MLC Kavitha : మంత్రి కేటీఆర్ హస్తినకు చేరుకున్న నిమిషాల వ్యవధిలోనే.. సీన్ మొత్తం మారిపోయిందిగా..!

ABN , First Publish Date - 2023-03-10T22:29:41+05:30 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) శనివారం నాడు ఈడీ విచారణకు హాజరుకానున్న

MLC Kavitha : మంత్రి కేటీఆర్ హస్తినకు చేరుకున్న నిమిషాల వ్యవధిలోనే.. సీన్ మొత్తం మారిపోయిందిగా..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) శనివారం నాడు ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్ అంతా ఢిల్లీకి (Delhi) మారిపోయింది. తెలంగాణ సీఎం కేసీఆర్ సూచనతో హుటాహుటిన మంత్రి కేటీఆర్ (Minister KTR) ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. శనివారం, ఆదివారం రెండ్రోజులూ ఢిల్లీలోనే ఉండనున్నారు కేటీఆర్. అయితే ఆయన హస్తినకు చేరుకున్న సీన్ మొత్తం మారిపోయింది. మంత్రులు హరీష్ రావు (Minister Harish Rao), శ్రీనివాస్‌గౌడ్ (Sreenivas Goud) కూడా ఢిల్లీ బాట పట్టారు. అంతేకాదు.. శనివారం ఉదయాన్నే ఎమ్మెల్సీ మధు, ఎమ్మెల్యే బాల్క సుమన్, జీవన్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. వీరంతా కవితకు మద్దతుగా ఢిల్లీ వెళ్తున్నారు. నిమిషాల వ్యవధిలోనే ఒక్కొక్కరుగా ఢిల్లీకి పయనం అవుతుండటంతో హస్తినలో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి చూస్తే.. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో మంత్రులు, బీఆర్ఎస్ నేతలు అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు.

Kavitha-S.jpg

వరుస భేటీలు..!

మరోవైపు.. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసంలో కవితతో బీఆర్ఎస్ లీగల్ సెల్ సభ్యులు, న్యాయ నిపుణులు భేటీ అయ్యారు. కేసులో ఎలా ముందుకెళ్దాం..? ఏం చేద్దాం..? అని న్యాయ నిపుణులతో చర్చించారు. ఈ సమావేశం తర్వాత కవితతో మంత్రి కేటీఆర్ కూడా సమావేశం అవుతున్నారు. అనంతరం మంత్రి హరీష్‌తో కూడా న్యాయ నిపుణులతో చర్చించిన విషయాలన్నీ మాట్లాడనున్నారు. ఇవాళ రాత్రి అంతా కేసీఆర్ నివాసంలో వరుస భేటీలు జరగనున్నాయన్న మాట. కేటీఆర్ ఢిల్లీ వెళ్లాక ఈ పనులన్నీ చకచకా జరుగుతున్నాయి. సోదరి కవిత కోసం కేటీఆరే దగ్గరుండి అన్నీ చూసుకుంటున్నారు.

Ministers.jpg

ఇప్పటికే.. ఢిల్లీలోనే బీఆర్ఎస్‌ ముఖ్య నేతలు, ఎంపీలు, లీగల్‌ టీమ్‌ లాయర్లు ఉన్నారు. గురువారం నాడు కేబినెట్ భేటీ మధ్యలోనే మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ఢిల్లీ వెళ్లారు. మరోవైపు.. నాలుగైదురోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు నామ నాగేశ్వరరావు, కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర, వెంకటేష్ నేత, కవిత ఢిల్లీలోనే ఉన్నారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Delhi Liquor Scam Case : బీఆర్ఎస్ నేతలంతా ఇలా చేయండి.. కవిత ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో కేసీఆర్ కీలక సూచనలు..!

******************************

MLC Kavitha : హుటాహుటిన హస్తినకు బయల్దేరిన మంత్రి కేటీఆర్.. ఏం జరుగుతుందో..!

******************************

BRS KCR : తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడో ఒకే ఒక్క మాటలో తేల్చేసిన సీఎం కేసీఆర్..


******************************

Delhi Liquor Scam : కవితకు ఈడీ నోటీసులివ్వడంపై ఫస్ట్ టైమ్ స్పందించిన కేసీఆర్.. సీఎం మాటలతో బీఆర్ఎస్‌లో టెన్షన్.. టెన్షన్..


******************************

Updated Date - 2023-03-10T22:55:27+05:30 IST