TDP Vs YSRCP : రూటు మార్చిన చింతమనేని.. స్వయంగా ఫోన్ కాల్ చేసి.. ఓ రేంజ్‌లో..!?
ABN , First Publish Date - 2023-04-23T16:16:28+05:30 IST
మనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar).. ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన ఈయన ఈ మధ్య అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో..
చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar).. ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన ఈయన ఈ మధ్య అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో (Social Media) ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నారు. టీడీపీ (Telugudesam) అధికారంలో ఉన్నప్పుడూ.. ఇప్పుడు వైసీపీ (YSR Congress) అధికారంలో ఉన్నా చింతమనేని మాత్రం ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేనని ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా సరే జగన్ సర్కార్ కక్ష సాధిస్తోందని చింతమనేని అభిమానులు చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఇక రూటు మార్చి.. ప్రభుత్వం తప్పొప్పులను ఎత్తిచూపుతూ నిలదీస్తున్నారు. ఇప్పటికే పలు ప్రజా సమస్యలను లేవనెత్తి పరిష్కార మార్గం చూపించిన చింతమనేని.. తాజాగా ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలు సర్లేవని ఫైర్ అయ్యారు. ఇంతకీ చింతమనేనని ఏమన్నారు..? ఎందుకిలా అనాల్సి వచ్చిందనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే..?
వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘నాడు-నేడు’లో (Nadu-Nedu) భాగంగా ఆస్పత్రులు, ప్రభుత్వ పాఠశాలలు రూపు రేఖలు మారాయని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నప్పటికీ గ్రౌండ్ లెవల్‌లో మాత్రం పరిస్థితులు ఇదిగో ఇలా ఉన్నాయంటూ టీడీపీ ఛాలెంజ్ చేసి మరీ సెల్ఫీలు, వీడియోలతో సహా బయటపెడుతోంది. ముఖ్యంగా ఏలూరు ప్రభుత్వా్స్పత్రిలో సౌకర్యాల లేమిపై జగన్ సర్కార్‌ను చింతమేనని నిలదీశారు. స్వయంగా ఆస్పత్రి సూపరిడెంట్‌కు ఫోన్ చేసిన చింతమేనని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ‘కాదు.. సూపరిడెంట్‌గారు నేను అడుగుతున్నానని మీరు బాధపడొద్దు. నేను ప్రజల తరఫున మాత్రమే అడుగుతున్నా.. ఈ విషయాల్లో నేనేమీ రాజకీయాలు చేయట్లేదు. మీకు కానీ.. మీ ఉద్యోగులకు కానీ జీతాలు ఏమైనా ఆపుతున్నారా..?. ఆస్పత్రికి సంబంధించి ఏ సమస్యలు వచ్చినా జరగవ్ కానీ.. మీకు మాత్రం అన్నీ జరిగిపోతున్నాయ్ కదా. జీతాలు తీసుకుంటున్నప్పుడు ఆస్పత్రిలో మంచి సదుపాయాలు ఎందుకు కల్పించరు..?.ఈ ఆస్పత్రి కోసం ఇప్పటికిప్పుడు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు. మా టీడీపీ ప్రభుత్వం హయాంలోనే చంద్రబాబు (Chandrababu) గారు శంకుస్థాపన చేశారు. ఇవాళ మీరు (వైసీపీ) వచ్చి పొడిచిందేమీ లేదు. ఎప్పుడూ లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి..?. అసలు ఈ వార్డులు చూడండి ఎలా ఉన్నాయో.. ఒకసారి మీరు వచ్చి గంట కూర్చోని వెళ్లండి.. పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. జిల్లా ఆస్పత్రిని మెడికల్ కాలేజీగా మారిస్తే నిధులివ్వరా..?. డీఎంఈ నుంచి ఫండ్స్ తెచ్చుకోండి. డీఎంఈ ఏమైనా తెలంగాణలో ఉందా..?’ అని సూపరిడెంట్‌ను ఫోన్‌లోనే చింతమనేని నిలదీశారు. అయితే ప్రభాకర్ మాటలకు అవతలి వ్యక్తి నుంచి కనీసం సమాధానం చెప్పడానికి ఏమీ లేకపోవడం గమనార్హం.
మంత్రిగారు ఏం చేస్తున్నట్లు..!?
‘ ఆస్పత్రుల్లో ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజిని (Vidadala Rajini) ఏం చేస్తున్నారు..?. మంత్రి మేకప్ వేసుకుని తిరుగుతోందా..? ’ అని రజినిపై చింతమనేని తీవ్ర స్థాయిలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. సోమవారం నాడు ఏలూరు ఆస్పత్రి ముందు ధర్నా చేస్తానని ప్రభుత్వాన్ని ప్రభాకర్ హెచ్చరించారు. అయినా.. విలేజీ క్లీనిక్‌లో, ఫ్యామిలీ డాకర్ట లాంటి కొత్త కొత్త కార్యక్రమాలు చేపడుతున్న జగన్ సర్కార్ (Jagan Govt).. ఉన్న పెద్దాస్పత్రుల్లో ఇలా కనీస సౌకర్యాలు సరిగ్గా కల్పించలేకపోవడం గమనార్హం. ప్రభాకర్ కామెంట్స్‌పై వైసీపీ నేతల నుంచి ముఖ్యంగా మంత్రి రజిని నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే.