Modi Cabinet Reshuffle : మోదీ కేబినెట్‌ నుంచి ఔటయ్యేది ఎవరు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఇద్దరికీ ఛాన్స్..!?

ABN , First Publish Date - 2023-07-10T17:59:01+05:30 IST

కేంద్ర కేబినెట్‌లో (Union Cabinet) కొత్త నేతలకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. జూలై-12న కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని గత వారం, పదిరోజులుగా బీజేపీ అగ్ర నాయకత్వం సుదీర్ఘ కసరత్తు పూర్తయ్యింది...

Modi Cabinet Reshuffle : మోదీ కేబినెట్‌ నుంచి ఔటయ్యేది ఎవరు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఇద్దరికీ ఛాన్స్..!?

కేంద్ర కేబినెట్‌లో (Union Cabinet) కొత్త నేతలకు చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. జూలై-12న కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణ చేయాలని గత వారం, పదిరోజులుగా బీజేపీ అగ్ర నాయకత్వం సుదీర్ఘ కసరత్తు పూర్తయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా (Amit Shah), జాతీయ అధ్యక్షుడు నడ్డా (JP Nadda) , సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతో‌ష్‌తో (BL Santhosh) పాటు పలువురు అగ్రనేతలు సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈనెల 13-14 తేదీల్లో ప్రధాని మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్తున్నందున.. ఆలోపే మంత్రివర్గంలో (Modi Cabinet) మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై కసరత్తు పూర్తయిందని, అందుకు అనుగుణంగానే పలువురు మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర కేబినెట్‌లోకి తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దర్ని తీసుకోవాలని అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


PM-Modi.jpg

కేబినెట్‌ నుంచి ఔటయ్యేది ఎవరు..?

ఎల్లుండి కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ ఉండటంతో రేపు సాయంత్రం కల్లా మంత్రులంతా ఢిల్లీ (Delhi) రావాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో మంత్రులంతా ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే మంత్రులుగా ఉన్న ప్రహ్లాద్ జోషి, భూపేంద్ర యాదవ్, అశ్వనీ వైష్ణవ్, మన్షుక్ మాండవియాలను ఎన్నికల ఇంఛార్జీలుగా అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. అయితే కేబినెట్ నుంచి వీరందరికీ ఉద్వాసన పలికే అవకాశాలు మెండుగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమించడంతో.. కేంద్ర కేబినెట్ నుంచి ఆయన్ను తొలగించే ఛాన్స్ ఉంది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇంఛార్జిగా నియమించే అవకాశం ఉన్నందున.. స్థాన చలనం ఉంటుందని తెలుస్తోంది. దీంతో పాటు మహారాష్ట్ర నుంచి ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గానికి కేబినెట్‌లో చోటు కల్పించాలని అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు తెలియవచ్చింది. ఇక ఎల్‌జేపీ నుంచి చిరాగ్ పాశ్వాన్‌కు అవకాశం ఉండగా.. ఆర్‌ఎల్‌డీ నుంచి జయంత్ చౌదరికి కూడా బీజేపీ గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది.

Bandi-Sanjay.jpg

తెలుగు రాష్ట్రాల నుంచి..?

తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పట్టు పెంచుకొని అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దర్ని కేబినెట్‌లోకి తీసుకోవాలని పెద్దలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay), లక్ష్మణ్, సోయం బాపూరావు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన.. ఎక్కడో ఉన్న పార్టీని బీఆర్ఎస్‌తో (BRS) ఢీ అంటే ఢీ అనే స్థాయికి తీసుకొచ్చిన బండి వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తొలగించినప్పట్నుంచీ కేంద్ర మంత్రి పదవి దక్కబోతోందని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య ఢిల్లీకి పిలిపించుకుని పెద్దలు మాట్లాడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం బండి.. ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

CM-Ramesh.jpg

- ఇక ఏపీ నుంచి సీఎం రమేశ్‌కు కేబినెట్‌లో అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే కచ్చితంగా ఒకర్ని కేబినెట్‌లోకి తీసుకోవాలని అగ్రనాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. రమేశ్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. కాగా.. 2021 జూలై-7 తర్వాత మోదీ తన మంత్రివర్గాన్ని విస్తరించలేదన్న విషయం తెలిసిందే. అప్పుడు ప్రకాశ్‌ జావడేకర్‌, రవిశంకర్‌ప్రసాద్‌ సహా 12 మంది మంత్రులకు ఉద్వాసన పలికి 36మంది కొత్తవారికి స్థానం కల్పించడం జరిగింది. ఈసారి మార్పులు భారీగా లేకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటాయని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.. ఏం జరుగుతుందో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


Rajyasabha : తెలుగు రాష్ట్రాల నుంచి కీలక నేతను రాజ్యసభకు తీసుకుంటున్న బీజేపీ.. ఆ ‘తెలుగోడు’ ఎవరంటే..!?


Rajyasabha : ఎన్నికల ముందు బీజేపీ వ్యూహాత్మక అడుగులు.. రాజ్యసభకు ‘తెలుగోడు’..!


Bandi Sanjay : ఎంపీ విజయేంద్రప్రసాద్‌తో బండి సంజయ్‌ భేటీ.. మరోసారి హాట్ టాపిక్..!


Pawan Varahi Yatra : పవన్ ‘వారాహి’ యాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైసీపీలో దీని గురించే చర్చ.. మార్పు మొదలైనట్లే..!


YS Sharmila : వైఎస్సార్ జయంతి ముందురోజే వైఎస్ షర్మిల ఆసక్తికర నిర్ణయం.. అదేంటో తెలిస్తే..!


Modi TS Tour : మోదీ వరంగల్ వచ్చివెళ్లాక తెలంగాణ బీజేపీలో ఒకటే గుసగుస.. దేని గురించంటే..?


Jagan Vs Sharmila : వైఎస్సార్ జయంతి సాక్షిగా వైఎస్ జగన్ రెడ్డి వర్సెస్ షర్మిల.. ప్రత్యేకంగా ఫోన్లు చేసి మరీ..!


BRS Mla Candidates : షాకింగ్ సర్వే.. ఈ జిల్లాల నుంచి ఇంతమంది సిట్టింగ్‌లకు కేసీఆర్ టికెట్లు ఇవ్వట్లేదా.. వణికిపోతున్న ఎమ్మెల్యేలు..!?


Updated Date - 2023-07-10T18:05:59+05:30 IST