YSRCP: వైసీపీ మరో కుట్ర.. చంద్రబాబు పేరుతో వాయిస్ కాల్స్

ABN , First Publish Date - 2023-09-13T13:18:10+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కుట్రకు తెరలేపింది. చంద్రబాబు పేరుతో ప్రజలకు వాయిస్ కాల్స్ చేస్తూ టీడీపీపై దుష్ప్రచారం చేస్తోంది. 040 69131484 నంబరు నుంచి ఈ ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు టీడీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు.

YSRCP: వైసీపీ మరో కుట్ర.. చంద్రబాబు పేరుతో వాయిస్ కాల్స్

ఏపీలో జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను ముమ్మరం చేసింది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మరో కుట్రకు తెరలేపింది. చంద్రబాబు పేరుతో ప్రజలకు వాయిస్ కాల్స్ చేస్తూ టీడీపీపై దుష్ప్రచారం చేస్తోంది. 040 69131484 నంబరు నుంచి ఈ ఫోన్ కాల్స్ చేస్తున్నట్లు టీడీపీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ నంబర్ నుంచి ఫోన్ రాగానే చంద్రబాబు చేసిన స్కాంలు అంటూ వాయిస్ ప్లే అవుతోంది. దీంతో ఈ కాల్స్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో ప్రచారానికి వినియోగించే ఈ విధానాన్ని ఇప్పుడు చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో టీడీపీ లక్ష్యంగా అమలు చేస్తుండటం వైసీపీ కుట్రేనని.. తమ పార్టీపై బురద జల్లాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తోందని పలువురు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి: జగన్ దేనికైనా తెగించే అవకాశం ఉంది: గోనె ప్రకాశరావు

ఈ ఫోన్ కాల్స్ ఏపీలోని చాలా మందికి రావడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మద్దతుగా రోడ్లపైకి వచ్చిన టీడీపీ అభిమానులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. జగన్ కుట్రలను నిరసిస్తూ ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ టీడీపీ అభిమానులు ఆందోళన బాట పడుతున్నారు. హైదరాబాద్ విప్రో సర్కిల్ వద్ద బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నిరసన తెలపనున్నట్లు ఐటీ నిపుణులు వెల్లడించారు. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుకు భద్రత లేదని కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ అభిమానులు కలవరపడుతున్నారు.

Updated Date - 2023-09-13T13:18:10+05:30 IST