Revanth Video Viral : బాబోయ్.. రేవంత్ చెప్పిన ఇద్దరు హీరోయిన్ల కథ విన్నారా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఎవరేదో మీరే తేల్చండి..!
ABN , First Publish Date - 2023-05-08T18:17:59+05:30 IST
అవును.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ప్రెస్‌మీట్‌లో భాగంగా ఇద్దరు హీరోయిన్ల (Heroines) గురించి ప్రస్తావన తెచ్చారు. రేవంత్ ఉండేది రాజకీయాల్లో కదా ఇక సినిమాలు (Cinema), హీరోయిన్లు గురించి ఆయనకేంటి పనని అనుకుంటున్నారా..? అవునండోయ్ ఇప్పటి వరకూ సామెతలు జతచేసి మరీ విమర్శించే రాజకీయ నేతలు (Political Leaders) ఇప్పుడు రూటు మార్చారు...
అవును.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) ప్రెస్‌మీట్‌లో భాగంగా ఇద్దరు హీరోయిన్ల (Heroines) గురించి ప్రస్తావన తెచ్చారు. రేవంత్ ఉండేది రాజకీయాల్లో కదా ఇక సినిమాలు (Cinema), హీరోయిన్లు గురించి ఆయనకేంటి పనని అనుకుంటున్నారా..? అవునండోయ్ ఇప్పటి వరకూ సామెతలు జతచేసి మరీ విమర్శించే రాజకీయ నేతలు (Political Leaders) ఇప్పుడు రూటు మార్చారు. అప్పుడప్పుడు సినీ యాక్టర్ల (Cine Actors) గురించి మాట్లాడితే.. అది కూడా పోలికలు, సినిమా డైలాగ్స్ కొట్టి మరీ చెబితేగానీ సెట్టయ్యేలా లేవని తెలంగాణ రాజకీయ నేతలు నిరూపిస్తున్నారు. ఇంతకీ మీడియా మీట్‌లో రేవంత్ రెడ్డి ఏమన్నారు..? నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియోలో అసలేముంది..? అనే ఇంట్రస్టింగ్ విషయాలపై ప్రత్యేక కథనం..
అసలేం జరిగింది..!?
దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అందులోనూ తెలంగాణలో (Telangana) చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్లు, అవాకులుచెవాకులు మామూలుగా ఉండవ్. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మొదలుకుని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth), బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) వరకూ ఒకరిపై ఒకరు ఏ రేంజ్‌లో విమర్శలు, డైలాగ్‌లు పేలుస్తుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదేమో. అయితే.. ఎప్పుడూ విమర్శలేనా ఇప్పుడు కాస్త డిఫరెంట్‌గా మాట్లాడుదామని రేవంత్ రెడ్డి అనుకున్నారేమో కానీ బీజేపీని టార్గెట్ చేస్తూ హీరోయిన్ల ప్రస్తావన తెచ్చారు. ప్రెస్‌మీట్‌లో చాలా సీరియస్‌గా రాజకీయాల గురించి మాట్లాడుతున్న టైమ్‌లో సడన్‌గా ఇలా మాట్లాడటంతో కొందరు మీడియా ప్రతినిధులు అవాక్కయితే.. ఇంకొందరేమో నవ్వేసి ఊరుకున్నారు. రేవంత్ ప్రస్తావించిన ఆ ఇద్దరు హీరోయిన్లు మరెవరో కాదండోయ్.. ఒకరు ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai), మరొకరు కల్పనారాయ్ (Kalpana Rai).. ఈ ఇద్దర్నీ పెళ్లితో (Marriage) కూడా ముడిపెట్టారు. తెలంగాణలో హాట్ కేకులుగా మారిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasa Reddy) , జూపల్లి కృష్ణారావులను (Jupally Krishna Rao) పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి కానీ.. ఈ ఇద్దరూ మాత్రం ఇంతవరకూ భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోలేదు. ఢిల్లీ పెద్దల ఆదేశాలతో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా ఉన్న సీనియర్ నేత ఈటల రాజేందర్ (Etela Rajender).. పొంగులేటితో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా పొంగులేటికి ఎంపీ టికెట్‌తో పాటు, ఎన్ని నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలు ఉన్నారు..? ఎన్ని టికెట్లు కావాలి..? ఇలా అన్ని విషయాలను మాజీ ఎంపీతో నిశితంగా చర్చించారట. అయితే ఎందుకో తెలియట్లేదు కానీ పొంగులేటి మాత్రం ఇంకా మౌనంగానే ఉంటున్నారు.
ఇదీ రేవంత్ చెప్పిన కథ..!
పొంగులేటి-ఈటల రాజేందర్ భేటీపై (Ponguleti-Etela Meeting) ప్రెస్‌మీట్‌లో ఓ రిపోర్టర్ రేవంత్‌ను ప్రశ్నించారు. ‘చూడమ్మా.. నీకు పెళ్లయ్యింది కదా.. మనం పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు.. పెళ్లి చూపులకు వెళ్లినప్పుడు ఒక్క నువ్వనే కాదు.. నేను కూడా ఐశ్వర్యరాయ్ లాంటి అమ్మాయిని చేసుకోవాలని అనుకుంటా.. చూడంగా.. చూడంగా చివరికి కల్పనారాయ్ దొరికినా సరిపెట్టుకుని పెళ్లి చేసుకుంటాం. ఈటల రాజేందర్ చేరికల కమిటీ కూడా అలాంటిదే. పొంగులేటిని చేసుకోవాలని, జూపల్లిని చేర్చుకోవాలని ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులను చేర్చుకోవాలని బయల్దేరుతారు.. కానీ చివరాకరికి.. (నవ్వుతూ..) ఏమవుతుందో.. ఎలాంటి వారు పార్టీలో చేరుతున్నారో అందరికీ తెలుసు’ అని నవ్వుతూ రేవంత్ ముగించేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక కామెంట్స్ అయితే లెక్కలేనన్ని వస్తున్నాయి.
మొత్తానికి చూస్తే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్లుగా ఇందులో ఐశ్వర్యరాయ్ అంటే ఏ నేత.. కల్పనారాయ్ అంటే ఏ నేత... అనేది నెటిజన్లకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు అటు తిరిగి.. ఇటు తిరిగి ఆ నేతలు కాంగ్రెస్‌లో చేరతారని టీపీసీసీ చీఫ్ అభిప్రాయమా... అని సొంత పార్టీ కార్యకర్తలే రేవంత్‌ను ప్రశ్నిస్తున్నారు. రేవంత్ ఏ అభిప్రాయంతో అన్నారో తెలియట్లేదు కానీ.. కామెంట్ల మోత మాత్రం ఆగట్లేదు. దీనిపైన బీజేపీ నుంచి, ఈటల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.