Viral: ఎవరీ పెద్దాయన..? ఏరికోరి మరీ ఈ వృద్ధుడి గురించి ఆనంద్ మహీంద్రా ఎందుకు పోస్ట్ చేశారంటే..!

ABN , First Publish Date - 2023-07-25T15:46:18+05:30 IST

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపార కార్యకలపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కొంత సమయం కేటాయిస్తుంటారు. తనకు నచ్చిన వీడియోలను, విశేషాలను ఎప్పటికప్పుడు ట్విటర్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ పెద్దాయన గురించి షేర్ చేశారు.

Viral: ఎవరీ పెద్దాయన..? ఏరికోరి మరీ ఈ వృద్ధుడి గురించి ఆనంద్ మహీంద్రా ఎందుకు పోస్ట్ చేశారంటే..!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన వ్యాపార కార్యకలపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కొంత సమయం కేటాయిస్తుంటారు. తనకు నచ్చిన వీడియోలను, విశేషాలను ఎప్పటికప్పుడు ట్విటర్‌ (Twitter)లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ పెద్దాయన గురించి షేర్ చేశారు. ఆ వృద్ధుడు అమృతసర్‌ (Amritsar)లో టీ దుకాణం (Tea shop) నడుపుతున్నాడు. అందులో విశేషం ఏముంది అనుకుంటున్నారు. ఆ పెద్దాయన కథ తెలుసుకుంటే మాత్రం అలా అనరు.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన ఆ పెద్దాయన పేరు అజిత్ సింగ్ (Ajit Singh). అమృత్‌సర్‌లోని ``గోల్డెన్ టెంపుల్`` సమీపంలో 150 సంవత్సరాల పురాతనమైన మర్రి చెట్టు ఉంది. దాదాపు 40 ఏళ్లుగా ఆ మర్రి చెట్టు లోపల అజిత్ సింగ్ టీ దుకాణం నడుపుతున్నాడు (Tea shop in banyan tree). అజిత్ సింగ్ 40 ఏళ్ల క్రితమే తన కుటుంబానికి దూరమై సన్యాసిగా జీవితం గడుపుతున్నాడు. అతడి టీ దుకాణంలో ఎవరైనా టీ తాగి డబ్బులు ఇస్తే తీసుకుంటాడు. ఇవ్వకపోయినా పట్టించుకోడు. 40 ఏళ్లుగా అజిత్ సింగ్ ఆ టీ దుకాణంతోనే జీవనం సాగిస్తున్నాడు.

Viral Video: ఈ పిల్లి ట్యాలెంట్ అమోఘం.. మనిషిని అనుసరిస్తూ ఎలా మ్యాజిక్ చేసిందో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో!

అజిత్ సింగ్ కథ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రాను ఎంతగానో కదలించింది. ఎప్పుడైనా తాను అమృత్‌సర్‌కు వెళితే స్వర్ణ దేవాలయంతోపాటు ఆ టీ దుకాణాన్ని కూడా సందర్శిస్తానని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఆ టీ దుకాణాన్ని ``టెంపుల్ ఆఫ్ టీ సర్వీస్`` అని అభివర్ణించారు. ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయింది.

Updated Date - 2023-07-25T15:46:18+05:30 IST