TS Govt : తీవ్ర భావోద్వేగానికి లోనైన గవర్నర్ తమిళిసై.. అసలేం జరిగిందంటే..!
ABN , First Publish Date - 2023-03-06T21:25:23+05:30 IST
సోమవారం సాయంత్రం రాజ్‌భవన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వివిధ..
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) మరోసారి చురకలు అంటించారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన మహిళా నిపుణులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు, నటీమణులు నటి కుష్బు (Kushboo), పూనమ్ కౌర్‌లు (Poonam Kaur) హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తమిళిసై మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ మేము మహిళా మంత్రులు, మేయర్లు, అధికారులకు ఇన్విటేషన్ పంపించాము. కానీ వారు ఎవరు ఇక్కడ లేరు రాలేదు. తెలంగాణలో ఇంకా ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. దీనిపై గతంలో నేను చాలాసార్లు బాహాటంగా మాట్లాడాను. ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన ప్రీతి మరణం అత్యంత బాధాకరం. ఎవరెన్ని చెప్పినా ప్రీతి మరణాన్ని పూడ్చలేము’ అని తమిళిసై తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
కేసీఆర్ సర్కార్‌పై చురకలు..
తెలంగాణలో గవర్నర్‌గా తన మీద.. మహిళల మీద జరుగుతున్న దాడులపై ఈ వేదిక నుంచి తమిళిసై స్పందించారు. తానూ ఒక సక్సెస్‌ఫుల్ డాక్టర్‌గా ప్రస్తుతం గవర్నర్‌గా పరిధికి లోబడి పని చేస్తున్నానని తేల్చిచెప్పారామె. మహిళల పట్ల వివక్ష అనేది సరికాదని.. ముందు మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. తన మీద ఎవరెన్ని రకాలుగా విమర్శలు చేసినా.. వివక్ష చూపినా వెనక్కి తగ్గనంటూ గవర్నర్ మరోసారి చెప్పుకొచ్చారు.
హేళనకు గురైనా..!
‘ఉమెన్స్ డే ఒకరోజు కాదు ప్రతి రోజు మహిళలకు గౌరవం ఇవ్వాలి. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న మహిళలలో ఉన్న ప్రతిభను గుర్తించి వెలుగులోకి తెచ్చారు. అన్ని విభేదాలు మరచి మనం కలవడం మన సంప్రదాయం. కానీ ఇప్పుడూ ఆ పరిస్థితి మారింది. ఆహ్వానాలుకు విలువల ఇవ్వడం లేదు. గిరిజన మహిళలను రక్త హీనత వెంటాడు తుండే.. ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారాయి. గర్భస్థ గిరిజన మహిళలు ఇబ్బందులు పడకుండా అంబులెన్స్‌ను డొనేట్ ిచేశాం. గిరిజన చిన్నారుల పోషకాహార లోపం ఉన్నందున కోడిగుడ్లు అందించాను. మహిళా దర్బార్ నిర్వహించి.. వారి సమస్యలను పరిష్కరించాం. మెడికో విద్యార్థి ప్రీతి ఎడ్యుకేషన్‌లో సాధించిన ప్రతిభను మరువలేనిది. నాకు జరిగిన సంఘటన విషాదకరం. ప్రీతిని ఆదుకోవడానికి వెళ్లిన నన్ను అవమానించారు. తెలంగాణ అత్యంత స్థాయిలో ఉన్న మహిళను అవమానించిన వాళ్ళను అందలాలు ఎక్కిస్తోంది. దీంతో తెలంగాణ ఆడబిడ్డలకు ఎలాంటి సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారు. నేను వచ్చిన ప్రాంతం విలినార్ వీర మహిళలకు ప్రసిద్ది. అలాంటి పరిస్థితి నుంచి వచ్చిన నేను ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాను. సోషల్ మీడియాలో నన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయినా నేను తట్టుకుంటున్నాను. ఎవరి కోసమో మీరు కాంప్రమైజ్ అవ్వకండి. నన్ను ఎంతో విమర్శిస్తున్నారు. అయినా నేను తెలంగాణ ప్రజల కోసం నిలబడతాను. హేళన గురైనా నేను మహిళల కోసం పని చేస్తూనే ఉంటాను. నన్ను తిట్టిన వారిని శిక్ష వేయకుండా వారికి అవార్డులు, రివార్డులు ఇస్తున్నారు. ఇప్పటి వరకూ వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటన్నింటినీ పరిష్కరిస్తున్నాం’ అని తమిళిసై చెప్పుకొచ్చారు.