Karnataka election results: కర్ణాటక ఫలితాలపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. తెలంగాణ ఎన్నికలపై...
ABN , First Publish Date - 2023-05-13T16:13:24+05:30 IST
కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka election results) తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని, కాంగ్రెస్ పార్టీకి సానుకూలమవుతాయని విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలు (Karnataka election results) తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని, కాంగ్రెస్ పార్టీకి సానుకూలమవుతాయని విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కర్ణాటక ప్రజలను వినోదపరచడంలో ‘ది కేరళ స్టోరీ’ ఏవిధంగా విఫలమైందో.. అచ్చం అదేవిధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎలాంటి ప్రభావం చూపబోవు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. వెగటు పుట్టించే, విభజన రాజకీయాలను తిప్పికొట్టిన కర్ణాటక ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరింత గొప్ప భారత్ కోసం పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన విషయంలో హైదరాబాద్, బెంగళూరు నగరాలను ఆరోగ్యకరంగా పోటీపడనిద్దామని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త ప్రభుత్వనికి నా శుభాకాంక్షలు అని కేటీఆర్ అభినందనలు తెలిపారు.
కాగా.. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఈ ఏడాది చివర జరగబోయే తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. అక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక్కడ కాంగ్రెస్‌కు సానుకూలమవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ కేడర్‌లో జోష్ నిండుతుందని అంచనాలున్నాయి. మరి ఈ విశ్లేషణలు ఎంతవరకు నిజమవుతాయో వేచిచూడాలి.