Share News

BTech Ravi : బీటెక్ రవి ఏమయ్యారు.. అసలేం జరిగింది.. పూర్తి వివరాలివే..!?

ABN , First Publish Date - 2023-11-14T22:47:59+05:30 IST

BTech Ravi Arrest Issue : కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (BTech Ravi) కిడ్నాప్‌నకు గురయ్యారు.! కడప నుంచి పులివెందుల (Pulivendula) వస్తుండగా రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారు!.

BTech Ravi : బీటెక్ రవి ఏమయ్యారు.. అసలేం జరిగింది.. పూర్తి వివరాలివే..!?

కడప జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి (BTech Ravi) కిడ్నాప్‌నకు గురయ్యారు.! కడప నుంచి పులివెందుల (Pulivendula) వస్తుండగా రవిని 20 మంది ఆగంతకులు ఎత్తుకెళ్లారు!. ఈ ఘటనపై రవి సతీమణి స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదు. పైగా తమకు ఎలాంటి సమాచారం లేదు..? అంటూ చెప్పడం గమనార్హం. అయితే బీటెక్ రవి ఏమయ్యారు..? అసలు ఆయన్ను కిడ్నాప్ చేసిందెవరు..? ఇలా ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఏంటి..? ఇంత జరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదు..? అనేది విస్మయానికి గురిచేసే విషయాలు. అయితే ఇవన్నీ మొదట జరిగిన కథ. అయితే అసలు విషయాన్ని ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.


Ravi-Arrest.jpg

అసలేం జరిగింది..?

బీటెక్ రవిని కడప జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు (SB Police) అరెస్ట్ చేశారు. వారంతా మప్టీలోనే ఉన్నారు. జిల్లాలోని పెండ్లిమర్రి పోలీసు స్టేషన్ పరిధిలో ఆయన్ను అదుపులోనికి తీసుకున్నారు. మొదట వల్లూరు పీఎస్‌కు తరలించిన పోలీసులు.. అనంతరం అక్కడ్నుంచి నేరుగా కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం అక్కడే ఆయన ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఓ పాత కేసులో రవిని అదుపులోనికి తీసుకున్నట్లుగా తెలియవచ్చింది. టీడీపీ యువనేత నారా లోకేష్ కడప జిల్లాలో పర్యటించినప్పుడు రవి.. పోలీసులతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్యంగా మాట్లాడినట్లు తెలిసింది. దీంతో కక్షపెంచుకున్న పోలీసులు పాత కేసులన్నీ బయటికి తోడినట్లుగా సమాచారం. రవిని పోలీసులతో మిస్ బిహేవ్ కేసులో అరెస్టు చేశారా? లేదా మరేదైనా కేసులో అదుపులోకి తీసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వాస్తవానికి పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత.. స్టేషన్‌కు తరలించడం, వైద్య పరీక్షలు చేయించడం ఆ తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే రవిని అరెస్ట్ చేసిన పోలీసులు మాత్రం ఇవేమీ చేయలేదు. ఇప్పుడు రిమ్స్ నుంచి ఎక్కడికి తరలిస్తారు..? అనే విషయం తెలియక కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

Btech-ravv.jpg

సమాధానం చెప్పరేం..?

పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో రవి ఫోన్‌, ఆయనతో ఉన్న ఏ ఒక్కరి ఫోన్ పనిచేయకుండా చేసినట్లుగా తెలిసింది. దీంతో అసలేం జరిగిందో కనీస సమాచారం కూడా లేదు. మరోవైపు.. బీటెక్ రవి అదృశ్యంపై పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులను ఫోన్‌లో కాంటాక్ట్ చేసేందుకు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రయత్నం చేసినప్పటికీ ఒక్కరూ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో అసలు రవి విషయంలో ఏం జరుగుతోందని టీడీపీ శ్రేణులు కంగారుపడుతున్నాయి. ఫోన్ ఎత్తి సమాధానం ఇవ్వకపోవడం.. ఈ అరెస్టుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అసలేం జరుగుతోందో తెలియక కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. కనీసం పోలీసుల వాహనాలతో పాటు మీడియా ప్రతినిధులు వెళ్తున్నప్పటికీ ఎలాంటి సమాచారం వారికి ఎలాంటి సమాచారం.. సమాధానం ఇవ్వకపోవడంతో అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి.

Updated Date - 2023-11-15T08:40:32+05:30 IST