Three Capitals : 3 రాజధానులకు లైన్ క్లియర్ అయ్యిందని బ్రేకింగ్స్ వేసినందుకు...
ABN , First Publish Date - 2023-02-10T18:00:44+05:30 IST
ఏపీ మూడు రాజధానుల (AP Three Capitals) విషయంలో అధికార వైసీపీ (YSRCP) ముందుకెళ్తున్న ప్రతిసారి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్ ..
అమరావతి : ఏపీ మూడు రాజధానుల (AP Three Capitals) విషయంలో అధికార వైసీపీ (YSRCP) ముందుకెళ్తున్న ప్రతిసారి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. అయినప్పటికీ సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) మాత్రం వెనక్కి తగ్గకుండా ఢిల్లీ (Delhi) వేదికగా త్వరలోనే విశాఖ (Visakhapatnam) నుంచి పరిపాలన సాగిస్తామని తేల్చిచెప్పేశారు. అంతేకాదు.. ఏపీకి రాజధాని విశాఖే అని.. సీఎంగా మాట చెబుతున్నా అంటూ పెట్టుబడిదారులను ఆహ్వానించారు కూడా. మూడు రాజధానుల విషయం కోర్టులో ఉండగానే ఎలా ప్రకటన చేస్తారని ఇది కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లే అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు.. రాజధాని మార్చే అధికారం జగన్ సర్కార్‌కు లేదని హైకోర్టు (High Court) తీర్పు ఇవ్వగా ప్రభుత్వం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది.
సుమోటాగా..!
ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీకి చెందిన కీలక న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ (Gudapati Laxmi Narayana) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. విశాఖే రాజధాని అని జగన్ ప్రకటించడం కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లే అని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారయన. జగన్‌పై సుమోటాగా చర్యలు తీసుకోవాలని సీజేఐకి రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. న్యాయస్థాన ధిక్కార చట్టం 1971లోని సెక్షన్ 2(సీ)ను సీఎం జగన్ ఉల్లంఘించినట్టేనని లక్ష్మీనారాయణ తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఇంతవరకూ సుప్రీంకోర్టు రియాక్ట్ కాకపోవడంతో సీజేఏ ఎలా రియాక్ట్ అవుతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
బ్రేకింగ్ న్యూస్‌పై ఫిర్యాదు..
తాజాగా.. లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ మరోసారి సీజేఐకి లేఖ రాశారు. మూడు రాజధానులకు లైన్ క్లియర్ అయిందంటూ ఓ ఛానెల్‌లో వేసిన బ్రేకింగ్స్‌పై (Breakings) సీజేఐకి గూడపాటి ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందంటూ బ్రేకింగ్స్ వేశారని న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు.. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా లాయర్ ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉద్ధేశపూర్వకంగా బ్రేకింగ్స్ వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు విచారణ జరుగుతున్న సమయంలో వేసిన బ్రేకింగ్స్ కోర్టు ధిక్కార నేరం కిందకు వస్తాయని లేఖలో లాయర్ తెలిపారు. బ్రేకింగ్స్ వేసిన ఛానెల్‌పై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని లాయర్ లక్ష్మీనారాయణ కోరారు. మొత్తానికి చూస్తే.. అటు జగన్ ప్రకటన, ఇటు బ్రేకింగ్స్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.