100 Years Life: ఈ 5 రకాల ఆహార పదార్థాలను తినండి చాలు.. 100 ఏళ్ల లైఫ్‌కు అవే గ్యారెంటీ..!
ABN , First Publish Date - 2023-09-14T17:29:18+05:30 IST
ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను బ్లూ జోన్లు గా పిలుస్తున్నారు. చాలా సులువుగా వంద సంవత్సరాలకు పైగా జీవిస్తున్న ఘనత ఈ ప్రాంత ప్రజలది. వారు తీసుకునే ఆహారమే వారికి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తోంది. వారు తినే ఆహారం ఏంటంటే..
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ మనిషి డబ్బును సంపాదించినంత సులువుగా ఆరోగ్యాన్ని సంపాదించలేకపోతున్నాడు. తినే తిండి నుండి అన్నీ కలుషితమే. వీటివల్ల మనిషి శరీరం కూడా కలుషితమై జీవితకాలం తగ్గిపోతోంది. కానీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాలను బ్లూ జోన్( Blue zone)లుగా పిలుస్తున్నారు. చాలా సులువుగా వంద సంవత్సరాలకు పైగా జీవిస్తున్న ఘనత ఈ ప్రాంత ప్రజలది. వారు తీసుకునే ఆహారమే వారికి దీర్ఘాయుష్షును ప్రసాదిస్తోంది. విచిత్రం ఏమిటంటే అవన్నీ మనకు కూడా అందుబాటులో ఉండే ఆహారాలే. అలాగని అవేవో చికెన్, మటన్, ఇంకా ఖరీదైన ఆహారాలు అనుకుంటే పొరపాటే.. ఈ 5రకాల ఆహారాలు రోజూ తీసుకుంటూ ఉంటే 100ఏళ్ళ ఆయుష్షు గ్యారెంటీ అంటున్నారు. అవేంటో తెలుసుకుంటే..
బీన్స్.. బఠానీ.. కాయ ధాన్యాలు.. చిక్కుళ్లు..
బ్లూజోన్ లో నివసిస్తున్న ప్రజలు శనగలతో మొదలు బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స వరకు బోలెడు రకాల చిక్కుళ్లు తింటారు. సోయాబీన్స్ జపాన్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ప్రతి రోజూ కనీసం అరకప్పు అయినా బీన్స్ తమ ఆహారంలో తీసుకుంటారట. దీనివల్ల వారికి రోజువారి అవసరమైన ప్రోటీన్ సమృద్దిగా అందుతుంది. వీటితో పాటు బీన్స్ కాయలు కూడా బాగా తీసుకుంటారు. ఇందులో ఫైబర్ శరీరానికి చాలా మంచిది.
Viral Video: అమ్మ బాబోయ్.. అక్కడ ఎలా నిద్రపడుతోందయ్యా సామీ.. పొరపాటున జారి కింద పడితే..!
తృణధాన్యాలు..
తృణధాన్యాలలో కార్బోహైడ్రేట్ నుండి ప్రోటీన్, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. గోధుమలు, క్వినోవా, వరి, ఓట్స్.. మనకు అందుబాటులో ఉన్నవి చూస్తే జొన్న, సజ్జ, సిరి ధాన్యాలు, రాగులు మొదలైనవి చాలా గొప్ప పోషకాలు కలిగి ఉంటాయి. వీటిలో అమైనో అమ్లాలతో పాటు ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది.
విత్తనాలు.. గింజలు..
ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. గుమ్మడి, వేరుశనగ, బాదం, హెంప్, అవిసె మొదలైన గింజలలో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు మంచి ఫైబర్ ఉంటుంది. ప్రోటీన్ కూడా ఉంటుంది. తక్కువ మొత్తంలో తీసుకున్నా ఇవి ఎక్కువ శక్తిని ఇస్తాయి.
Child Health: 18 నెలల వయసు దాటిన పిల్లలు అసలేం తినొచ్చు..? తినకూడని ఆహార పదార్థాలు ఏమైనా ఉన్నాయా..?
చేపలు..
శాఖాహారంలో దొరకని కొవ్వులు చేపలలో దొరుకుతాయి. చేపలు గొప్ప పోషకాహారంగా పరిగణించబడతాయి. సార్డినెస్, ఆంకోవీస్ వంటి చిన్న చేపలను తినేవారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంటుంది. వారానికి కనీసం మూడుసార్లు చేపలు తింటే మంచి ప్రోటీన్లు అందుతాయట.
పాలు.. పాల ఉత్పత్తులు..
పాలు, పాల ఉత్పత్తులు ప్రతి ప్రాంతంలో ప్రసిద్ది చెందాయి. పాలు, పెరుగు, పనీర్ సమృద్దిగా తీసుకునేవారిలో పోషకాహార లోపం అనేది కనిపించదు. ఇటలీ,. గ్రీస్ లోని కొన్ని ప్రాంతాలలో గొర్రె లేక మేక పాలతో తయారుచేసే చీజ్ ఎక్కువగా వాడతారు. వీటితోపాటు వారానికి కనీసం నాలుగైదు సార్లు గుడ్డు కూడా తింటుంటారు. ఇవన్నీ తింటే ఎవరికైనా సరే 100ఏళ్ళ ఆయుష్షు గ్యారెంటీ.