TS Congress : ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌లో కీలక పరిణామం.. కార్యకర్తల్లో ఎనలేని ఉత్సాహం.. ఇక రాబోయే రోజుల్లో..!
ABN , First Publish Date - 2023-08-08T22:21:26+05:30 IST
అవును.. మీరు వింటున్నది నిజమే.. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌లో (TS Congress) కీలక పరిణామం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. హమ్మయ్యా.. ఇకనైనా కలిశారు.! ఇక అధికార పార్టీకి దబిడి దిబిడేనని కార్యకర్తలు, వీరాభిమానులు (Congress Fans) చెప్పుకుంటున్నారు.! సోషల్ మీడియా వేదికగా (Social Media) అయితే ఇద్దర్నీ ఆకాశానికెత్తేస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరనేది ఫొటో చూడగానే ఇప్పటికే క్లారిటీ వచ్చేసిందిగా.! అయితే ఢిల్లీ (Delhi) వేదికగా ఈ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు..?..
అవును.. మీరు వింటున్నది నిజమే.. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్‌లో (TS Congress) కీలక పరిణామం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో మునిగితేలుతున్నారు. హమ్మయ్యా.. ఇకనైనా కలిశారు.! ఇక అధికార పార్టీకి దబిడి దిబిడేనని కార్యకర్తలు, వీరాభిమానులు (Congress Fans) చెప్పుకుంటున్నారు.! సోషల్ మీడియా వేదికగా (Social Media) అయితే ఇద్దర్నీ ఆకాశానికెత్తేస్తున్నారు. ఆ ఇద్దరు ఎవరనేది ఫొటో చూడగానే ఇప్పటికే క్లారిటీ వచ్చేసిందిగా.! అయితే ఢిల్లీ (Delhi) వేదికగా ఈ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు..? అసలు ఈ ఇద్దరూ ఢిల్లీకి ఎందుకెళ్లారు..? అక్కడికెళ్లి ఏం చర్చించారు..? అనే విషయాలపై ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. హస్తినలో ఏం జరిగిందనే విషయాలపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
ఇదీ అసలు కథ..!
ఢిల్లీ వేదికగా మంగళవారం నాడు కీలక పరిణామాలు (Key Development) జరిగాయి. హస్తినకు పర్యటనకు వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy), ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (MP Komati Reddy Venkata Reddy) కీలక భేటీ అయ్యారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ మృతి (Gaddar Death), తదనంతర పరిణామాలు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చేపట్టాల్సిన కార్యక్రమాలు ఎలా ముందుకు వెళ్లాలి..? అనేదానిపై ఇద్దరి మధ్య లోతుగా చర్చ జరిగింది. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి సఖ్యతగా మెలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి భేటీ.. అది కూడా హస్తినలో కలవడం ఆసక్తి రేపుతోంది. కాగా.. గద్దర్ మృతి, అంత్యక్రియలు గురించి ఆయన కుటుంబ సభ్యుల గురించి ఇవాళ పార్లమెంట్‌లో రేవంత్ రెడ్డితో.. సోనియా గాంధీ (Sonia Gandhi) వాకబు చేశారు. అదేవిధంగా.. తాను గద్దర్ కుటుంబ సభ్యులకు (Gaddar Family) లేఖ రాసిన విషయాన్ని రేవంత్‌తో సోనియా (Revanth-Sonia) ప్రస్తావించారు. అయితే.. పీపుల్స్ ప్లాజాలో గద్దర్ స్మారకాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. చెన్నారెడ్డి (Chenna Reddy), జైపాల్ రెడ్డి (Jaipal Reddy), ఎన్టీ రామారావు (NTR) స్మారకాల్లాగానే గద్దర్ స్మారకాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రేవంత్, కోమటిరెడ్డి చెబుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt) ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేస్తామని ప్రకటించే యోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు తెలియవచ్చింది.
ఇక కాస్కోండెహే..!
రేవంత్-కోమటిరెడ్డి (Revanth-Komati Reddy) మధ్య తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర చర్చలు జరిగాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ నుంచి చేరికల విషయంలో చర్చించినట్లుగా తెలియవచ్చింది. ‘మేమిద్దరం కృష్ణార్జునులం.. అన్నదమ్ముల్లా కలిసి పని చేస్తాం’ అని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణకు, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ నుంచి విముక్తి కలిగించడమే తమ అంతిమ లక్ష్యమని కోమటిరెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో రేవంత్ సహా ఇతర నేతలందరితోటి కలిసి పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడతామని వెంకటరెడ్డి ఏబీఎన్‌కు తెలిపారు. సికింద్రాబాద్ ఫరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తే బాగుంటుందని రేవంత్‌తో కోమటిరెడ్డి ప్రతిపాదించారు. భారీ బహిరంగ సభ నిర్వహించి.. సోనియాగాంధీని ఆహ్వానిస్తే బాగుంటుందని ఇరువురూ అభిప్రాయానికి వచ్చారు. ఇలా ఇద్దరూ కలిసిపోయారని.. కలిసే నిర్ణయాలు, కార్యాచరణ ప్రకటించేసరికి కాంగ్రెస్ నేతల్లో కొత్త జోష్ వచ్చింది. ఇక కార్యకర్తలు అయితే ఆనందంలో మునిగితేలుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇరువురి ఫొటోలు షేర్ చేస్తూ.. ఇక బీఆర్ఎస్‌కు దబిడి దిబిడేనని.. కృష్ణార్జులను కాస్కొండెహే అని ట్వీట్లు చేస్తూ హడావుడి చేస్తున్నారు. సో.. ఇలా ఇద్దరూ కలిసి ముందుకెళ్తానని స్వయంగా చెప్పడం కాంగ్రెస్ మంచి పరిణామమేనని చెప్పుకోవచ్చు.