Home » Tamilisai
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సైతో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సమావేశమయ్యారు. శుక్రవారం చెన్నైలోని తమిళిసై నివాసానికి వెళ్లిన అన్నామలై.. ఆమెతో భేటీ అయ్యారు. అనంతరం అన్నామలై ఎక్స్ వేదికగా స్పందించారు. తమిళిసైతో భేటీ కావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరిగిన సందర్భంగా వేదికపై ఆసీనులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనను మందిలించారంటూ జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై వివరణ ఇచ్చారు. ఆయన తననేమీ మందలించలేదని, పార్టీ కోసం పనిచేయాలంటూ సూచనలు ఇచ్చారని స్పష్టం చేశారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై జరిగిన ఒక ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు డాక్టర్ తమిళిసై
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందు.. అదే వేదికపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు.
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయారు. మార్చి 18న గవర్నర్ పదవికి రాజీనామా చేసి.. ఆమె సొంత నియోజకవర్గం చెన్నై సౌత్ నుంచి బీజేపీ
గవర్నర్ పదవికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీకి సేవలందించాలనే కష్టమైన నిర్ణయాన్ని ఇష్టపడే తీసుకున్నానని తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(Dr. Tamilisai Soundararajan) వ్యాఖ్యానించారు.
Tamilisai Soundararajan: తెలంగాణ, పుదుచ్చేరిల మాజీ గవర్నర్(Ex Governor) తమిళి సౌందరరాజన్(Tamilisai Soundararajan) బీజేపీ(BJP)లో చేరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆధ్వర్యంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.
మూడేళ్ల పాటు తెలంగాణకు గవర్నర్‌గా వ్యవహరించిన తమిళిసై రాజీనామా తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. అసలెందుకు ఆమె రాజీనామా చేశారు? గత సీఎం కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్న సమయంలో కూడా రాజీనామా చేయాలని కూడా ఆమె భావించలేదు.
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో పరేడ్ గ్రౌండ్స్‌లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అలాగే పబ్లిక్ గార్డెన్స్‌లో కూడా రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్నాయి.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి సహా మరో నలుగురు సభ్యుల రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు.