TS Politics: బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. నోటా, కారు, హస్తం.. ఎవరికి ఓటేసినా నేనే గెలుస్తా..!!
ABN , First Publish Date - 2023-08-22T19:58:55+05:30 IST
వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం గ్యారంటీ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. మీరు ఎవరికి ఓటు వేసినా నేనే గెలుస్తా అన్నారు. మీరు నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్తానని.. కారు గుర్తుకు ఓటు వేసినా నేనే గెలుస్తానని.. హస్తం గుర్తుకు ఓటేసినా తానే గెలుస్తానని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. మీరు దేనికి ఓటు వేసినా ఓటు పడేది బీజేపీకే అని స్పష్టం చేశారు.
తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలిస్తే నోరెళ్లపెట్టడం ఖాయం. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటు వేసినా పడేది బీజేపీకే అన్న తరహాలో ఆయన వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందా అని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి బీజేపీ గెలవబోతుందా అని చర్చించుకుంటున్నారు.
ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఇవే
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన లోక్‌సభ నియోజకవర్గంలో మంగళవారం నాడు ముస్లిం మైనారిటీ సమావేశం నిర్వహించారు. 75 ఏళ్లలో మైనార్టీలకు కాంగ్రెస్ లేదా ఇతర పార్టీల వల్ల లాభం చేకూరలేదని ఆరోపించారు. బీజేపీ మాత్రమే మైనార్టీలకు గుర్తింపు ఇచ్చిందని ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. కేసీఆర్ కారణంగానే తెలంగాణలో అవాస్ యోజన అమలు చేయలేదన్నారు. కోవిడ్ సమయంలో ముస్లింలకు చికిత్సతో పాటు భీమా కల్పించామని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ ఆమలు చేయకుండా కేసీఆర్ మైనార్టీలకు అన్యాయం చేశారని విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు. మీరు ఎవరికి ఓటు వేసినా నేనే గెలుస్తా అన్నారు. మీరు నోటాకు ఓటు వేసినా నేనే గెలుస్తానని.. కారు గుర్తుకు ఓటు వేసినా నేనే గెలుస్తానని.. హస్తం గుర్తుకు ఓటేసినా తానే గెలుస్తానని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. మీరు దేనికి ఓటు వేసినా ఓటు పడేది బీజేపీకే అని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Bandi Sanjay: మారిన ‘బండి’ రూట్.. పవన్ కళ్యాణ్‌పై అప్పుడలా.. ఇప్పుడిలా..!!
ధర్మపురి అరవింద్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 2014, 2019 ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే గెలిచిందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల తెలంగాణ సీఈసీ వికాస్ రాజ్ వ్యాఖ్యలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ కొత్త ఈవీఎంలు వినియోగిస్తామని చెప్పడం దేనికి సంకేతం అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో అత్యాధునిక ఎం-3 యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తామని వికాస్ రాజ్ చెప్పడంలో అర్ధమేంటని నిలదీస్తున్నారు. అంతేకాకుండా 2019 ఎన్నికల్లో 20 లక్షల ఈవీఎంలను అప్పటి సీఈసీ మార్చడం వల్లే బీజేపీ గెలుపు సాధ్యమైందని కొందరు నెటిజన్‌లు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.