Share News

Ponnala Resign : పొన్నాల రాజీనామాపై రేవంత్ రెడ్డి రియాక్షన్ చూశారో..?

ABN , First Publish Date - 2023-10-13T21:54:57+05:30 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు (TS Congress) బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah).. హస్తం పార్టీకి రాజీనామా చేశారు..

Ponnala Resign : పొన్నాల రాజీనామాపై రేవంత్ రెడ్డి రియాక్షన్ చూశారో..?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు (TS Congress) బిగ్ షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah).. హస్తం పార్టీకి రాజీనామా చేశారు. సుమారు 45 ఏళ్లపాటు కాంగ్రెస్‌లో ఉన్న పొన్నాల మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి.. 12 ఏళ్లు మంత్రిగా పనిచేసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా పార్టీ శ్రేణులు కంగుతిన్నాయి. ఈయన రాజీనామాపై ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద చర్చే జరుగుతోంది. ఢిల్లీ వేదికగా పొన్నాల రాజీనామాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) స్పందించి.. సంచలన వ్యాఖ్యలు చేశారు.


PONNALA.jpg

ఇదే అతి పెద్ద నేరం!

పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. డీఎస్, కేశవరావు కాంగ్రెస్‌ను వదిలివెళ్లారు.. పోయేవాళ్ళు పోతానే ఉంటారు. 40 ఏళ్లు పార్టీలో ఉండి ఇప్పుడు పార్టీ మారాడానికి పొన్నాలకు సిగ్గుండాలి. ఇది పొన్నాల చేసిన అతి పెద్ద నేరం. పీసీసీ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా పనిచేశావు. అయినా.. సచ్చే ముందల పార్టీ మారడం ఏంది..? ఇదేం రోగం. ప్రజల్లో ఉంటే ప్రజాసేవ చేస్తే ఎందుకు గెలవవు..?. పొన్నాల పీసీసీగా ఉండి 40వేల ఓట్ల తో ఓడిపోయారు. రెండోసారి టికెట్ ఇస్తే 50,000 వేల ఓట్లతో ఓడిపోయారు. అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు.. ఏ కారణంతో ఆ చిల్లర కామెంట్ చేశారు. జనగాం టికెట్‌పై ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేస్తే అందులో పొన్నాల లక్ష్మయ్య ఒకరు. పార్టీని దెబ్బతీయడానికి.. పార్టీని బలహీనపరచడానికి, ప్రజల్లో పార్టీని పలచన చేయడానికే పొన్నాల ఈ నిర్ణయానికి వచ్చారు. కార్యకర్తలకు క్షమాపణ చెప్పి బేషరతుగా రాజీనామాను ఉపసంహరించుకోవాలి. అన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చాం. బీఆర్ఎస్ కంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తాంఅని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

revanth-congress.jpg

ఎవడైనా అంటారా..?

రేవంత్ రెడ్డి పైసలు తీసుకున్నాడని ఎవరైనా అన్నం తినే వాళ్ళు అంటారా..?. రేవంత్ రెడ్డి ఒక్కడే టికెట్లు ఇవ్వడు.. ఒక ప్రాసెస్ ప్రకారం టికెట్లు ఇస్తాం. సీఈసీ అనేది కాంగ్రెస్‌లో ముఖ్యమైనది.. వాళ్లే టికెట్లు అభ్యర్థులను ఖరారు చేస్తారు. 50 శాతం సీట్లు కొలిక్కి వచ్చాయి. మిగిలినవి తొందర్లోనే ఖరారు చేస్తాం. విడతలవారీగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బస్సు యాత్ర ఉంటుంది. దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ పైన ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నూటికి నూరుశాతం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 75 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. డిసెంబర్-09న ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది మధ్యలో ఆరు గారెంటీలపై సంతకం పెడతాంఅని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

congress.jpg

Big Breaking : ఫైబర్‌నెట్ కేసులో జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టు షాక్.. వైసీపీలో టెన్షన్!

Updated Date - 2023-10-13T21:58:13+05:30 IST