TS Assembly Polls : బీజేపీ-బీఆర్ఎస్ దోస్తీ బట్టబయలు.. ఖమ్మం సభ తర్వాత మాస్టర్ ప్లాన్ ఇచ్చిన అమిత్ షా..!
ABN , First Publish Date - 2023-08-27T19:28:05+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assebly Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయ్. ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో బీర్ఎస్ జాబితా (BRS First List) ప్రకటించగా.. అధికారపార్టీకి ఊహకందని రీతిలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (TS BJP) పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assebly Elections) సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయ్. ఇప్పటికే 115 మంది అభ్యర్థులతో బీర్ఎస్ జాబితా (BRS First List) ప్రకటించగా.. అధికారపార్టీకి ఊహకందని రీతిలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (TS BJP) పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ స్థాయి నేతలు, ఢిల్లీ పెద్దలు తెలంగాణకు వచ్చి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాయి. శనివారం నాడు చేవెళ్లలో ‘ప్రజా గర్జన’ (Prajagarjana) పేరిట జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని (Mallikarjuna Kharge) పిలిపించి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ (SC ST Declaration) రిలీజ్ చేయించింది. మరుసటిరోజే ఖమ్మంలో ‘రైతు ఘోష- బీజేపీ భరోసా’ (Rythu Gosa BJP Gharosa) పేరుతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను (Amit Shah) పిలిపించి కమలనాథులు భారీ బహిరంగ సభ నిర్వహించారు. అటు బీజేపీ.. ఇటు కాంగ్రెస్ పార్టీల టార్గెట్.. కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి సీఎం కాకుండా చేయడమే. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని ప్రతిపక్షాలు ముందుకెళ్తున్నాయి. ఖమ్మం పర్యటన తర్వాత బీజేపీ కోర్ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి..? బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కోవాలి..? ఇలా పలు విషయాలతో కూడిన మాస్టర్ ప్లాన్‌ను రాష్ట్ర కమలనాథులకు షా వివరిస్తూ దిశానిర్దేశం చేశారు.
ఇంకా ఏమేం ఉన్నాయ్..?
రానున్న ఎన్నికల్లో రాజకీయ పరిస్థితిపై ఆదివారం నాడు బీజేపీ కోర్ కమిటీ (BJP Core Committee) సమావేశం అయ్యింది. ఈ సందర్భంగా.. ప్రస్తుత రాజకీయ పరిణామాలను షా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాస్టర్ ప్లాన్ (Amit Shah Master Plan) ఇచ్చి.. దీని ప్రకారం ఎన్నికల కదనరంగంలోకి దిగాలని రాష్ట్ర నేతలకు సూచించారు. అంతేకాదు.. పలు కీలక సలహాలు, సూచనలు కూడా షా ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా.. తెలంగాణలోని సబ్బండ వర్గాలను ఆకట్టుకునేందుకు ఎలా ముందుకెళ్లాలనేది ఉంది. ‘బీజేపీకి బలమున్న ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని..?.. ఎంపీ స్థానాలు ఎన్ని..?. ఏ జిల్లాలో ఎన్ని స్థానాల్లో మన అభ్యర్థులు గెలుస్తారు. ఏ నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో ఉంటాం..? ’ అని బీజేపీ నేతలను అడిగి అమిత్ షా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. గెలుపు కోసం అధిష్ఠానం నుంచి కావాల్సిన సహకారంపై షా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇకపై ప్రతి పదిరోజులకోసారి ఢిల్లీ నుంచి ఒకరొస్తారని కూడా చెప్పినట్లు సమాచారం.
ఇలా పనిచేయండి..?
‘ తెలంగాణలో రానున్న ది బీజేపీ ప్రభుత్వమే.. ఆ దిశగా పని చేయాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్తి నేతలను బీజేపీలోకి ఆహ్వానించండి. మజ్లిస్, బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలపై దృష్టి సారించండి. బీఆర్ఎస్ అవినీతి, అక్రమాలపై దృష్టి పెట్టాలని ప్రజలకు వివరించాలి. కేంద్రం ఇచ్చిన నిధులు ఏంటి..? తెలంగాణలో బీజేపీ ఏమేం చేసింది..? అసలు బీఆర్ఎస్ వల్ల ప్రజలకు ఒరిగిందేంటి..?. బీఆర్ఎస్ ప్లస్‌లు.. మైనస్‌లు ఏంటి..? ఇలా అన్ని విషయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టండి. పార్టీలో నేతలు మధ్య అధిపత్య పోరు, గ్రూపులు, విభేదాలు పక్కన పెట్టి కలిసికట్టుగా కేసీఆర్‌పై కొట్లాడండి. నేతలంతా వివాదాల జోలికి వెళ్లండా ఐక్యంగా కలిసి పని చేయాలి’ అని కమలనాథులకు మాస్టర్ ప్లాన్‌ను షా వివరించారు. దీంతో పాటు పలు ముఖ్యమైన విషయాలపై రాష్ట్ర నేతలతో ప్రత్యేకంగా షా చర్చించారని తెలిసింది.
దోస్తీ బట్టబయలు..!
గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్-బీజేపీ (BRS-BJP) మధ్య చీకటి ఒప్పందం ఉందని.. దోస్తీగా మెలుగుతున్నాయని కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అక్షరాలా నిజమయ్యాయి. ఖమ్మం సభావేదికగా బీజేపీ-బీఆర్ఎస్ దోస్తీ బట్టబయలు అయ్యింది. ఇదే ఖమ్మంలో కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన ‘జనగర్జన’ (Jana Garjana) సభకు కేసీఆర్ సర్కార్ ఆర్టీసీ బస్సులు (TSRTC Bus) ఇవ్వలేదు. పైగా పొంగులేటి (Ponguleti) అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు జిల్లా నలుమూలల పెద్ద ఎత్తున తరలిరాగా వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడం అప్పట్లో పెద్ద చర్చకే దారితీసింది. అయితే.. ఇవాళ అమిత్ షా సభకు మాత్రం పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు తరలివెళ్లాయి. బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు ఆర్టీసీ బస్సులు ఇచ్చింది. ఇలా చేయడం బీఆర్ఎస్-బీజేపీ మధ్య దోస్తీ ఉన్నట్లు కాదా..? అసలు ఇదంతా దేనికి సంకేతం..? అని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. అయితే రాష్ట్ర ప్రజానీకానికి ఏమాత్రం అనుమానం రాకుండా అటు బీజేపీ.. ఇటు బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఇలా బహిరంగ సభలు, మీడియా ముందుకొచ్చి తిట్టిపోసుకుంటున్నాయనే ఆరోపణ కూడా కాంగ్రెస్ చేస్తోంది. ఇవాళ్టి ఖమ్మం సభలోనూ కేసీఆర్, ఆయన ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో షా ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై బీజేపీ, బీఆర్ఎస్ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సిందే మరి.