లో టీడీపీ తరఫున పోటీచేసిన మాల్యాద్రి శ్రీరామ్‌పై (Malyadri Sriram) 16,065 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే రానున్న ఎన్నికల్లో ఈయనకు ఎంపీ టికెట్ ఇవ్వనని జగన్ ఇదివరకే చెప్పేశారట. ఈ యువనేత స్థానంలో మరొకర్ని బరిలోకి దింపాలన్నది జగన్ ఆలోచనట. టికెట్ ఇవ్వకపోతే సురేష్ పరిస్థితేంటి..? బాపట్ల నుంచి ఎవరు పోటీచేసే ఛాన్స్ ఉంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..
ఎంపీ ఎక్కడ్నుంచో..!
రానున్న ఎన్నికల్లో గెలిచి వరుసగా రెండోసారి వైసీపీ (YSR Congress) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Reddy) విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది దేవుడెరుగు.! ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉండగా.. అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో వైసీపీ అధినేత బిజిబిజీగా ఉన్నారట. ఈ క్రమంలో సిట్టింగుల్లో ఎవర్ని పక్కనెట్టాలి..? ఎంపీలుగా ఎవర్ని బరిలోకి దింపాలి..? ఎంపీలు ఉన్న ఎవరెవర్ని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించాలి..? పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారి స్థానంలో ఎవర్ని పోటీ చేయించాలి..? కొత్త వ్యక్తులు, వేరే పార్టీ నుంచి వచ్చిన నేతలను ఎవరెవర్ని పోటీకి దింపాలని సీఎం లెక్కలేస్తున్నారు. ఈ క్రమంలో బాపట్ల పార్లమెంట్, తాడికొండ అసెంబ్లీ (Tadikonda Assembly) గురించి చర్చకు వచ్చిందట. తాడికొండ నుంచి గత ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి ( Vundavalli Sridevi) గెలవగా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిందనే ఆరోపణలతో పార్టీ నుంచి అధిష్టానం స్పెన్షన్ వేటు వేసింది. దీంతో శ్రీదేవి వైసీపీకి దూరం కావాల్సి వచ్చింది. అయితే.. ఆమె స్థానంలో సురేష్‌ను పోటీ చేయించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారని తెలియవచ్చింది. తాడికొండ నియోజకవర్గానికి ఇంచార్జ్‌గా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ (Dokka Manikya Vara Prasada Rao) కూడా టికెట్ ఆశిస్తుండగా.. ఈసారి కూడా ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టాలన్నది అధిష్టానం ప్లానట. డొక్కా ఒప్పుకుంటారో లేదో చూడాలి.
సురేష్ స్థానంలో ఎవరంటే..?
బాపట్ల నుంచి పోటీ చేయడానికి మాజీ ఐఏఎస్ ఒకరు సిద్ధంగా ఉన్నారట. ఆయన మరెవరో కాదు.. జిఎస్ఆర్‌కేఆర్. విజయ్ కుమార్ (GSRKR Vijay Kumar) అని తెలిసింది. ఐఏఎస్‌గా రిటైర్ అయినప్పటికీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక విజయ్‌ను కీలక పదవిలో కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. నాటి నుంచి జగన్ ఏం చెప్పినా కాదనకుండా పనులు చక్కబెట్టేవారని ఆరోపణలు చాలానే వచ్చాయి. అలా సీఎంకు అత్యంత సన్నిహితుడు అయ్యారు. ఇటీవలే తన పదవికి రాజీనామా చేసిన విజయ్.. రాజకీయాల్లోకి రావాలని తహతహలాడుతున్నారట. ఈ క్రమంలోనే ‘ఐక్యత విజయపథం’ పేరిట తడ నుంచి తుని వరకూ పాదయాత్రతో దళిత, గిరిజన, బిసీ, మైనార్టీ వర్గాలను కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్‌కు కూడా ఈయన్ను ఎంపీగా బరిలోకి దింపాలనే ఆలోచనే ఉందట. బాపట్ల, తిరుపతి (Bapatla, Tirupati) రెండు పార్లమెంట్ స్థానాలను పరిశీలించగా.. తిరుపతి వర్కవుట్ అవ్వదని.. ఎంపీగా గురుమూర్తినే (Maddila Gurumoorthy) రానున్న ఎన్నికల్లో కూడా టికెట్ ఇవ్వాలని దీంతో సద్దుబాటు కుదరదని అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందట. దీంతో బాపట్ల అయితేనే బెస్ట్ అని సీఎం అనుకుంటున్నారట. సురేష్ తాడికొండ నుంచి పోటీచేస్తారు కాబట్టి.. ఆ స్థానం ఖాళీ అవుతుంది.. రిజర్వ్ స్థానం కావడంతో విజయ్‌ను ఇక్కడ్నుంచి బరిలోకి దింపితే బాగుంటుందని సజ్జల, విజయసాయిరెడ్డితో (Sajjala, VijayaSai Reddy) జగన్ సమాలోచనలు చేశారట.
మొత్తానికి చూస్తే.. ఎంపీగా ఉన్న నందిగామ సురేష్‌ను ఎమ్మెల్యేగా.. ఇక మాజీ ఐఏఎస్‌ను ఎంపీగా బరిలోకి దింపాలని జగన్ పెద్ద ప్లానే చేస్తున్నారన్న మాట. అసలే అమరావతి ఏరియాలో వైసీపీ సర్కార్ అంటే జనాలు రగిలిపోతున్న పరిస్థితి.! ఇక బాపట్ల నుంచి గత ఎన్నికల్లో సురేష్.. అంతంత మాత్రం ఓట్లతోనే గట్టెక్కారు.. అది కూడా లోకల్ కాబట్టి ఆ మాత్రం ఓట్లు పడ్డాయి.. ఇప్పుడు అసలు నియోజకవర్గంలో ప్రజలకు ఎవరో తెలియని వ్యక్తి విజయ్‌ను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారట. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ, జనసేన (TDP, Janasena) పార్టీలు ఇక్కడ్నుంచి బలమైన నేతలను బరిలోకి దింపాలని వ్యూహాలు రచిస్తున్నాయట. ఫైనల్‌గా ఏమవుతుందో చూడాలి మరి.