Jagan London Tour: నాడు అంబేద్కర్ పేరుతో అల్లర్లు.. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్
ABN , First Publish Date - 2023-09-09T12:53:46+05:30 IST
ఏపీలో అల్లర్లు సృష్టించడంలో వైసీపీ నేతలకు సాటి ఎవరూ రారని సోషల్ మీడియాలో నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. గతంలో లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు జిల్లాల విభజన పేరుతో కోనసీమలో అంబేద్కర్ పేరుతో అల్లర్లు సృష్టించారని పలువురు గుర్తుచేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా జగన్ మరోసారి లండన్ పర్యటనకు వెళ్లినప్పుడే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయించి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ లండన్ నుంచే ఈ డ్రామాకు శ్రీకారం చుట్టారని.. రాజకీయ కక్షతోనే చంద్రబాబుకు అవినీతి మరకలు అంటించాలని తాపత్రయ పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు లండన్ పర్యటనలో జగన్ ఏం చేశారనే విషయం బయటకు రాకుండా ఉండేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ ప్రభుత్వం పెద్ద డ్రామాకు తెరతీసిందని మండిపడుతున్నారు. అసలు ఒక కేసులో పూర్తి విచారణ లేకుండా.. ఛార్జిషీట్ దాఖలు చేయకుండా.. అరెస్టుపై ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు ఎలా వ్యవహరిస్తారని మండిపడుతున్నారు.
అటు ఏపీలో అల్లర్లు సృష్టించడంలో వైసీపీ నేతలకు సాటి ఎవరూ రారని సోషల్ మీడియాలో నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. గతంలో లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు జిల్లాల విభజన పేరుతో కోనసీమలో అంబేద్కర్ పేరుతో అల్లర్లు సృష్టించారని పలువురు గుర్తుచేస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా జగన్ మరోసారి లండన్ పర్యటనకు వెళ్లినప్పుడే ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయించి రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజంగా అరెస్ట్ చేయాలంటే గత నాలుగేళ్ల పాలనలో ఏం చేశారని నిలదీస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటం, వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరగడంతోనే చంద్రబాబు అరెస్ట్ అంటూ పెద్ద నాటకానికి తెరతీశారని.. పైగా కోర్టుకు సెలవులు ఉన్న సమయంలో అరెస్ట్ చేయడం కూడా పథకం ప్రకారమే జరిగిందని అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan on Chandrababu Arrest: రాజకీయ కక్ష సాధింపు వల్లే చంద్రబాబు అరెస్ట్
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయించే ధైర్యం జగన్‌కు లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బాబాయ్ హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాథమిక ఆధారాలు లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ ఎలా చేయిస్తారని నెటిజన్‌లు ప్రశ్నిస్తున్నారు. చంద్రుడిపై ఉమ్మి వేస్తే అది తనపైనే పడుతుందని జగన్ తెలుసుకోవాలని హితవు పలుకుతున్నారు. తమ నాయకుడి అరెస్ట్ పట్ల కనీసం సంఘీభావం తెలపకుండా టీడీపీ నేతలను, అభిమానులను గృహ నిర్బంధం చేస్తుండటం.. సామాన్య ప్రజలకు రవాణా సౌకర్యం అందుబాటులో లేకుండా బస్సులను నిలిపివేయడం వైసీపీ ప్రభుత్వ పరాకాష్టకు నిదర్శనం అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.