Political Stir In DS Family : డీఎస్ ఎపిసోడ్‌పై స్పందించిన ఎంపీ అర్వింద్.. అంతా ఓకే కానీ...

ABN , First Publish Date - 2023-03-27T21:30:25+05:30 IST

తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఆదివారం నాడు కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకున్న ఆయన..

Political Stir In DS Family  : డీఎస్ ఎపిసోడ్‌పై స్పందించిన ఎంపీ అర్వింద్.. అంతా ఓకే కానీ...

తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharmapuri Srinivas) వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. ఆదివారం నాడు కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకున్న ఆయన.. సోమవారం రాజీనామా చేయడం రచ్చ రచ్చ అయ్యింది. 24 గంటలు కూడా గడవక ముందే రాజీనామా చేయడంతో ఇంటిపోరులో భాగంగానే ఇలా జరిగిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సన్ స్ట్రోక్ వల్లే రాజీనామా చేయాల్సి వచ్చిందని అభిమానులు అంటుండగా.. ఇందుకు కర్త, కర్మ అంతా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (BJP MP Dharmapuri Arvind) అని సోదరుడు సంజయ్ (Dharmapuri Sanjay) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు స్పందించిన అర్వింద్.. డీఎస్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకున్న నేతలు.. ఢిల్లీ పెద్దలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోషల్ మీడియా (Social Media) వేదికగా ఓ వీడియోను అర్వింద్ విడుదల చేశారు.

DS-Congress.jpg

స్పందించారు కానీ..!

నిన్నటి నుంచీ మా నాన్న ఎపిసోడ్ గురించి మాట్లాడటానికి మీ ముందుకొచ్చాను. గాంధీ భవన్‌కు వెళ్లి వచ్చారని మాత్రం నాకు తెలుసు. మా నాన్నగారికి ఆదివారం రాత్రి ఫిట్స్ వచ్చిన మాట వాస్తవం. ఇందుకు సంబంధించి వీడియో కూడా నా దగ్గర ఉంది. డాక్టర్స్‌కు ఆ వీడియో పంపితే.. వారు ప్రాథమిక చికిత్స ఎలా చేయాలనేదానిపై మాకు సూచనలు చేస్తారు. ఇందులో నాకెలాంటి సంబంధం లేనే లేదు. మా నాన్నే కాంగ్రెస్ వ్యక్తే.. గత ఐదేళ్ల నుంచి నేను వందల సార్లు ఈ విషయం చెప్పాను. మా నాన్న కట్టర్ కాంగ్రెస్.. నేను కట్టర్ బీజేపీ వాడినే. ఆయన ఎక్కడున్నా కాంగ్రెస్ వాదే. నిన్న ఫిట్స్‌ వచ్చాక మా అమ్మ ఇబ్బంది పడి ఉంటుంది. రెండో విషయం నాకు నచ్చనిది.. అమ్మకు కూడా నచ్చనిది ఒకటుంది. డీఎస్ లాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేటప్పుడు.. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.. హైపర్ టెన్షన్ ఉంది.. డైలీ ఫిట్స్ వస్తున్నాయి. పెరాలిసిస్ కూడా ఉంది. ఆయన బాత్రూమ్‌కు కూడా సరిగ్గా పోలేని వ్యక్తిని.. గాంధీ భవన్‌కు తీసుకెళ్లి ఆయనెవరో మాణిక్‌రావ్ ఠాక్రే అంట కండువా కప్పారు. కాంగ్రెస్‌లో జాయిన్ చేసుకునేకి ఇది సరైన సమయం కాదు.. ఆయన 2018 నుంచి పార్టీలో చేరతానంటే.. మీరు తీసుకోలేదు.. ఎందుకు తీసుకోలేదో నాకు తెలియదు. సోనియాగాంధీ (Sonia Gandhi) కుటుంబానికి 40, 45 ఏళ్లు సేవచేశారు. కనీసం ఆయన ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకోలేదు. స్వయంగా ఇంటికొచ్చి పార్టీలో చేర్చుకుంటే బావుండేది. 2015లో కాంగ్రెస్ వాళ్ళే డీఎస్ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టుకున్నారు. మా నాన్న ఏ పార్టీలో చేరినా.. నాకు రాజకీయంగా నష్టం లేదు. కాంగ్రెస్‌లో చేరినా కమ్యూనిస్టు పార్టీలో చేరినా నాకెలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ సమయంలో ఆయన్ను పార్టీలో చేర్చుకుని మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదుఅని ధర్మపురి అర్వింద్ వీడియో రిలీజ్ చేశారు.

Dharmapuri-Arvindh.jpg

సంజయ్ సంచలన ఆరోపణలు ఇవీ..

డీఎస్‌పై కుట్ర జరుగుతోంది. డీఎస్‌కు ప్రాణహాని ఉంది. నాన్న చుట్టూ ఉన్న వాళ్లపై నాకు అనుమానం ఉంది. ఎంపీ అర్వింద్ మా నాన్నను బ్లాక్ మెయిల్ చేసి రాజీనామా లేఖపై సంతకం చేయించారు. ఆస్తులు కూడా బెదిరించి రాయించుకున్నారు. డీఎస్ రాజీనామా చేసిన సంతకం ఫేక్. నాన్నను రూమ్‌లో బంధించి బలవంతంగా సంతకం చేయించుకున్నారు. మా నాన్నతో నా ఫోన్ లిఫ్ట్ చేయించడం లేదు. ఏం జరుగుతోందో తెలియక మాకు ఆందోళనకరంగా ఉంది. రౌడీలు, డబ్బును అడ్డు పెట్టుకుని దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. ఎంపీ అరవింద్ (MP Dharmapuri Arvind) దిగజారి వ్యవహరిస్తున్నారు. ఎంపీ అర్వింద్.. నీ అంతం మొదలైంది. మా నాన్నకు ఫిట్స్ వస్తే ఇంట్లో ఎందుకు ఉంచారు. మా నాన్న ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది. కాంగ్రెస్ అధిష్ఠానం (Congress High Command) ఆదేశిస్తే అర్వింద్‌పై పోటీచేస్తాను. మా నాన్నను బ్లాక్‌మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారు. రాజీనామా లేఖలు బీజేపీ ఎంపీ చేయిస్తున్న డర్టీ పాలిటిక్స్. మానాన్న డీఎస్‌కు ప్రాణహాని ఉంది. అర్వింద్‌కు కొందరు సహకరిస్తున్నారు.. వాళ్లు ఎవరో నాకు తెలుసు. వాళ్లు పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. అర్వింద్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోంది అని సోదరుడు అర్వింద్‌ను సంజయ్ హెచ్చరించారు.

Dharmapuri-Sanjay.jpg

అంతా ఓకే కానీ.. సోదరుడు సంజయ్ చేసిన ఆరోపణలపై మాత్రం ఎక్కడా అర్వింద్ పెద్దగా స్పందించలేదు. తాను చెప్పాలనుకున్నది మాత్రమే చెప్పేసి సైలెంట్ అయిపోయారు. ఈ వ్యాఖ్యలపై మళ్లీ సంజయ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

****************************

ఇవి కూడా చదవండి
*****************************

TS Congress : ఫ్యామిలీలో రాజకీయ రచ్చ జరుగుతుండగా.. డీఎస్ ఆరోగ్యంపై షాకింగ్ విషయాలు చెప్పిన డాక్టర్స్..

*****************************

DS Resignation : డీఎస్ రాజీనామా సంతకం ఫేక్.. అసలేం జరిగిందో పూసగుచ్చినట్లుగా చెప్పిన ధర్మపురి సంజయ్..

******************************

TS Congress : నిన్న కాంగ్రెస్‌లో చేరిక.. ఇవాళ ఊహించని ట్విస్ట్ ఇచ్చిన డీఎస్.. సడన్‌గా ఎందుకిలా..!?
******************************

YSRCP : ఉండవల్లి శ్రీదేవి ఏ పార్టీలో చేరబోతున్నారు.. తాడికొండ నుంచి బరిలోకి దింపడానికి జగన్‌ ఎవరెవర్ని పరిశీలిస్తున్నారు.. వైఎస్ సన్నిహితుడికేనా..!?


******************************

Updated Date - 2023-03-27T21:36:15+05:30 IST