Avinash Reddy: వివేకా కేసులో అవినాశ్ అరెస్ట్‌ తప్పదని చెప్పేందుకు పది కారణాలు..!

ABN , First Publish Date - 2023-05-16T11:48:56+05:30 IST

రాజకీయ ప్రకంపనలు రేపుతున్న వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఈరోజు మరోసారి సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో..

Avinash Reddy: వివేకా కేసులో అవినాశ్ అరెస్ట్‌ తప్పదని చెప్పేందుకు పది కారణాలు..!


రాజకీయ ప్రకంపనలు రేపుతున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కీలక సూత్రధారిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి (Kadapa YCP MP Avinash Reddy) ఈరోజు మరోసారి సీబీఐ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉండటంతో ఏం జరగనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సీబీఐ విచారణకు (Avinash Reddy CBI Enquiry) హాజరుకాలేనని, నాలుగు రోజులు గడువు కావాలని అవినాశ్ కోరినప్పటికీ సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అవినాశ్ అరెస్ట్ తప్పదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. దేశంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పటిదాకా ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి తరహాలో సాగిన అవినాశ్ రెడ్డి విచారణ ఈరోజు అరెస్ట్‌తో ముగియనున్నదని భావిస్తున్నారు. అవినాష్‌రెడ్డిని కస్టోడియల్‌ విచారణ చేస్తేనే ఈ కేసులోని కుట్రకోణం వెలికి తీయడం సాధ్యమని సీబీఐ భావిస్తోంది. అసలు అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ అవడానికి గల కారణాలేమిటో ఒకసారి చూద్దాం.

రీజన్‌ 1:

2021లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులోనే అవినాష్‌రెడ్డి పాత్ర గురించి సీబీఐ స్పష్టంగా పేర్కొంది. వివేకా మృతదేహానికి, కుట్లు వేయించడం, రక్తపు మడగుగును శుభ్రం చేయించడం, ఆధారాలను ధ్వంసం చేయడంలో అవినాష్‌రెడ్డిదే కీలక పాత్ర అని పేర్కొంది.

రీజన్‌ 2:

అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి కలిసి వివేకా హత్యను గుండెపోటు డ్రామాగా చిత్రీకరించారని సీబీఐ అభియోగం

రీజన్‌ 3:

రాజకీయ లబ్ధి కోసమే వివేకాహత్యకు కుట్ర అవినాష్‌రెడ్డి కుట్ర పన్నారని సీబీఐ ప్రాథమిక నిర్థారణ

రీజన్‌ 4:

వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించేందుకు అవినాష్‌రెడ్డి అండ్‌ కో కుట్ర పన్నారని, కడప ఎంపీ సీటు షర్మిలకు గానీ, విజయలక్ష్మి గాని ఇవ్వాలని వివేకానందరెడ్డి చెప్పడం అవినాష్‌రెడ్డికి నచ్చలేదని సీబీఐ పేర్కొంటోంది.

రీజన్‌ 5:

వివేకా హంతకులందరూ అవినాష్‌రెడ్డి ఇంట్లో సమావేశమైనట్టు గూగూల్‌ టేకవుట్‌ సాంకేతిక ఆధారాలు చూపడం. ఫోరెన్సిక్‌ లాబ్‌ ఆ ఆధారాలను నిర్థారించడం.

రీజన్‌ 6:

వివేకాహత్య అనంతరం అవినాష్‌రెడ్డి చేసిన ఫోన్‌ కాల్స్‌ లిస్ట్‌... ఈ లిస్టులో సీఎం జగన్‌రెడ్డి, ఆయన భార్య భారతీరెడ్డి కూడా ఉన్నారు. ఈ కాల్స్‌ లిస్టు గుట్టు కూడా సీబీఐ తేల్చనుంది.

రీజన్‌ 7:

వివేకా హత్యలో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డే కీలక సూత్రధారులు. ఇప్పటికే భాస్కర్‌రెడ్డి అరెస్ట్. ఇప్పుడు అవినాష్‌ వంతు..

రీజన్‌ 8:

ఇప్పటిదాకా ఎవరికీ జవాబుదారీగా లేని సీబీఐ విచారణ సుప్రీమ్‌ కోర్టుకు జవాబుదారీగా మారింది. జూన్‌ 30లోగా కేసు సంగతి తేల్చేయమని సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో విస్తృత కుట్ర కోణాన్నీ వెలికి తీయమంది. అవినాష్‌రెడ్డి అరెస్ట్‌తోనే విస్తృత కుట్ర కోణాన్ని వెలికితీయడం సాధ్యమని సీబీఐ భావిస్తోంది.

రీజన్‌ 9:

అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ చేసి తీరతామని ఇప్పటికే సీబీఐ హైకోర్టులో స్పష్టం చేసింది.

రీజన్‌ 10:

అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం, తన పని తాను చేసుకోవచ్చని తేల్చి చెప్పిన హైకోర్టు

Updated Date - 2023-05-16T11:55:18+05:30 IST