AP Politics : ఆట మొదలైంది.. చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. ఆగస్టు-01 నుంచి..!

ABN , First Publish Date - 2023-07-29T21:08:09+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు (TDP Chief Chandrababu) విజనరీగా పేరున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని ఏర్పాటు చేయాలని చేయాల్సిన కుట్రలు, కుతంత్రాలన్నీ వైసీపీ (YSR Congress) చేసుకుంటూ పోతోంది. అయితే..

AP Politics : ఆట మొదలైంది.. చంద్రబాబు అదిరిపోయే మాస్టర్ ప్లాన్.. ఆగస్టు-01 నుంచి..!

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు (TDP Chief Chandrababu) విజనరీగా పేరున్న సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని ఏర్పాటు చేయాలని చేయాల్సిన కుట్రలు, కుతంత్రాలన్నీ వైసీపీ (YSR Congress) చేసుకుంటూ పోతోంది. అయితే.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ ఏం చేసింది..? ప్రజలకు చేసిందేంటి..? ఏయే రంగంలో ఏ మాత్రం ఒరగబెట్టింది..? ఎంత అప్పు చేసింది..? ప్రాజెక్టుల పరిస్థితేంటి..? రాజధాని సంగతేంటి..? ఇలా ఏ ఒక్కటీ వదలకుండా అన్ని విషయాలను ఏపీ ప్రజానికానికి తెలియజేడానికి హైటెక్ పద్ధతిని ఎంచుకున్నారు.! ఇప్పటికే ప్రాజెక్టుల పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ చేసిన చంద్రబాబు.. ఇక తక్కువ ఖర్చుతో ఎక్కు మందికి.. ప్రతి పల్లెకూ మెసేజ్ చేరేలా సాంకేతికతను సమకూర్చుకుంటున్నారు. ఇదలా ఉంచితే.. ఆగస్టు-01 నుంచి చంద్రబాబు ఒక అదిరిపోయే ప్లాన్‌తో (CBN Master Plan) ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ దెబ్బతో వైసీపీ బండారం మొత్తం బయటపడిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


chandrababu-projects.jpg

మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..!

రానున్న ఎన్నికల్లో వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకూడదని.. ఇప్పటికే రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు చెబుతుంటారు. అయితే.. ప్రజాక్షేత్రంలో వైసీపీ పరిస్థితేంటో తేల్చడానికి మాజీ సీఎం అదిరిపోయే ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆగస్టు-01 నుంచి సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ‘తెలుగు నేలకు జలహారం’ (Telugu Nelaku Jalaharam) పేరుతో ‘పెన్నా టూ వంశధార’ వరకు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు పర్యటించనున్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులను క్షేత్ర స్థాయిలో చంద్రబాబు, టీడీపీ నేతలు పరిశీలించనన్నారు. ఈ జలహారం యాత్ర కర్నూలు జిల్లాలో మొదలై నుంచి శ్రీకాకుళం వరకు సాగనున్నది. పెన్నా నుంచి వంశధార (Penna To Vamsadhara) వరకు ఉన్న కీలక ప్రాజెక్టు పనులను బాబు పరిశీలించనున్నారు. ఇరిగేషన్ రంగంలో జగన్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ రోడ్ షోలు, సభలు నిర్వహించేందుకు టీడీపీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర స్వరూపాన్ని మార్చే నదుల అనుసంధానం ప్రక్రియకు జగన్ ప్రభుత్వం చేసిన నష్టంపై ప్రశ్నిస్తూ చంద్రబాబు పర్యటన జరగనున్నది.ఆగస్టు-01న కర్నూలు జిల్లా నుంచి చంద్రబాబు యాత్ర (CBN Yatra) ప్రారంభం కానుంది. మొదటి నాలుగు రోజుల్లో కర్నూలు, కడప, అనంతపురం చిత్తూరు జిల్లాల్లో (రాయలసీమ జిల్లాలు) ముఖ్యమైన ప్రాజెక్టులను బాబు సందర్శించనున్నారు. ఇలా చేయడంతో ఇరిగేషన్ రంగాన్ని, ప్రాజెక్టులను జగన్ ఏవిధంగా భ్రష్టు పట్టించారనే విషయాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన్న మాట. ఇదేగానీ విజయవంతమైతే వైసీపీ చుక్కలేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Jagan-projects.jpg

ఆట మొదలైంది..!

మొత్తానికి చూస్తే.. ఇన్నిరోజులు ఏపీ అభివృద్ధి గురించి ఎక్కడా ఎలాంటి చ‌ర్చ జ‌ర‌గ‌కుండా వైసీపీ భావోద్వేగాల‌తో రాజ‌కీయం చేస్తూ వచ్చింది. అయితే ప్రభుత్వం ఏం చేస్తోంది..? అనే విషయాలను అధిగ‌మించ‌డానికి చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా టీడీపీ హయాంలో ఏయే ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది..? టీడీపీ హయాంలో ఎన్నెన్ని ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి..? అనే విషయాలను పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా తెలియజేసిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా ప్రాజెక్టుల దగ్గరికే వెళ్లి సందర్శించాలని నిర్ణయించడం మంచి నిర్ణయమే. ప్రతి రోజూ ప్రాజెక్టుల వ‌ద్దకెళ్లి అక్కడే నిద్ర చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సామాన్యుల‌కు సైతం అర్థమ‌య్యేలా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్లక్ష్యాన్ని చెప్పే ప్రయ‌త్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదే విధంగా.. చంద్రబాబు ప్రాజెక్టుల సందర్శనను ప్రతి ప‌ల్లెకు చేరేలా పీ4 ఎల్ ఈడీ డిస్‌ప్లేతో కూడిన వాహ‌నాల‌ను పంప‌నున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులు ఒక్కటే కాదు.. అన్ని రంగాల విషయంలోనూ జగన్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారట.

CBN.jpg


ఇవి కూడా చదవండి


TS Politics : కృష్ణయ్యకు కాంగ్రెస్ కీలక హామీ.. వైఎస్ జగన్ ఒప్పుకుంటారా.. ఇప్పుడిదే చర్చ..!?


Jaya SudhaBJP : జయసుధకు కాషాయ కండువా కప్పి.. ఆ ఇద్దరికీ చెక్ పెట్టాలని కిషన్ రెడ్డి ప్లాన్.. రచ్చ.. రచ్చ!


Politcal BRO : ‘బ్రో’ మూవీలో శ్యాంబాబు డ్యాన్స్‌పై పొలిటికల్ దుమారం.. మంత్రి అంబటికి దిమ్మదిరిగే కౌంటరిచ్చిన నటుడు పృథ్వీ


YSRCP : వైఎస్ జగన్‌కు మరో తలనొప్పి.. మంత్రి వర్సెస్ ఎంపీ.. ఫొటో తెచ్చిన తంట..!


AP Politics : సీఎం జగన్ రెడ్డితో భేటీ కానున్న బాలినేని.. విజయసాయిని కాదని పదవి ఇస్తారా..!?


YSRCP Vs TDP : వైఎస్ జగన్‌కు ఝలక్.. మాజీ మంత్రి నారాయణ ఇంటిబాట పడుతున్న వైసీపీ నేతలు


Updated Date - 2023-07-29T21:21:29+05:30 IST