Kanna Joined TDP: టీడీపీలో చేరడానికి అసలు కారణాలు ఏబీఎన్‌తో ప్రత్యేకంగా చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ

ABN , First Publish Date - 2023-02-23T22:07:22+05:30 IST

ఏబీఎన్ (ABN) డిబేట్లో టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు.

Kanna Joined TDP: టీడీపీలో చేరడానికి అసలు కారణాలు ఏబీఎన్‌తో ప్రత్యేకంగా  చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ

హైదరాబాద్: ఏబీఎన్ (ABN) డిబేట్లో టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి భవిష్యత్పైనే ఏపీ భవిష్యత్ ఆధారపడి ఉందని, 3 రాజధానులు అన్నప్పుడే ఏపీ భవిష్యత్ నాశనమవుతుందని చెప్పానని ఆయన తెలిపారు. అమరావతి రాజధాని ఉండాలనే ఉద్దేశంతోనే తాను టీడీపీ (TDP)లో చేరానని కన్నా స్పష్టం చేశారు. భీమవరంలో పొటికల్ నిర్మానం చేసినప్పుడు భావసారూప్యం కలిగిన రాజకీయ పార్టీలు, ప్రజలతోనే పొత్తు ఉంటుందని బీజేపీ నేతలు చెప్పారని, జనసేనతో పొత్తు అని చెప్పలేదని కన్నా అన్నారు. బయట మీడియాకు మాత్రం జనసేనతో పొత్తు అని చెబుతున్నారని మండిపడ్డారు. పొత్తుల గురించి మాట్లాడవద్దని బీజేపీ అధిష్టానం చెప్పినా ముగ్గురు నేతలు మాత్రం తరచూ పొత్తులపైనే మాట్లాడతారని, బీజేపీలో ఎవరైనా పొత్తుల గురించి అడిగితే చంద్రబాబు తొత్తులుగా ముద్ర వేస్తారని కన్నా మండిపడ్డారు.

ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని, వైసీపీ అరాచక శక్తులను ఎదుర్కొవాలంటే టీడీపీ, జనసేన కలిసి పనిచేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, వైసీపీ రాక్షన పాలనను పారదోలడానికి ఓట్లు చీలకుండా చూడాలని కన్నా స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీలో పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని, బాహాటంగానే వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. మొత్తానికి చూస్తే కన్నా తర్వాత చాలా మంది అసంతృప్తులు బీజేపీకి గుడ్‌బై చెబుతారని తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

బీజేపీ నుంచి బయటకు రావడానికి అసలు కారణాలు ఇవే.. పచ్చి నిజాలు చెప్పిన కన్నా

ఎమ్మెల్సీ నామినేషన్లలో టెన్షన్ టెన్షన్

ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడిన విద్యార్థి.. వివరాల్లోకెళ్తే..

పసుపు కండువా కప్పుకున్న గంటల వ్యవధిలోనే టీడీపీ- జనసేన పొత్తుపై కన్నా కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే వారంతా..

Updated Date - 2023-02-23T22:15:22+05:30 IST