Pattabhi: జగన్ ఓటమి భయంతోనే అలా చేస్తున్నారు..

ABN , First Publish Date - 2023-03-05T18:29:33+05:30 IST

జగన్ (Jagan) ఓటమి భయంతో రౌడీమూకలను వదులుతున్నారని పట్టాభి ఆరోపించారు.

Pattabhi: జగన్ ఓటమి భయంతోనే అలా చేస్తున్నారు..

విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై టీడీపీ నేత పట్టాభిరామ్ (TDP leader Pattabhiram) విమర్శలు గుప్పించారు. వైసీపీ అరాచక పాలనపై ధర్మపోరాటం చేస్తున్నామని ABNతో పట్టాభిరామ్‌ చెప్పారు. తప్పు జరుగుతుంది కాబట్టి ఎదురు నిలబడి ప్రశ్నిస్తున్నామని, జగన్ (Jagan) ఓటమి భయంతో రౌడీమూకలను వదులుతున్నారని పట్టాభి ఆరోపించారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తలను భయపెట్టాలని జగన్‌ ప్రయత్నం చేస్తున్నారని పట్టాభి మండిపడ్డారు. తనకోసం పోరాడుతున్న తన భార్యను వైసీపీ సైకోలు ట్రోల్‌ చేశారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ పట్ల ఎలా వ్యవహరించాలన్న సిగ్గులేదని, వైసీపీ రౌడీ మూకలకు భయపడేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడ తప్పు జరిగినా పోరాడుతామని, మరో ఏడాదిలో ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని పట్టాభి జోస్యం చెప్పారు. అప్పటివరకు తమ పోరాటం ఆగదని, గన్నవరంలో వైసీపీ గూండాల విధ్వంసకాండను ప్రత్యక్షంగా చూపించిన ABNకు పట్టాభిరామ్ అభినందనలు తెలిపారు.

శనివారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ (TDP leader Kommareddy Pattabhi Ram) సంచలన ఆరోపణలు చేశారు. బీసీ నాయకుడిగా అండగా నిలబడడం కోసం తాము గన్నవరం వెళ్తే.. జగన్ సీఎం అయినప్పటి నుంచి ఎసీ, ఎస్టీ, బీసీలపై అతికిరాతకంగా దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు చెందిన పార్టీ అని పట్టాభి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా బీసీలపై దాడులు జరిగినా, అన్యాయం జరిగినా తాము వెళ్తామని చెప్పారు.

తన వాహనం నుంచి తనను పోలీసు వాహనంలోకి ఎక్కించి ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్తున్నారో చెప్పకుండా అర్ధరాత్రి 2 గంటల వరకు 200 కిలోమీటర్లు తిప్పారని పట్టాభిరామ్ ఆవేదన వ్యక్తం చేశారు. తనతోపాటు ఉన్న ఇద్దరు ఎస్ఐలకు ప్రతి 15 నిమిషాలకు ఒకసారి జిల్లా ఎస్పీ ఫోన్ చేస్తారని పట్టాభి చెప్పారు. తనను అరెస్ట్ చేసినప్పటి నుంచి ప్రతినిత్యం ఎస్పీ డైరెక్షన్‌లో ఈ వ్యవహారమంతా నడిచిందని ఆయన మండిపడ్డారు. చివరి అర్థరాత్రి 2 గంటలకు తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు. ఊరంతా విద్యుత్ కాంతులతో లైట్లు వెలుగుతుంటే.. పోలీస్ స్టేషన్‌లో మాత్రం కరెంట్ లేదని, పూర్తిగా చీకటిగా ఉందని చెప్పారు. తనతోపాటు వచ్చిన ఇద్దరు ఎస్ఐలు, ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీస్ స్టేషన్ కరెంట్ ఎందుకు లేదని అడిగానని, ఏదో పవన్ ఫెయిల్యూర్ అయి ఉంటుందని, కరెంట్ వస్తుందలే అంటూ తనను లోపలికి తీసుకెళ్లారని, లోపల ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా లేరని, మొత్తం స్టేషన్ నిర్మానుష్యంగా ఉందని చెప్పారు. స్టేషన్‌లో తనను ఒక్కరినే కూర్చొపెట్టి పోలీసులు మళ్లీ వస్తామని చెప్పి బయటకువెళ్లారని ఆరోపించారు.

పోలీసులు వెళ్లిపోయిన 15 నిమిషాలకు ముగ్గురు ముసుగులు వెసుకొని బందీపోటు దొంగలు వచ్చినట్లు వచ్చి తన మొహానికి టవల్ చూట్టి ఊపిరి ఆడకుండా చేశారని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఒక గదిలోకి ఈడ్చుకెళ్లి విచక్షణారహితంగా కొట్టడం ప్రారంభించారని పట్టాభి చెప్పారు. దాదాపు 35 నిమిషాలపాటు తనను చిత్రహింసలకు గురిచేశారని పట్టాభి పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. ఆ తర్వాత తనను అక్కడ వదిలేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మొహానికి ఉన్న టవల్ తీసి చూసేసరికి అప్పటికీ స్టేషన్ ఎవరూ లేరని చెప్పారు. తాను అతికష్టం మీద లేచి ఓ కూర్చిలో కూర్చున్న 5 నిమిషాలకు తనను స్టేషన్‌లో దింపి వెళ్లిన ఎస్ఐలు తిరిగి వచ్చారని చెప్పారు. ఎస్పీ ప్లాన్ పక్కాగా అమలు చేశారని పట్టాభిరామ్ ఆరోపించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఆ మూడు ప్రాంతాలను కలిపి ప్రత్యేక జిల్లా చేస్తాం.. సభలో పాల్గొన్న నల్లారి కిశోర్‌రెడ్డి

జైలు నుంచి విడుదల అనంతరం షాకింగ్ నిజాలు బయట పెట్టిన పట్టాభి

జగన్ ఓటమి భయంతోనే అలా చేస్తున్నారు

Updated Date - 2023-03-05T18:36:14+05:30 IST