Viral Video: ఈ బామ్మను చూసి సిగ్గుపడాల్సిందే.. 68 ఏళ్ల వయసులో ఆమె చేస్తున్న వర్కవుట్లు చూడండి..

ABN , First Publish Date - 2023-08-02T18:39:29+05:30 IST

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, జిమ్‌కు వెళ్లాలని అందరికీ తెలుసు. కానీ, చాలా మంది యువతీయువకులు వ్యాయామం చేయకుండా ఉండడానికి సాకులు వెతుక్కుంటారు. పెద్ద వారి సంగతి చెప్పనే అక్కర్లేలేదు.

Viral Video: ఈ బామ్మను చూసి సిగ్గుపడాల్సిందే.. 68 ఏళ్ల వయసులో ఆమె చేస్తున్న వర్కవుట్లు చూడండి..

ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం (Exercise) చేయాలని, జిమ్‌ (Gym)కు వెళ్లాలని అందరికీ తెలుసు. కానీ, చాలా మంది యువతీయువకులు వ్యాయామం చేయకుండా ఉండడానికి సాకులు వెతుక్కుంటారు. పెద్ద వారి సంగతి చెప్పనే అక్కర్లేలేదు. వయసు పెరిగిపోయాక కఠినమైన వ్యాయామాలు చేయకూడదు అనుకుంటారు. అయితే 68 ఏళ్ల వయసున్న ఓ బామ్మ (Old woman) జిమ్‌లో కఠిన వ్యాయామలు చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

weightliftermummy అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ బామ్మ జిమ్‌లో యువకుల్లాగానే వ్యాయామాలు చేస్తోంది. స్క్వాట్‌లు, ప్లాంక్‌లు చేయడం దగ్గర్నుంచి వెయిట్ లిఫ్టింగ్ వరకు అన్ని వర్కవుట్లు చేస్తోంది. సునాయాసంగా బరువులు ఎత్తేస్తోంది. ఆమె కుమారుడు ప్రోత్సాహంతోనే ఆమె ఈ వయసులో కూడా చురుగ్గా వ్యాయామాలు చేస్తోంది. ఆమె వర్కవుట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పట్నుంచి ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (old woman hard workouts in gym).

Viral Video: దొంగ ఎలుక.. ఎవరూ లేనపుడు డైమండ్ నెక్లెస్‌ను ఎలా కాజేసిందో చూడండి.. వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

ఆ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. దాదాపు 31 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. వీడియోలోని బామ్మ పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ``ఏ వయసు వారికైనా ఆరోగ్యంగా ఉండాలనే కోరిక ముఖ్యం``, ``ప్రతి తల్లికి అలాంటి కొడుకు ఉండాలి``, ``ఆమెకు హ్యాట్సాఫ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-08-02T18:39:29+05:30 IST