DS Resignation : డీఎస్ ఎపిసోడ్‌ను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్.. ఆయన ఫోన్‌కాల్‌తో.. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే..!
ABN , First Publish Date - 2023-03-27T22:43:57+05:30 IST
తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharamapuri Srinivas) ఎపిసోడ్‌ను కాంగ్రెస్ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నారు. డీఎస్ కుటుంబంలో రాజకీయ చిచ్చు రగలడంతో మనస్పర్థలు వచ్చాయని..
తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ (Dharamapuri Srinivas) ఎపిసోడ్‌ను కాంగ్రెస్ పెద్దలు సీరియస్‌గా తీసుకున్నారు. డీఎస్ కుటుంబంలో రాజకీయ చిచ్చు రగలడంతో మనస్పర్థలు వచ్చాయని.. అందుకే రాజీనామా (Resignation) చేసే పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. డీఎస్, ఆయన సతీమణి లేఖలు.. ధర్మపురి సంజయ్ (Dharmapuri Sanjay) సంచలన ఆరోపణలు చేయడం, మరోవైపు ఎంపీ అర్వింద్ (MP Arvind) స్పందించడంతో అసలు ఎవరు నిజం చెబుతున్నారో ఏంటో అభిమానులు, అనుచరులు తెలియక ఆందోళనలో పడ్డారు. ఇవన్నీ అలా నడుస్తుండగానే డీఎస్ ఆరోగ్యంపై సిటీ న్యూరో సెంటర్ వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయడంతో అభిమానుల్లో మరింత ఆందోళన పెరిగిపోయింది. అసలు ధర్మపురి విషయంలో ఏం జరిగింది..? ఈ ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌లో ఎలా ముందుకెళ్తోందనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
కాంగ్రెస్ రియాక్షన్ ఇదీ..
డీఎస్ రాజీనామాపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు (వీహెచ్) స్పందించారు. ‘ ఢిల్లీకి వెళ్లి ఆయనే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో తిరిగి చేరమని మేము డీఎస్‌ని పిలవలేదు. డీఎస్సే కండువా ఇచ్చి కప్పమన్నారు. మీరు సరే మీ కొడుకు సంగతి ఏంటని నేను అడిగాను. మీ కొడుకుని కూడా జాయిన్ చేయమని చెప్పాను. బీజేపీలో ఉన్న అరవింద్‌ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని చెప్పాను. ఒక ఇంట్లో రెండు పార్టీలు ఎలా ఉంటాయని అడిగాను. తెలంగాణలో బీజేపీ (BJP) డౌన్ అవుతోంది.. కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. ఇవే విషయాలను డీఎస్‌తో నేను వివరంగా చెప్పాను. పార్టీలోకి వస్తామంటే మానవతా దృక్పథంతో ఆహ్వానించాం. పార్టీ వద్దు అనుకున్నప్పుడు కండువా ఎందుకు కప్పుకున్నారు..?. రాహుల్ విషయంలో మా సమస్యలు మాకున్నాయి. అసలు మిమ్మల్ని పార్టీలోకి ఎవరు రమ్మన్నారు. కాంగ్రెస్‌ను అభాసుపాలు చేయాలని చూస్తున్నారు. ఇంటి పంచాయితీలు ఉంటే మీరే చూసుకోవాలి’ అని వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత కుటుంబం నుంచే..!
డీఎస్‌కు సొంత కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉందని.. ఆయన రక్షణ కల్పించాలని డీజీపీ అంజన్‌కుమార్‌ను (DGP Anjanikumar) కలిసి సీనియర్ నేత, పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు చేశారు. ‘డీఎస్ కుమారుడు సంజయ్ మాట్లాడిన వీడియో మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దానిని బట్టి చూస్తే డీఎస్ వేధింపులకు గురవుతున్నారని తెలుస్తోంది. వేధింపుల గురించి డీఎస్ స్వయంగా ప్రస్తావించారు. డీఎస్ మెదడు సమస్యతో బాధపడుతున్నారని, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని హెల్త్ బులెటిన్‌లో సిటీ న్యూరో హాస్పిటల్ వైద్యులు పేర్కొన్నారు. వీటన్నింటిని చూసిన తరువాతనే ప్రాణాలకు ముప్పు ఉందని, డీఎస్‌కు భద్రత కల్పించాలని కోరుతున్నాం. ఆయన సొంత కుటుంబ సభ్యుల నుంచే డీఎస్‌కు ప్రాణహాని ఉంది. పార్టీలో చేరమని డీఎస్‌పై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదు. ఆయనే గత ఏడాది కాలంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకుంటున్నారు. డీఎస్ కుటుంబ గొడవలు అతన్ని స్వేచ్ఛగా ఉండేందుకు అనుమతించడం లేదు. ప్రజాదరణ కలిగిన డీఎస్‌కు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణాలకు ముప్పు ఉంది. డీఎస్ ప్రాణాలను కాపాడేందుకు పోలీసు శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని డీజీపీకి రాసిన లేఖలో నిరంజన్ పేర్కొన్నారు.
ట్విస్ట్ ఏమిటంటే..!
ఎంపీ ధర్మపురి అర్వింద్ డీఎస్‌ను బ్లాక్‌మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని ఆరోపించిన సంజయ్.. డీఎస్‌కు పలుమార్లు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అయితే ఆఖరికి డీఎస్ నుంచే సంజయ్‌కు ఫోన్ వచ్చింది.
సంజయ్ : నిన్నటి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయ్ కదా ఏమైనా ఇబ్బందిగా ఉందా.. హ్యాపీగా ఉన్నారా..!?
డీఎస్ : అవును.. ఇక్కడ కొన్ని వేధింపులు ఉన్న మాట వాస్తవమే.
సంజయ్ : నువ్వు బయపడకు, ధైర్యంగా ఉండండి నాన్నా..! అని డీఎస్‌కు కుమారుడు సంజయ్ ధైర్యం చెప్పారు.
ఇప్పటి వరకూ.. డీఎస్‌పై ఎలాంటి ఒత్తిడి లేదని మాత్రమే వార్తలు రాగా సంజయ్ నుంచి ఫోన్ కాల్ రావడంతో ఈ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయి. మరి ఈ ఎపిసోడ్‌లో ఫైనల్ టచ్ ఎప్పుడు ఉంటుందో.. ఎవరిస్తారో వేచి చూడాల్సిందే.