MLAs Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై 6న హైకోర్టు కీలక తీర్పు.. ఏం తేలుతుందో..!
ABN , First Publish Date - 2023-02-03T20:52:37+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu states) కాదు దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు..
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లోనే (Telugu states) కాదు దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు (TS MLAs Case) కేసుపై ఈనెల 6న హైకోర్టు (High Court) కీలక తీర్పు ఇవ్వనుంది. సీబీఐతో (CBI) విచారణకు గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ఆర్డర్‌పై తెలంగాణ సర్కార్ (TS Govt) డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఈ కేసును సీబీఐకు ఇవ్వాలా..? వద్దా..? అనే అంశంపై ఈనెల 6న తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌లో కీలకం కానుంది. ఫిబ్రవరి-6తో ఈ కేసు ఓ కొలక్కి వచ్చేయనుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనేదానిపై జనాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో మనీలాండరింగ్ (Money Laundering) నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేయడంపై ఈడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎటువంటి మనీలాండరింగ్ జరగనప్పటికీ ఈడీ కేసు నమోదు చేయడం చెల్లదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌కు సమాధానం ఇవ్వడానికి సమయం ఇవ్వాలని రోహిత్‌రెడ్డి (Rohit Reddy) తరఫు న్యాయవాది హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా వేసింది.