KCR Warning : సీఎం కేసీఆర్‌తో కీలక సమావేశం తర్వాత ఏపీ గురించి మల్లారెడ్డి ఏమన్నారో తెలిస్తే.. మరోసారి రచ్చ..

ABN , First Publish Date - 2023-04-27T20:20:22+05:30 IST

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం (BRS Formation Day) రోజున ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది...

KCR Warning : సీఎం కేసీఆర్‌తో కీలక సమావేశం తర్వాత ఏపీ గురించి మల్లారెడ్డి ఏమన్నారో తెలిస్తే.. మరోసారి రచ్చ..

బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం (BRS Formation Day) రోజున ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న ఎన్నికలు, ముందస్తు ఎన్నికలా (Early Elections).. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా..? ఎమ్మెల్యేల టికెట్ల వ్యవహారం, దళిత బంధులో ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేస్తున్నారన్న ఆరోపణలపై ఇలా తాజా పరిణామాలన్నింటిపైనా ప్రజాప్రతినిధులతో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు పలు సలహాలు, సూచనలు ఇవ్వడమే కాకుండా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సమావేశం అనంతరం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.

KCR-BRS-Formation-Day.jpg

మల్లారెడ్డి ఏమన్నారు..?

ప్రజాప్రతినిధుల సమావేశంలో సీఎం కేసీఆర్ తమకు మంచి బూస్ట్ ఇచ్చారని మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల కోసం గట్టిగా పని చేయాలని చెప్పారన్నారు. దేశ ప్రజలంతా కేసీఆర్‌ను కోరుకుంటున్నారని మీడియాకు వెల్లడించారు. అంతేకాదు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని సీఎం తెలిపారన్నారు. ఏపీ పాలనకు తెలంగాణ పాలనకు చాలా తేడా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఏపీకి కూడా త్వరలో కేసీఆర్ వెళ్తారన్నారు. కాగా.. ఏపీ గురించి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఎలాంటి కామెంట్స్ చేశారో.. ఆ కామెంట్స్‌కు ఏపీ మంత్రుల (AP Ministers) నుంచి ఏ రేంజ్‌లో రియాక్ట్ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పటికీ ఆ వివాదం ఇంకా సద్దుమణగలేదు.. ఈ గ్యాప్‌లోనే ఏపీ పాలన గురించి మల్లారెడ్డి కామెంట్స్ చేయడం.. రచ్చకు దారితీసింది. మల్లారెడ్డి కామెంట్స్‌కు ఏపీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు ఇప్పటికే సోషల్ మీడియాలో మల్లారెడ్డిపై ఓ రేంజ్‌లో విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

Malla-Reddy.jpg

త్వరలోనే ప్రకటిస్తాం..!

సమావేశం తర్వాత బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota Chandra Sekhar) మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ సభ, కేసీఆర్ పర్యటన గురించి మీడియాకు వివరించారు. త్వరలోనే ఏపీలో కేసీఆర్ సభ ఉంటుందన్నారు. వైజాగ్‌లో సభ పెట్టాలని నిర్ణయించామని.. త్వరలోనే తేదీ ప్రకటిస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తోందని మరోసారి తోట ప్రకటించారు. ఈ సందర్భంగా.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌లో ఎందుకు పాల్గొనలేదనే విషయంపై కూడా తోట చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు. కొన్ని నిబంధనల కారణంగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ బిడ్డింగ్‌లో సింగరేణి పాల్గొనలేదని స్పష్టం చేశారు. అంతేకాదు.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకునే దమ్ము బీఆర్ఎస్‌కు ఉందని తోట చంద్రశేఖర్ చెప్పుకొచ్చారు.

Thota-Chandra-Sekhar.jpg

స్ట్రాంగ్ వార్నింగ్..

కాగా.. ప్రజాప్రతినిధులతో సమావేశంలో దళితబంధుపై (Dalit Bandhu) సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితబంధులో ఎమ్మెల్యేలు డబ్బులు నొక్కేస్తున్నారని కేసీఆర్‌ ఆరోపించారు. కొందరు ఎమ్మెల్యేలు రూ.3 లక్షల వరకు వసూలు చేశారని, వసూళ్లకు పాల్పడిన ఎమ్మెల్యేల చిట్టా తన దగ్గర ఉందని కేసీఆర్‌ వెల్లడించారు. ఇదే చివరి వార్నింగ్‌.. మళ్లీ రిపీట్‌ అయితే టికెట్‌ దక్కదని, ఆ ఎమ్మెల్యేలను పార్టీ నుంచే సస్పెండ్ చేస్తామని కేసీఆర్‌ హెచ్చరించారు. అనుచరులు వసూలు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని కేసీఆర్ స్పష్టం చేశారు. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలన్నారు. లేకపోతే నష్టపోతారని, సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేల తోకలు కట్‌ చేస్తానని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Avinash In Viveka Case : అవినాష్‌ ముందస్తు బెయిల్‌పై సస్పెన్స్ కంటిన్యూ.. పలు లాజిక్‌లు చెప్పిన ఎంపీ తరఫు న్యాయవాది.. ఫైనల్‌గా ఏం తేలిందంటే..


******************************

BRS Formation Day : రానున్న ఎన్నికల్లో ఎన్ని సీట్లలో గెలుస్తామో ముందే చెప్పేసిన కేసీఆర్.. ఏపీ గురించి ప్రస్తావిస్తూ..

******************************

Avinash In YS Viveka Case : విచారణ కీలక దశలో ఉండగా కొత్త కోణాలు బయటపెట్టిన ఎంపీ వైఎస్ అవినాష్.. సునీతక్క అని సంబోధిస్తూనే..

******************************

KCR Warning: సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కీలక సమావేశంలో కేసీఆర్ సీరియస్ వార్నింగ్
******************************

Updated Date - 2023-04-27T21:13:25+05:30 IST