TS Assembly Polls : తెలంగాణలో అధికారం ఎవరిదో తేల్చేసిన ఇండియా టుడే- సీ ఓటర్ సర్వే!
ABN , First Publish Date - 2023-10-21T14:08:53+05:30 IST
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. ఈసారి ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్.. ఎట్టి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. ఈసారి ఎలాగైనా సరే హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్.. ఎట్టి పరిస్థితుల్లో సీఎం కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రముఖ సంస్థలు రిలీజ్ చేస్తున్న ఎన్నికల సర్వేలతో పార్టీ అధినేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. ఇప్పటి వరకూ రిలీజ్ అయిన దాదాపు అన్ని సర్వేలు తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమని తేల్చేశాయి. తాజాగా మరో ప్రముఖ సంస్థ.. ఇండియా టుడే-సీఓటర్ తమ సర్వేను రిలీజ్ చేసింది. ఈ సర్వేలో కూడా కాంగ్రెస్‌దే హవా అని తేలిపోయింది. ప్రస్తుతం ఈ సర్వే తెలంగాణ రాజకీయాల్లో, ఎన్నికల్లో పెను సంచలనంగా మారింది. తాజా సర్వేను బట్టి చూస్తే బీఆర్ఎస్ షాకేనని చెప్పుకోవచ్చు. అయితే.. బీజేపీ ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఏ మాత్రం పుంజుకున్నా ప్రభావం ఉండదని సర్వే తేల్చేసింది.
ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే ఏం తేల్చింది..?
కాంగ్రెస్ : 54 సీట్లు
బీఆర్‌ఎస్ : 49 సీట్లు
బీజేపీ : 08 సీట్లు
ఓట్ల శాతం :-
కాంగ్రెస్ : 39 శాతం
బీఆర్‌ఎస్ : 38 శాతం
ఏం జరుగుతుందో..?
ఇండియా టుడే- సీ ఓటర్ సర్వేను నిశితంగా పరిశీలిస్తే.. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్య నువ్వా- నేనా అన్నట్లుగా పోటీ ఉందని స్పష్టంగా అర్థం అవుతోంది. అంతేకాదు.. కేసీఆర్ పాలనా వైఫల్యాలను సైతం సీఓటర్ సర్వే నిశితంగా చర్చించి.. వివరించింది కూడా. ఈ సర్వేతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఎనలేని ఉత్సాహం వచ్చింది. మరోవైపు.. ఇంత పెద్ద సంస్థ చేసిన సర్వేలోనే ఇన్ని సీట్లు వస్తాయని తేలిందంటే పరిస్థితి ఏంటని గులాబీ పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారట. ఇవాళ సాయంత్రం లేదా.. రేపు ఉదయం పార్టీ ముఖ్యులతో కేసీఆర్ సమావేశం అవుతారని తెలిసింది. ఇప్పటి వరకూ సొంత సర్వేలు.. సొంత సంస్థలతోనే కాంగ్రెస్ ఇలా చేయించిందని విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ నేతలు.. తాజా సర్వేపై ఎలా రియాక్ట్ అవుతారనేదానిపై రాష్ట్ర ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.