Pawan Delhi Tour : పవన్ స్వయంగా ఢిల్లీకెళ్లారా.. కమలనాథులే పిలిపించుకున్నారా.. పర్యటన ఒక్కటే.. ప్రశ్నలెన్నో.. కొసమెరుపు ఏమిటంటే..!

ABN , First Publish Date - 2023-04-03T21:18:44+05:30 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సడన్‌గా (Janasena Chief Pawan Kalyan) ఢిల్లీ ఎందుకెళ్లారు..? హస్తిన పర్యటనలో (Pawan Delhi Tour) ఏం చేయబోతున్నారు..? బీజేపీ పెద్దలను కలవబోతున్నారా..?

Pawan Delhi Tour : పవన్ స్వయంగా ఢిల్లీకెళ్లారా.. కమలనాథులే పిలిపించుకున్నారా.. పర్యటన ఒక్కటే.. ప్రశ్నలెన్నో.. కొసమెరుపు ఏమిటంటే..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సడన్‌గా (Janasena Chief Pawan Kalyan) ఢిల్లీ ఎందుకెళ్లారు..? హస్తిన పర్యటనలో (Pawan Delhi Tour) ఏం చేయబోతున్నారు..? బీజేపీ పెద్దలను కలవబోతున్నారా..? ఇప్పటికే అపాయింట్మెంట్‌లు కూడా ఖరారయ్యాయా..? పెద్దలతో భేటీలో ఏయే విషయాలపై చర్చిస్తారు..? ఈ పర్యటనతో పొత్తులపై లెక్క తేలుతుందా..? అసలు పవనే స్వయంగా ఢిల్లీకెళ్లారా..? లేకుంటే ఢిల్లీ పెద్దల పిలుపు మేరకు వెళ్లారా..? ఇవీ సేనాని ఒక్క పర్యటనతో అటు అభిమానులు.. ఇటు కార్యకర్తల్లో, నెటిజన్లలో మెదులుతున్న ప్రశ్నలు. ఇంతకీ పవన్ ఢిల్లీ పర్యటనలో ఏం జరుగుతోందనే విషయాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

పర్యటనలో ఏం చేస్తున్నారు..!?

హస్తిన పర్యటనలో సేనాని బిజిబిజీగా గడుపుతున్నారు. అయితే ఈ మధ్యనే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) వరుసగా ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు. ఆయన పర్యటనకు వెళ్లిన రోజుల వ్యవధిలోనే పవన్ కూడా హస్తినకు వెళ్లడంతో ఈ టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. మొదటి రోజు ఢిల్లీ టూర్‌లో పవన్.. ఏపీ బీజేపీ ఇంచార్జ్ మురళీధరన్‌ను కలుసుకున్నారు. సుమారు 45 నిమిషాలపాటు మురళీధరన్‌‌తో (Muralidharan) ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు కీలక విషయాలపై కీలక చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు.. జనసేన-బీజేపీ (Janasena-BJP) కార్యాచరణ అంశాలపై కూడా చర్చ వచ్చినట్లు తెలుస్తోంది. పవన్‌తో పాటు ఈ భేటీలో జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ చేస్తున్న అరాచకాలపై ఓ నివేదికను కూడా సమర్పించారని తెలియవచ్చింది. అయితే హస్తిన టూర్ ఎందుకు..? ఇంకా ఎవరెవరితో భేటీ అవుతారని పవన్‌ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇంకా చాలా ఉంది.. టూర్ మొత్తం అయిపోయాక పూర్తి వివరాలు వెల్లడిస్తానని పవన్ కారులో వెళ్లిపోయారు.

Pawan-modi-and-amith-Shah.jpg

రేపో.. మాపో ఇలా..!

ఇప్పటికే బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda), కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో (Amit Shah) కూడా అపాయిట్మెంట్ ఫిక్స్ అయ్యిందని ఢిల్లీ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరితో మంగళవారం లేదా బుధవారం రోజున పవన్ భేటీ అవుతారని తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే ప్రధాని మోదీతో (PM Modi) కూడా పవన్ భేటీ అవుతారని వార్తలు వస్తున్నాయి. అయితే షా, నడ్డాతో భేటీలో ఏపీలో బీజేపీ-జనసేన పొత్తులపై స్పష్టత అవకాశాలు మెండుగా ఉన్నాయని అటు పవన్ ఫ్యాన్స్, ఇటు బీజేపీ కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అయితే.. ఈ భేటీలో ఏపీకి సంబంధించి మరికొన్ని విషయాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. ఎన్నాళ్లుగానో బీజేపీని పవన్ అడుగుతున్న రూట్ మ్యాప్, వారాహితో నియోజకవర్గాల పర్యటనపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Janasena-Pawan-1.jpg

ఇదా అసలు కథ..?

పవన్ కల్యాణే స్వయంగా ఢిల్లీ వెళ్లారా.. లేకుంటే ఢిల్లీ పెద్దలే పవన్‌ను రప్పించుకున్నారా..? అనేదానిపై స్పష్టత రాలేదు. పవన్ ఢిల్లీ పర్యటనపై చిత్ర విచిత్రాలుగా వార్తలు, సోషల్ మీడియా రూమర్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే.. త్వరలోనే కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీ కీలకం. కర్ణాటకలో గెలుపుపై బీజేపీ చాలా ఆశలే పెట్టుకుంది. ఇందుకోసం ఏ చిన్న అవకాశం వచ్చినా కమలనాథులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్‌తో కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయించాలని కమలనాథులు భావిస్తున్నారట. అందుకే పవన్‌ను ఇంత సడన్‌గా బీజేపీ పెద్దలు ఢిల్లీకి పిలిపించుకున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. పవన్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు ఆనుకుని ఉన్న కర్ణాటకలో పవన్‌కు ఉండే క్రేజ్‌, ఇమేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ఆయనతో ప్రచారం చేయిస్తే.. వెల్లువలా అభిమానులు తరలివస్తారని.. ఆ అభిమానాన్ని పొలింగ్ కేంద్రాల వరకూ తీసుకెళ్లొచ్చని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఈయనకు కొన్ని నియోజకవర్గాలను కమలనాథులు ఫిక్స్ కూడా చేశారని వార్తలు వస్తున్నాయి. మొత్తమ్మీద చూస్తే పవన్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా బీజేపీ వాడుకోవాలని భావిస్తోందన్న మాట.

కొసమెరుపు ఏమిటంటే..!

ఇవన్నీ ఒక ఎత్తయితే.. అసలు పవన్ ఢిల్లీ ఎందుకెళ్లారో..? ఏం చేయాలని వెళ్లారా మాకే తెలియదు..? అసలు పవన్ టూర్‌పై తమకు ఎలాంటి సమాచారం లేదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు చెప్పడం గమనార్హం. వాస్తవానికి బీజేపీ-జనసేన మధ్య చాలారోజులు గ్యాప్ ఉంది. ఇప్పటికే పొత్తుపై కీలక నేత మాధవ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనమే అయ్యాయి. అయితే తాజాగా.. అధ్యక్ష పదవిలో ఉన్న సోమువీర్రాజు కూడా సడన్‌గా ఎందుకు ఇలా అన్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి.

మొత్తానికి చూస్తే.. ఒక్క పవన్ పర్యటన, వందల ప్రశ్నలు పుట్టిస్తోంది. అసలు పవన్ ఎందుకు ఢిల్లీకెళ్లారో.. హస్తిన పర్యనటలో ఏం చేశారో..? పొత్తు, రూట్ మ్యాప్ గురించి పూర్తి స్పష్టత రావాలంటే సేనాని మీడియా ముందుకు రావాల్సిందే మరి.

*****************************

ఇవి కూడా చదవండి..

*****************************

Viral News : సోషల్ మీడియాలో రామోజీరావు ఫొటో వైరల్.. ఇందులో నిజమెంత అని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆరాతీస్తే..!

*****************************

YSRCP Meeting : ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ కీలక సమావేశం తర్వాత.. బొత్సపై ఏబీఎన్ ప్రశ్నల వర్షం.. మంత్రి రియాక్షన్ చూశారో...!

*****************************

YSRCP Meeting : టెన్షన్ టెన్షన్‌గా కీలక సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్యేలు.. టికెట్లు ఎవరెవరికో తేల్చి చెప్పేసిన సీఎం జగన్..
****************************

Updated Date - 2023-04-03T21:41:05+05:30 IST