Share News

CBN Skill Case : స్కిల్ కేసుపై చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం ఇదీ..

ABN , First Publish Date - 2023-10-17T16:28:01+05:30 IST

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. బాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లుథ్రా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి సుదీర్ఘ వాదనలు వినిపించారు...

CBN Skill Case : స్కిల్ కేసుపై చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం ఇదీ..

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో (Skill Development Case) టీడీపీ అధినేత నారా చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై (Quash Petition ) సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. బాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లుథ్రా.. ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు వాడివేడీగా సాగాయి. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రస్తుతం ఈ కేసులో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేస్తూ సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు.. కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తానని హరీష్ సాల్వే తెలిపారు. సాల్వే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. దీంతో ఈ తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్‌ చేసింది. కాగా ఇవాళ మొత్తం 17 ఏ చంద్రబాబు వర్తిస్తుందా..? లేదా..? అనేదానిపైనే వాదనలు జరిగాయి. అయితే మంగళవారం నాడు వాదనలు మాత్రమే ముగిశాయి. ఇరువురి వాదనలు పరిశీలించడానికి సమయం పడుతుండటంతో శుక్రవారానికి వాయిదా పడింది.


supreme-(2).jpg

హరీష్ సాల్వే ఏం వాదించారు..?

  • చట్ట సవరణను ముందు నుంచి వర్తింపు చేసే అంశంపై వాదనలు వినిపించిన హరీష్‌ సాల్వే

  • చట్టసవరణను ముందు నుంచి వర్తింపచేసే అంశంపై పలు తీర్పులను ఉటంకించిన సాల్వే

  • 2019 నాటి "శాంతి కండక్టర్స్‌" కేసును ప్రస్తావించిన సాల్వే

  • 1964 నాటి రతన్‌లాల్‌ కేసును ప్రస్తావన

  • ఎన్నికల ముందు రాజకీయ కక్ష సాధింపులకు అవకాశం ఉంటుంది

  • రాజకీయ కక్ష సాధింపులను నిరోధించేందుకే 17A ఉంది

  • చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చే అంశాన్ని దయచేసి పరిశీలించండి

  • రిమాండ్‌ సమయంలో చంద్రబాబు చేర్చారు

  • ఎలాంటి పరిస్థితుల్లోనైనా 17ఏ వర్తిస్తుంది

  • 73 ఏళ్ల వయసున్న చంద్రబాబు 40 రోజులుగా జైలులో ఉన్నారు

  • రిమాండ్‌ రిపోర్టు, కౌంటర్‌ అఫిడవిట్లు మొత్తం ఆరోపణలతో నిండి ఉన్నాయి

  • విపక్ష నేతను విచారించడం తమ హక్కుగా ఈ ప్రభుత్వం భావిస్తోంది

Salve-And-Babu.jpg

రోహత్గీపై ధర్మాసనం ప్రశ్నల వర్షం!

  • 482 సెక్షన్ కింద FIR రద్దు కుదరదు : రోహత్గీ

  • అవినీతికి 17A సెక్షన్‌కు సంబంధం లేదు

  • విధానపరమైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవడానికి అధికారులు వెనుకాడకూడదనే ఉద్దేశంతో 17A ద్వారా రక్షణ కల్పించారు

  • అవినీతి చట్టం కింద నమోదైన కేసు చెల్లనప్పుడు మిగతా సెక్షన్స్ కింద కేసు ఎలా చెల్లుతుందని రోహత్గీని ప్రశ్నించిన ధర్మాసనం

  • అవినీతి కేసులో 17A చంద్రబాబుకు వర్తించినా మిగతా సెక్షన్స్‌లో వర్తించదని రోహత్గీ వాదనలు

  • ప్రత్యేక కోర్టుకు ఉన్న అధికారాలు ఏంటని ప్రశ్నించిన ధర్మాసనం

  • అవినీతి కేసులతో పాటు మిగిలిన సెక్షన్ల కింద నమోదైన కేసుల విచారణ అర్హత ప్రత్యేక కోర్టుకు ఉందా? అని ప్రశ్నించిన ధర్మాసనం

  • ప్రత్యేక కోర్టుకు ఆ అధికారాలు ఎక్కడివి అని ప్రశ్నించిన ధర్మాసనం

  • అవినీతి కేసులతో పాటు మిగతా సెక్షన్ల కింద కేసులు నమోదైనప్పుడు వాటన్నింటినీ కలిపి ప్రత్యేక కోర్టు విచారించవచ్చన్న ముకుల్‌ రోహత్గీ

  • సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు మీ పని మీరు చేసుకోవచ్చు కదా.. ఈ దశలో చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని ముకుల్‌ను ప్రశ్నించిన ధర్మాసనం

  • చివరిగా సాక్ష్యాధారాలను బట్టి శిక్ష విధించాలా? లేదా? అనేది కోర్టు నిర్ణయిస్తుంది.. ఇప్పుడు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన ధర్మాసనం

  • సెక్షన్‌ 19 కింద కోర్టు అనుమతి లేకపోతే విచారించలేం అందుకే అరెస్ట్ చేశామన్న ముకుల్‌ రోహత్గీ

  • సుప్రీంలోనే అంతా తేలాలని ఈ దశలో చంద్రబాబు తరపు లాయర్లు కోరడం సమంజసం కాదన్న ముకుల్‌రోహత్గీ

  • ఏదో ఒకరోజు మీరు కూడా అదే విధంగా కోరే అవకాశం ఉందని ముకుల్‌రోహత్గీని ఉద్దేశించి చెప్పిన ధర్మాసనం

  • నేరం జరిగినప్పుడు 17A లేనందున చంద్రబాబుకు అది వర్తించదన్న రోహత్గీ

mukul-rohatgi.jpg

ఫైబర్ కేసులో ఇలా..

మరోవైపు.. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. బాబుపై నమోదైన ఫైబర్‌నెట్ కేసులో (Fibernet Case) ముందస్తు బెయిల్‌ (Anticipatory Bail) ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మంగళవారం నాడు విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది. అంతేకాదు.. అప్పటి వరకూ చంద్రబాబును అరెస్ట్ (CBN Arrest) చేయొద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బాబుకు కాస్త ఊరట లభించినట్లయ్యింది. అయితే.. శుక్రవారం నాడు కచ్చితంగా బెయిల్ విషయంలో శుభవార్తే ఉంటుందని టీడీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

CBN Arrest : ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబుకు ఊరట.. ‘స్కిల్’ సంగతేంటో..!?

Updated Date - 2023-10-17T16:45:14+05:30 IST